Skip to content Skip to footer

🌹🌹🌹 శ్రీ వామన మహాపురాణం🌹🌹🌹 – నలబై ఎనిమిదవ అధ్యాయం

సరోవర మాహాత్మ్యం

దేవదేవుడిలా అన్నాడు :- ఆ విధంగా పృథూదక క్షేత్రం పాపభయం వినారకం . కాన దేవతలారా! సన్నిహిత తీర్థం వరకు సూచించబడిన ఆ మహాతీర్థానికి మీరు వెళ్ళండి. మృగశిర నక్షత్రంలో సూర్యచంద్ర బృహస్పతులు చేరిన పవిత్ర తిథి అక్షయ అనిపించుకుంటుంది. అక్కడ ప్రాచీన సరస్వతీ తీరానికి వెళ్ళి భక్తితో శ్రాద్ధ కర్మ నిర్వర్తించి పితరులను ఆరాధించండి. మహావిష్ణువు చెప్పిన హితోక్తులు విని ఇంద్ర పురోగాములై దేవతలు కురుక్షేత్రంలోని పావన పృథూదక తీర్థానికి వెళ్ళారు. అక్కడ స్నానంచేసి దేవతలు బృహస్పతిని ప్రార్థించారు. “మహాత్మా మృగశిరా నక్షత్రంలో ప్రవేశించి ఈ తిథి పవిత్రం కావించండి. సూర్యుడు చంద్రుడు కూడ అందులో ప్రవేశించారు. గురుదేవాః ఇక దేవతల కార్యమంతా మీమీద ఆధారపడి ఉంది. అందులకు బృహస్పతి నాకు ఈ సంవత్సరాధిపత్యం యిస్తేనే మీరు చెప్పినట్లు చేయువాడ” ననగా దేవతలందులకంగీకరించారు. వెంటనే బృహస్పతి మృగశిరలో ప్రవేశించాడు. ఆషాఢంలో మృగశిరానక్షత్రయుక్త అమావాస్యనాడు దేవేంద్రుడు ప్రీతిపూర్వకంగా కురుక్షేత్రంలో పితరులకు, తిలమధుహవిష్యాన్నంతో చేసిన పిండ ప్రదానం చేశాడు. అందులకు సంతుష్టులై పితృదేవతలు కుమారులకు హిమవంతునితో వివాహానికై తన కుమార్తె మేనాదేవిని అప్పగించారు. దేవతల ప్రసాద రూపంలో అ మేనాదేవిని స్వీకరించి ఆమెతో ఇష్టసుఖాలు అనుభవించాడు. ఆ మేనాదేవి ఆ శైలాధిపతికి దేవకన్యలతో సమానలైన ముగ్గురు అందమైన కుమార్తెలను కని యిచ్చినది.

ఇది శ్రీ వామన మహాపురాణం లో సరోవర మాహాత్మ్యం యిరవైనాలుగవ అధ్యాయం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment