నారదుడిలా అడిగాడు :-
ఓ విప్రోత్తమా ! శ్రీ యఃపతి యగు వాసుదేవుని పురూరవుడు నక్షత్ర పురుష వ్రతం ద్వారా ఎలా ఆరాధించినదీ చెప్పండి అందుకు పులస్త్యుడు చెప్ప మొదలు పెట్టాడు. నారదా ! నక్షత్ర పురుష వ్రత విధానమూ శ్రీహరి నక్షత్రాంగాల వివరమూ చెబుతున్నా వినుము. శ్రీహరి చరణాలలో మూలా నక్షత్రం జంఘలలో రోహిణీ నక్షత్రం ఉంటాయి. మోకాళ్లలో అశ్వినులు రూపొందుతాయి తొడలలో ఆషాఢా నక్షత్రం ఉంటే గుహ్యేంద్రియం రెండు ఫల్గునీలకు ఆవాసం. కృత్తికలు నడుము భాగాన ఉంటవి ఆ వాసుదేవుని ప్రక్కల (కక్ష్య) లో భాద్రపద నక్షత్రాలు, కడుపులో రేవతీ నివాసం చేస్తుంటాయి వక్షః స్థలం అనూరాధకు, శ్రనిష్ఠకు వీపు నెలవులు. విశాఖ ఆ ప్రభువు భుజాలలో ఉంటే హస్తాల నక్షత్రం రెండు చేతులలో ఉంటుంది. వ్రేళ్ళు పునర్వసుకూ, గోళ్లు ఆశ్లేషకు నెలవులు. జ్యేష్ఠా నక్షత్రం స్వామి మెడలోనూ శ్రవణం రెండు చెవులలోను ఉంటాయి . నోరు పుష్యమికి ఆవాసం, పలు వరస స్వాతికి నెలవు. వరుకొదైవత మైన శతభిషా నక్షత్రం దవడల నాశ్రయించి ఉంటే, ముక్కు మొఖకు ఆశ్రయం. మృగశిర నేత్రాల రూపంలో ఉంటుంది. లలాట భాగాన చిత్రా, శిరోదేశాన భర్దణి నిలచి ఉంటవి. కేశాల రాపంలో ఆర్ద్రా నక్షత్రం నెలవై యుంటుంది. ఇదే శ్రీ మన్నారాయణుని నక్షత్ర పురుషరూపము.
ఇక నారదా ! నక్షత్ర రూపంలో వెలిగే ఆ శ్రీ వల్లభుని వ్రత విధానం విను. ఆ ప్రకారం ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ ఆ ప్రభువు సఫలం చేస్తాడు. చైత్రశుద్ధ అష్టమినాడు చంద్రుడు మూలా నక్షత్రంతో కలిసి ఉన్నప్పుడు శ్రీహరి దివ్య చరణాలను విధి విపాతంగా పూజించి నక్షత్రం గోచరించినంతనే విప్రులకు భోజనం పెట్టాలి అశ్వనీ యోగంలో చంద్రుడు ఉన్నప్పుడు భక్తితో స్వామి మోకాళ్ళకు పూజించి హవిష్యాన్నం దోహదకారిగా సమర్పించి వెనుకటివలనే బ్రాహ్మణ భోజనం చేయించాలి. పూర్వం ఉత్తరాషాఢంలో చంద్రుడున్నప్పుడు శ్రీహరి రెండు తొడలనూ విజ్ఞుడు పూజిచి దోహదకారిగా చల్లని జలము సమర్పించాలి. తెలిసిన ఆస్తికుడు పూర్వ ఉత్తర ఫల్గుణీ నక్షత్ర యోగంలో ప్రభువు గుహ్యం గాని అర్పించి ఆవుపాలు దోహదంగా ఇచ్చి బ్రాహ్మణ భోజనం చయించాలి. చంద్ర కృత్తికా యోగాన జితేంద్రియుడై ఉపవసించి స్వామికటి భాగాన్ని పూజించి పూలవాసనులు వెదజల్లే జలము దోహదంగా అర్పించాలి. శశి పూర్వ ఉత్తరాభాద్రలయోగంలో శ్రీహరి పార్శ్వభాగానలు (చంకలు) పూజించి ఇష్టసిద్ధికి బెల్లపు ఉండలు అర్పించాలి. శశిరేవతీ యోగంలో రెండు కడుపులను (పైది కిందిది) పూజించి పసరలడ్లు దోహదంగా అర్పించాలి. అనూరాధ చంద్రయోగాన జఠరాన్ని పూజించి బియ్యపు పేలాలు దోహదంగా ఇవ్వాలి. శ్రీ విష్టా యోగంలో వీపు భాగాన్ని పూజించి శాల్యన్నం దోహదంగా సమర్పించాలి. విశాఖ యోగాన పరమాన్నం దోహదంతో శ్రీహరి భూజాలు రెండు అర్చిచాలి. హస్తా నక్షత్ర యోగంలో రెండు చేతులు పూజించి యవాన్నం దోహదం యివ్వాలి. పునర్వసు యోగాన వ్రేళ్ళు పూజించి దోసపండ్లు దోహదంగా యివ్వాలి. ఆశ్లేషా శశియోగంలో గోళ్ళు పూజించాలి. తిత్తిరమాంసం దోహదం. జ్యేష్ట్యా చంద్రయోగంలో నూవులడ్డూ దోహదంతో శ్రీహరి మెడను అర్చించాలి. శ్రవణ శశియగంలో స్వామి చెవులను పూజించి పెరుగన్నం దోహదంగా అర్పించాలి. పుష్యయోగంలో ముఖాన్ని పూజించి నేతి పాయసదోహదం అర్పించాలి. స్వాతి చంద్రయోగాన దంతపంక్తిని పూజించి నూనుల వడలు నివేదించాలి. శ్రీ వల్లభుని ప్రీత్యర్థం బ్రాహ్మణ భోజనం చేయించాలి. శతభిషా చంద్ర యోగాన ప్రభువు దవడలను చక్కగా పూజించి ఆ మధుసూదనునకు ఎర్రబియ్యం ప్రియం గవాన్నం దోహదం అర్పించాలి. మృగశిర్ష యోగంలో నేత్రపూజ, లేడి మాంసం దోహదం, చిత్రా యోగంలో లలాట పూజ మృష్టాన్న దోహదం కర్తవ్యాలు. చంద్రభరిణీ యోగంలో శిరస్సును పూజించి రుచ్యమైన అన్నం దోహదంగా యివ్వాలి. విద్వాంసుడు ఆర్ద్రా చంద్ర యోగాన స్వామి కేశజాలాన్ని అర్చించి అల్లము, బెల్లముతో చేసిన కుడుములు దోహదంగా నివేదించి విప్రోత్తములకు భోజనం పెట్టాలి. ఈ విధంగా చంద్ర నక్షత్ర యోగాలలో జగన్నాధునుని యథావిథిగా భక్తితో పూజించి వ్రతానంతరము బ్రాహ్మణ దంపతులకు భోజనం పెట్టి చక్కని వస్త్రాలు ఇవ్వాలి. వర్థిష్టులైన సజ్జనులు బ్రాహ్మణునకు ఛత్రం, పాదరక్షలు, సప్తవిధాలయిన ధాన్యాలు బంగారం నేతితో నింపిన పాత్ర, వ్రతోద్యోదాపనగా భక్తితో సమర్పించాలి.
అవ్యయుడైన జనార్దనుడు నక్షత్ర మయుడు. కనుక పూజా క్రమంలో ప్రతి నక్షత్ర యోగాన బ్రాహ్మణార్చన జరగాలి నక్షత్ర పురుష వ్రతం వ్రతాలలో కెల్ల ఉత్తమమైనది. పూర్వకాలంలో భృగుమహర్షి సర్వ పాప హరమైన ఈ వ్రత మాచరించాడు. ఓ దేవర్షీ! జగన్నాధుని అంగోపాంగాల నీవిధంగా పూజించిన వారల సర్వాంగాలూ సుందరంగా చూడముచ్చటగా ఉంటాయి. ఏడు జన్మలలో చేసిన పాపం కుల క్రమాగతంగా వచ్చిన దోషాలు, తల్లి దండ్రులు చేసిన పాపాలూ అన్ని విధాల పాపాలనూ, ఈ వ్రతం వల్ల సంతోషించి శ్రీధరుడు నశింప చేస్తాడు. సమస్త కళ్యాణాలు, ఉత్తమమైన శరీరారోగ్యం, అమితమైన మానసోల్లాసము, చక్కని రూపసౌందర్యము మధురమైన వాక్కు సర్వత్రా గౌరవం, యితరా లయిన ఈ ప్సితార్థాలన్నీ నక్షత్ర పురుషుడైన జనార్దనుడు ప్రసాదిస్తాడు నారదా ! ఈ నక్షత్ర యోగాలన్నింటి యందు చక్కగా ఉపవసించి ప్రభువును పూజించి అరుంధతీ దేవి స్త్రీలోకాని కంతకూ పూజ్యు రాలైంది. నక్షత్రాంగ పురుషుని అర్చించి సూర్య దేవుడు, గోవిందుడినే కుమారుడుగా పొందాడు. అతడే రేవంతుడు ఈ వ్రతంచేసి రంభ రూప సౌందర్యాన్నీ, మేనక మధుర మైన వాక్కునూ, చంద్రుడు చక్కని కాంతినీ, పురూరవుడు రాజ్యాన్నీ సంపాదించారు. ఓ నారదా ! ఈ విధంగా నక్షత్రాంగ రూపునిగా జనార్దనుని ఎవరెవరు పూజించారో వారంతా తమ కోర్కెలు నెరవేర్చు కున్నారు. పరమ పవిత్రం, యశోధన రూప ప్రదాయకం, ధన్యతమం అయిన నక్షత్ర పురుష వ్రత విధానం నీకు వినిపించాను. ఇక పవిత్రమైన తీర్థ యాత్రా వివరణం వినుము
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹