భీష్మ పంచక వత్రం
కార్తికమాసమంతా ఏకభుక్తాలతో, నక్తవ్రతాలతో, అయాచిత వ్రతాలతో,కూర పాలు పండ్లు వీటిలో నొక ఆహారంతో ఉపవాసాలతో హరి పూజనం గావిస్తూ గడపాలి. అలా గడిపిన వారికి అన్ని పాపాలూ నశించి అన్ని కోరికలూ తీరి, హరిని కటవాస ప్రాప్తి కలుగుతుంది.
హరివ్రతమెప్పుడైనా శ్రేష్టమే కాని, సూర్యుడు దక్షిణాయనంలోనికి వెళ్ళినపుడు చేసే ఈ వ్రతాలు అధిక ప్రశస్తాలుగా పేర్కొనబడుతున్నాయి.
ఈ కాలం తరువాత చాతు ర్మాసాలూ, కార్తికమాసం సముచితాలుగా చెప్పబడుతున్నాయి. సాధారణంగా కార్తిక శుద్ధ ఏకాదశి నాడీ వ్రతాన్ని మొదలుపెడతారు.
ఈ రోజు త్రి సంధ్యలలో స్నానాలు చేసి యవాది పదార్థాలతో పితరులకు నిత్యపూజలను గావించి అప్పుడు హరిని పూజించాలి.
ప్రతి మౌనంగా నెయ్యి, తేనె, చక్కెర, పంచగవ్యాలు, నీరులతో హరి మూర్తికి స్నానం చేయించి కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో హరి శరీరానికి అనులేపనం చేయాలి.
సాధకుడు పున్నం వరకూ ప్రతిరోజూ విష్ణుదేవునికి నేతి తోడి గుగ్గిల ధూపాన్నిచ్చి పక్వాన్నాలనూ మధురమైన మిఠాయిలనూ నైవేద్యంగా సమర్పించి ఓం నమోవాసుదేవాయ అనే మంత్రాన్ని నూటెనిమిది మార్లు జపించాలి.
తరువాత ఇదే మంత్రాన్ని స్వాహాయుక్తంగా పఠిస్తూ బియ్యం, నువ్వులు, నెయ్యిలను కలిపి వాటితో (దానితో) ఆహుతులివ్వాలి.
ప్రతి తొలిరోజు కమల పుష్పాలతో శ్రీమన్నారాయణుని పాదాలనూ, మలిరోజు బిల్వపత్రాలతో జంఘలనూ, మూడవరోజు గంధంతో నాభినీ, తరువాతి దినాన బిల్వ పత్రాలతో జవాపుష్పాలతో స్కంధమునూ, చివరిరోజు మాలతీ పుష్పాలతో స్వామి శిరోభాగాన్నీ పూజించాలి.
ఈ అయిదురోజులు పుడమిపైనే నిద్రించాలి. ఈ రోజుల్లో క్రమంగా గోమయం, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యిలను మాత్రమే రాత్రి నోటిలో వేసుకోవాలి. పగలంతా ఏమీ తినరాదు.
ఈ వ్రతం వల్ల ఇహంలో భోగం, పరంలో మోక్షం కూడాలభిస్తాయి. మాసంలోని రెండు పక్షాలలోనూ ఈ వ్రతాన్ని చేసిన వారికి ఏయే పాపాలుచేస్తే నరకానికి పోతామో ఆయా పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి.
(దీన్ని భీష్మపంచక వ్రతమని ఎందుకన్నారో తెలియరాలేదు. శోధించాలి) సూతకులూ, మృతకులూ కూడా అశౌచకాలంలో కూడా గురించి ఈ వ్రతాన్ని చేయవచ్చును.
(సూతకయనగా పుట్టుక, మృతకయనగ బంధుమరణము) దశమీ ఏకాదశీ ఒకేరోజులో పడితే అది అసురదినమవుతుంది. కాబట్టి అటువంటి రోజు వ్రతం గాని ఉపవాసం కాని చేయరాదు.
తొంబై రెండవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹