Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – తొంబై ఒకటవ అధ్యాయం

మాసోపవాస వ్రతం

ఇది సర్వోత్తమ వ్రతాలలో ఒకటి. ఈ వ్రతాన్ని వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు పాలన చేసారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం చేసి ప్రతారంభంలో విష్ణు భగవానునిలా ప్రార్థించాలి.

ఆద్యప్రభృత్యహం విష్ణో యావదుత్థానకం తమ ||

అర్చయే త్వామనశ్నంస్తు దినాని త్రింశదేవ తు ||

కార్తికా శ్వినయోర్విష్ణో ద్వాదశ్యోః శుక్లయోరహం ||

మ్రియే యద్యంతరాలే తువ్రతంభంగో నమేభవేత్ ||

స్వామీ! నీవు లేచేదాకా నేనేమి తినను. ఈ ఆశ్వయుజ కార్తిక శుద్ధ ద్వాదశులమధ్య నేను మరణిస్తే ఆవిధంగా వ్రతం చెడినా ఫలితం మాత్రం నాకు దక్కించు అని ఆయనను వేడుకొని మధ్యాహ్న, సాయంకాలాలలో స్నానం చేసి, హరిని, దేవాలయానికి పోయి సుగంధాదులతో పూజించాలి. ప్రతి మాత్రము తాను ఉబటన, సుగంధిత గ్రంధాలే పాదులను పూసుకోరాదు.

ద్వాదశినాడు భగవానుడైన హరిని పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఒక మాసం దాకా హరినే పూజిస్తూ మంచినీళ్ళే త్రాగుతూ అప్పుడు పారణ చేయాలి. మధ్యలో ప్రతి నీరసంతో మూర్ఛపోతే ఇతరులు ఆయన నోటిలో పాలుపోయవచ్చు. దీనివల్ల వ్రత భంగం కాదు. ఈ వ్రతం భక్తి, భుక్తి, ముక్తిదాయకం.

తొంబై ఒకటవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment