రుచి గావించిన పితృస్తుతి శ్రాద్ధాలలో ఆ స్తుతి పాఠ మాహాత్మ్యం.
ఏదో వినయం కొద్దీ తాను అకించనుడననీ తనకెవరూ పిల్లనెవరూ ఇవ్వరనీ అన్నాడే గాని ఈ రుచి ఒక ప్రజాపతి (రుచి అప్పటికింకా ప్రజాపతి కాడు. ఒక విప్రోత్తముడు మాత్రమే), బ్రహ్మ సంభవుడు, బ్రహ్మర్షి. అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసం వనంలోకి పోయి ఒకే చోట కదలకుండా కూర్చుని బ్రహ్మనుద్దేశించి నూరు దివ్య సంవత్సరాల పాటు కఠినతపమాచరించాడు.
బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమై ”విప్రోత్తమా! ఏమి నీ కోరిక?” అని అడిగాడు. సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించే బ్రహ్మదేవునికి తన గతిని వివరించి, తన పితరుల అభిలాషను వినిపించాడు రుచి.
‘ఓయి విప్రోత్తమా! నీవు ప్రజాపతివి కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి వున్నది. ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ, పిండదానాదులను చేసి వారి అభిలాషను తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పిన స్త్రీ పరిగ్రహణం మిక్కిలి ఉచితమైయున్నది.
కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందుంచుకొని నీవు వారినే పూజించు. వారే నీకు సర్వ కామనలనూ నెరవేర్చగలరు. వారికి సాధ్యం కానిది వుండదు. సమ్యక్ పూజకు సంతుష్టులైన పితరులు స్త్రీ, పుత్రులనే అననేల, ఏమైనా ప్రసాదించగలరు’ అని చెప్పి అంతర్ధానంచెందాడు బ్రహ్మ,
అప్పుడు మహర్షియైన రుచి నదీతటంపై నొక ఏకాంత ప్రదేశానికి పోయి అక్కడ ముందుగా తన పితరులకు తర్పణాలిచ్చి వారిని సంతృప్తి పఱచాడు. పిమ్మట ఏకాగ్రచిత్తుడై భక్తిపూర్వకంగా ఈ విధంగా స్తుతిస్తూ వారిని ఆరాధించసాగాడు.
నమస్యే హం పితౄన్ భక్త్యాయే వసంత్యధి దైవతం |
దేవైరపి హి తర్యంతే యే శ్రాద్ధేషు స్వధోత్తరైః ||
నమస్యేహం పితౄన్ స్వర్గా సిద్ధాః సంతర్పయంతియాన్ |
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారై రనుత్తమైః ||
నమస్యేహం పితౄన్ స్వర్గేయే తర్యంతే మహర్షిభిః |
శ్రాద్ధెర్మనో మయైర్భక్త్యా భుక్తి ముక్తి మభీప్సుభిః ||
నమస్యే హం పితౄన్ భక్త్యాయే ర్చ్యంతే గుహ్యకైర్దివి |
తన్మయత్వేన వాంఛద్భిరృద్భి మాత్యంతికీం పరాం ||
నమస్యే.హం పితౄన్ విప్ర్త రర్చ్యంతే భువియే సదా |
శ్రాద్ధేషు శ్రాద్ధయాభీష్ట లోకపుష్టి ప్రదాయినః ||
నమస్యే.. హం పితౄన్ విప్రైరర్చ్యంతే భువియే సదా |
వాంఛితాభీష్ట లాభాయ ప్రాజాపత్య ప్రదాయినః ||
నమస్యేహం పితౄన్ యేవై తర్య్పంతే రణ్యవాసిభిః |
వన్యైః శ్రాద్ధెర్యతానిహారై సపోర్ధూత కల్మషైః ||
నమస్యే.. హం పితౄన్ విఫ్రై రైష్టి కైర్ధర్మ చారిభిః |
యే సంయతాత్మభిర్నిత్యం సంతరష్యంతే సమాధిభిః ||
నమస్యేహం పితృచ్ఛాడ్రై రాజన్యాస్తర్పయంతియాన్ |
కవ్యైరశేషైర్విధి వల్లోక ద్వయ ఫలప్రదాన్ ||
నమస్యే. హం పితౄన్ శ్యైరర్చ్యంతే భువియే సదా |
స్వకర్మాభిరతైర్నిత్యం పుష్పధూపాన్న వారిఖిః ||
నమస్యేం హం పితౄచ్ఛాద్ధో శూద్రెరపి చ భక్తితః |
సంతర్ప్యం జగత్ కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః ||
నమస్యేహం పితౄచ్ఛాద్ధే పాతాలే యే మహాసురైః |
సంతర్యంతే సుధాహారస్త్యక్త దంభమదైః సదా ||
నమస్యే…హం పితౄచ్ఛా రచ్యంతే యే రసాతలే |
భోగైరం శేషైర్విధివన్నాగెః కామానభీష్సుఖిః ||
నమస్యే…హం పితౄచ్ఛాః సర్ప్తః సంతర్పితాన్ సదా |
తతైవ విధి వన్మంత్రభోగ సంపత్సమన్వితైః ||
పితృన్నమన్యే నివసంతి సాక్షాద్యే దేవలోకే..థ మహీతలేవా |
తథాంతరిక్షేచ సురారిపూజ్యాస్తే వై ప్రతీచ్ఛంతు మయోపనీతం ||
పితృన్నమస్యే పరమార్థభూతా యే వై విమానే నివసంత్య మూర్తాః |
యజంతి యానస్తమలైర్మనోభిః యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్ ||
పితృన్నమస్యే దివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్యఫలాభి సంధౌ |
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదాయే నభిసంహితేషు ||
తృప్యంతు తే స్మిన్ పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశంతి కామాన్ |
సురత్వ మింద్రత్వ మితో ధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి ||
సోమస్య యే రశ్మిషుయే.. ర్కబింబే శుక్లే విమానే చ సదా వసంతి |
తృప్యంతు తే స్మిన్ పితరో న్నతోయైః உ గంధాదినా పుష్టిమితో ప్రజంతు ||
సహాయేషాం హుతే ఒగ్నో హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీర సంస్థాః |
యే పిండ దానేన ముదం ప్రయాంతి
తృప్యంతు తే స్మిన్ పితరోన్నతోయైః ||
యే ఖడ్గమాంసేన సురైరభీషై: కృష్ణాస్తిలైర్దివ్య మనోహరైశ్చ |
కాలేన శాకేన మహర్షి వయైః సంప్రీణి తాస్తే ముదమత్ర యాంతు ||
కవ్యాన్య శేషాణి చయాన భీష్టా న్యతీవ తేషాం మమ పూజితానాం |
తేషాంచ సాన్నిధ్య మిహస్తు పుష్ప గంధాంబు భోజ్యేషు మాయాకృతేషు ||
దినేదినేయే ప్రతిగృష్ణాతే రా మాసాంత పూజ్యాభువి యే ష్టకాసు |
యే వత్సరాంతే ..భ్యుదయే చ పూజ్యాః ప్రయాంతు తే మే పితరో త్ర తుష్టిం ||
పూజ్యాద్విజానాం కుముదేందుభాసో యే క్షత్రియాణాం జ్వలనార్క వర్ణః |
తథా విశాంయే కనకావదాతా నీలీ ప్రభాః శూద్రజనస్యయే చ ||
తే. స్మిన్సమస్తామమ పుష్పగంధ ధూపాంబు భోజ్యాది నివేదనేన |
తథాగ్ని హోమేన చయాంతి తృప్తి సదాపితృభ్యః ప్రణతో… స్మి తేభ్యః ||
యే దేవపూర్వాణ్యభితృప్తి హేతో రశ్నంతి కవ్యానిశుభా హృతాని |
రక్షాంసి భూతాన్య సురాం థోగ్రాన్ నిర్ణాశయం శివం ప్రజానాం ||
ఆద్యాః సురాణా మమరేశ పూజ్యా
స్తప్యంతు తే.. స్మిన్ ప్రణతో.. స్మి తేభ్యః |
అగ్నిష్వాత్తా బహిర్షద ఆజ్యపాః సోమపాస్తథా ||
ప్రజంతు తృప్తిం శ్రాద్ధే …స్మిన్ పితరస్తార్పితా మయా ॥
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షంతు మే దిశం |
తథా బహిర్షదః పాంతు యా మ్యాం మే పితరః సదా ||
ప్రతీచీ మాద్యపాస్త ద్వదుదీ చీమపి సోమపాః |
రక్షోభూత పిశాచేభ్య స్తథైవాసుర దోషతః ||
తృష్ణాశ్చయే భూతి సృజో భవంతి తృప్యంతు తే స్మిన్ ప్రణతో.. స్మి తేభ్యః |
సర్వతః పితరో రక్షాంకుర్వంతు మమ నిత్యశః ||
విశ్వవిశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః |
భూతిదో భూతకృద్ భూతిః పితౄణాం యే గణానవ ||
కల్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః |
కల్యతా హేతు రనఘః షడిమే తే గణాః స్మృతాః ||
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టి దస్తథా |
విశ్వపాలౌ తథాధాతా సప్లైతే చ గణాః స్మృతాః ||
మహాన్మహాత్మా మహితో మహిమా వాన్మ మహాబలః |
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః ||
సుఖదో ధనదశ్చాన్యో ధర్మదో .. న్యశ్చ భూతిదః |
పితౄణాం కథ్యతే చైవ తథాగణ చతుష్టయం ||
ఏకత్రింశత్ పితృగణాయై ర్వ్యాప్తమఖిలం జగత్ |
త ఏవాత్ర పితృగణాస్తుష్యంతు చమదాహితాత్ ||
ఈ స్తోత్ర భావంలో పితృదేవతల మాహాత్మ్యాన్ని తెలిపే విశేషాలు చాలానే కనిపిస్తాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు.” శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వధామంత్రాల” ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ వుండే మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తి పరుస్తారు. వారి భుక్తి ముక్తి కామనలను పితృ దేవతలు తీర్చగలరు.
స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తి పఱుస్తారు. అలాగే గుహ్యకాదులు కూడా. పృథ్విపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పించగలరు.
ఈ కర్మను చేయించే బ్రాహ్మణులను వీరే ప్రాజాపత్య లోకానికి పంపిస్తారు.
తపస్సు చేసుకుంటూ నిర్ధూతకల్మషులై, సంయతాహారులై వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శ్రాద్ధకర్మలను చేసి వీరిని ప్రసన్నులను చేసుకుంటారు. నైష్ఠిక బ్రహ్మచారులూ, ధర్మాచారులూ, జితేంద్రియులూ కూడ వీరిని అపర కర్మల ద్వారా పూజించి ధన్యులౌతారు. పృథ్విపై గల నాలుగు వర్ణాల వారూ వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమగతుల నందుకోగలుగుతున్నారు.
పాతాళంలో వుండే రాక్షసులు సైతం తమ దంభాహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండప్రదానం చేస్తారు. రసాంతలాది ఇతర లోకాలలోని నాగాది జాతుల వారూ అలాగే చేస్తారు. దేవతలూ అంతే.
పరార్థం కోసం, అనగా ఇతరులకు ఉపయోగపడడం కోసం, పితృయోనిలో వుండి కూడా, అమృతరూపులై విమానాల్లో ప్రయాణిస్తూ, నిర్మల మనస్సుతో, కష్టాల పాలైన యోగులకు, వాటి నుండీ, వారు కోరుకుంటే జీవితం నుండీ కూడా ముక్తిని ప్రసాదిస్తూ వుంటారు పితృదేవతలు.
దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ, స్వధాభోజులై తమ పుణ్యఫలాన్నొక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో తమను పూజించేవారికి పితృదేవతలు ఈప్సితార్థ సిద్ధిని కలిగిస్తుంటారు. ఏ కోరికాలేని వారికి కైవల్యాన్ని ప్రసాదించే సామర్థ్యం కూడ వారికి వుంటుంది.
అగ్నిలో వ్రేల్చిన హవిష్యాహుతులకు సంతృప్తి చెంది బ్రాహ్మణుని శరీరంలో ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించే పితృదేవతలకు నమస్కరిస్తున్నానని ఇంకా అనేక విధాలుగా పితృ దేవతల మాహ్యాత్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్తుతి కొనసాగింది.
మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథను చెప్పటంలో భాగంగా ఇలా అన్నాడు. హే క్రౌంచిక మునిశ్రేష్టా! రుచి ద్వారా ఈ విధంగా స్తుతింపబడిన తేజస్స్వరూపులైన ఆతని పితృగణం వారందరూ దశదిశలనూ వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమయినారు.
అతడు వారిలో ప్రతి ఒక్కరినీ మంత్ర సహితంగా గంధాక్షతాదు లతో పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకొమ్మన్నారు. రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని విన్నవించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ, తనకు తగిన, శ్రేష్ఠురాలైన, దివ్యపత్నినీ ప్రసాదించమని వేడుకున్నాడు.
పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు. ‘ఓ మునిసత్తమా! నాయనా! ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకొన్న పత్ని లభిస్తుంది. నీకామె ద్వారా పరమ పరాక్రమశాలి, మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈ మన్వంతరానికి మూడులోకాలకూ అధిపతి కాగల రౌచ్యుడనే కొడుకు పుడతాడు. అతడు బహుపుత్రవంతుడవుతాడు. నీవు ప్రజాపతివై నాలుగు వర్ణాల ప్రజలనూ సృష్టించి చివరిలో ధర్మ, తత్త్వజ్ఞానాన్ని పొంది సిద్ధినొందుతావు.
ఇక నీ స్తోత్రం మమ్మెంతో సంతోష పెట్టింది. కాబట్టి మేము ఇకపై ఈ స్తోత్రం ద్వారా భక్తిశ్రద్ధలతో మమ్ము ప్రార్ధించిన వారి పట్ల సుప్రసన్నులమై వారికి ఉత్తమ భోగాలనూ, ఆత్మ విషయక ఉత్తమ జ్ఞానాన్నీ, ఆయురారోగ్యాలనూ, పుత్రపౌత్రాదులనూ ప్రదానం చేస్తాము.
శ్రాద్ధకర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నపుడు వారికెదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి ఆ శ్రాద్ధఫలితాన్ని అక్షయం చేస్తాం.
ఏ శ్రాద్ధకర్మలోనైతే ఈ స్తోత్రం చదువబడుతుందో అక్కడ మేము పన్నెండు. సంవత్సరాలకు సరిపడునట్లుగా తృప్తి నొందుతాము. హేమంత ఋతువులో ఈ స్తవనం చేయువానిపై మా అనుగ్రహం పన్నెండేళ్ళ వఱకూ, శిశిరంలోనైతే ఇరవై నాలుగు, వసంత, గ్రీష్మర్తువుల్లోనైతే పదహారు సంవత్సరాల దాకా ఆ వ్యక్తి పైన ప్రసరిస్తూ వుంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదవబడే ఈ స్తుతి మా అందరికీ అక్షయ తృప్తినిస్తుంది.
అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా వుంటుంది. ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని గావిస్తే మేము పదిహేనేళ్ళపాటు తృప్తినొందుతాము.
నాయనా రుచీ! ఈ సంపూర్ణ స్తోత్రం ఒకచోట వ్రాయబడి ఏ గృహంలోనైతే భద్రంగా వుంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి ఆ. యజమానిననుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహాభాగా! మాకు శ్రాద్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ నీ ప్రవచిత స్తుతిని తప్పక వినిపించాలి” అని చెప్పి పితరులు అంతర్ధానం చెందారు.
తరువాతి కథను మార్కండేయ మహాముని ఇలా చెప్పాడు. పితృదేవతల కృప వల్ల ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రంలో అను పేరు గల అప్సర ఆవిర్భవించింది. మనస్సుకి ప్రీతిని కలిగించే అందంతో బాటు అన్ని శుభలక్షణాలుగల వేరొక కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరించింది.
ప్రంలోచ ఆతనితో ”హే తపస్విశ్రేష్ఠా! నేనొక అచ్చరను. వరుణపుత్రుడూ, మహాత్ముడునైన పుష్కరుని ద్వారా నాకీ అతిశయ సుందరియైన కూతురు జన్మించింది. నీకు భార్యగా ఈ మానిని అను పేరు గల సౌందర్య రాశిని దేవతలు నిశ్చయించారు.
మీరు ఈమెను పరిగ్రహించండి. మీ దంపతులకు మనువే పుత్రునిగా పుడతాడు’ అని చెప్పింది.
”అలాగే” అని సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటి వాడయినాడు. వారి పుత్రుడే పదమూడవ మనువు రౌచ్యుడు” అని చెప్పి మార్కండేయముని క్రౌంచునికి అతిథి సత్కారాన్ని గావించి వీడ్కొలిపాడు”
అరవై నాల్గవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹