Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై ఐదవ అధ్యాయం

తిథులూ – వ్రతాలూ

బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇంకా ఇలా చెప్పాడు. “హే వ్యాసమునీ! ఇపుడు నేను కొన్ని వ్రతాలను నీకు ఉపదేశిస్తాను. వీటిని శ్రద్ధాభక్తులతో చేసే వారికి విష్ణువు అన్నీ ఇస్తాడు. అన్నిమాసాల్లో, అన్ని నక్షత్రాల్లో, అన్నితిథుల్లో హరికి ప్రియమైన వ్రతాలున్నాయి.

పాడ్యమి తిథి నాడు వైశ్వానరునీ, కుబేరునీ పూజించాలి. వారు సాధకునికి లాభాన్ని అంటే ధన, కనక, వస్తు వాహనాదులను ప్రదానం చేస్తారు. పాడ్యమి, అశ్వనీ నక్షత్రాలు కలిసిన నాడు ఉపవాసం చేస్తే బ్రహ్మదేవుడు, సంతోషించి అర్థాన్నిస్తాడు.

తిధి – పూజ్యదైవతాలు – ఫలాలు

విదియ – యముడు, లక్ష్మీనారాయణుడు – అర్ధ లాభం

తదియ – గౌరి, శివుడు, గణేశుడు

చవితి – చతుర్వ్యూహాలతో విష్ణువు

పంచమి – హరి

షష్టి – కార్తికేయుడు, సూర్యుడు (రవి)

సప్తమి – భాస్కరుడు (ఉపవాసంచేయాలి) – అర్ధ లాభం

అష్టమి – దుర్గ

నవమి – మాతృకలు, దిశలు – అర్ధ లాభం

దశమి – యమడు, చంద్రుడు

ఏకాదశి – ఋషి గణాలు

ద్వాదశి – హరి, మన్మథుడు

త్రయోదశి – శివుడు

చతుర్దశి, పూర్ణిమ- బ్రహ్మ

అమావాస్య – పితృగణాలు – ధనసంపత్తి

ఆదివారం అశ్వనితో మొదలుపెట్టి వరుసగా నాలుగు నక్షత్రాలను, సోమవారం అయిదునుండి మరోనాల్గింటిని అలా శనివారం మూడిటితో మొత్తం ఇరవైయేడు నక్షత్రా లనూ పూజించినవారి కోరికలన్నిటినీ ఆ నక్షత్రాలు నెరవేర్చగలవు.

ఎనభై ఐదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment