Skip to content Skip to footer

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – ఇరవై తొమ్మిదవ అధ్యాయం

వివిధ శాలగ్రామ శిలల లక్షణాలు

కైలాసవాసా! ఇప్పుడు శాలగ్రామ లక్షణాలను వినండి. శాలగ్రామ శిలలను స్పృశించి నంత మాత్రముననే కోటిజన్మల పాపాలు కడుక్కుపోతాయి. కేశవ, నారాయణ, గోవింద, మధుసూదనాది పేర్లు గల విభిన్న శాలగ్రామాలుంటాయి. ఇవి శంఖచక్రాది చిహ్నాలతో సుశోభితాలై వుంటాయి.

ఇలా కేశవ శాలగ్రామానికి శంఖ, చక్ర, కౌమోదకి (విష్ణుగద) పద్మాలుంటాయి. ఇవే చిహ్నాలు వేర్వేరు క్రమాల్లో ఇతర శాలగ్రామాలకుంటాయి. అవి ఒక వరుసలో ఇలా వుంటాయి.

పద్మ, గద, చక్ర, శంఖ -నారాయణ

చక్ర, శంఖ, పద్మ, గద – మాధవ

గద, పద్మ, శంఖ, చక్ర – గోవిందా

పద్మ, శంఖ, చక్ర, గద – విష్ణు

శంఖ, పద్మ, గద, చక్ర – మధుసూదన

గద, శంఖ, చక్ర, పద్మ – త్రివిక్రమ

చక్ర, గద, పద్మ, శంఖ – వామన

చక్ర, పద్మ, శంఖ, గద – శ్రీధర

పద్మ, గద, శంఖ, చక్ర – హృషికేశ

పద్మ, చక్ర, గద, శంఖ – పద్మనాభ

శంఖ, చక్ర, గద, పద్మ – దామోదర

చక్ర, శంఖ, గద, పద్మ – వాసుదేవ

శంఖ, పద్మ, చక్ర, గద – సంకర్షణ

శంఖ, గద, పద్మ, చక్ర – ప్రద్యుమ్న

గద, శంఖ, పద్మ, చక్ర – అనిరుద్ధ

పద్మ, శంఖ, గద, చక్ర – పురుషోత్తమ

గద, శంఖ, చక్ర, పద్మ – అధోక్షజ

పద్మ గద, శంఖ, చక్ర – నృసింహ

పద్మ, శంఖ, చక్ర, గద – అచ్యుత

శంఖ, చక్ర, పద్మ, గద – జనార్దన

గద, చక్ర, పద్మ, శంఖ – ఉపేంద్ర

చక్ర, పద్మ, గద, శంఖ – హరి

గద, పద్మ, చక్ర, శంఖ – శ్రీకృష్ణ

ద్వారంపై శ్వేతవర్ణంలో రెండు చక్రాలు ధరించియున్న వాసుదేవభగవానుని శాలగ్రామాలు కూడా వుంటాయి. అలాగే రక్తవర్ణం, రెండు చక్రాలు, తూర్పు భాగంలోనొక పద్మచిహ్నము గల సంకర్షణ నామకమైన శాలగ్రామశిల వుంది. పీతవర్ణంలో ప్రద్యుమ్నునికీ ఛిద్రశిలలలో అనిరుద్ధునికీ శాలగ్రామాలున్నవి.

ద్వారముఖంపై నీలవర్ణంలో మూడు రేఖలూ, శేషభాగమంతా శ్యామలవర్ణంలో కల్పింపబడిన నారాయణ శిలలున్నాయి. మరికొన్ని లక్షణాలతో ఇతర దేవతల శాలగ్రామాల వివరాలు ఈ దిగువనీయ బడుతున్నాయి.

మధ్యంలో గదవంటి రేఖ విస్తృత వక్షస్థలం యథాస్థానంలో నాభిచక్రం

నృసింహ

పైవాటితో బాటు మూడు లేదా అయిదు బిందువులు

కపిల

విషమ పరిణామాలు రెండు చక్రాలు, శక్తి చిహ్నం.

వారాహ

నీలవర్ణం, మూడు రేఖలు, స్థూలము, బిందుయుక్తము

కూర్మమూర్తి

పై లక్షణాలతో గుండ్రంగా వుండి వెనుకభాగంలో వంపు

కృష్ణ

అయిదు రేఖలు

శ్రీధర

అదనంగా గద

వనమాలి

గోళాకారం, తక్కువ పరిమాణం

వామన

ఎడమభాగంలో చక్రం

సురేశ్వర

రకరకాల రంగులు, బహు రూపాలు, పడగల ముద్రలు

అనంతక

స్థూలం, నీలవర్ణం, మధ్యలో. కూడా నీలవర్ణంలోనే చక్రం

దామోదర

సంకుచిత ద్వారం, రక్తవర్ణం పొడవైన రేఖలు, ఛిద్రాలు, చక్రం, కమలం, విశాలం

బ్రహ్మశిల

విస్తృత ఛిద్రాలు, చిన్న చక్రం

కృష్ణశిల

బిల్వాకార శిల

విష్ణుశిల

అంకుశం, ఆకారం, అయిదు రేఖలూ, కౌస్తుభ చిహ్నం

హయగ్రీవ శిల

చక్ర కమలాంకితం, మణుల రత్నాల కాంతి, నల్లరంగు

వైకుంఠశిల

ద్వారంపై రేఖ, విస్తృత కమల సదృశ శిల

మత్స్యశిల

కుడివైపు రేఖ, నల్లరంగు రామచక్రాంకితం

త్రివిక్రమ శిల

ఒకద్వారం, నాలుగు చక్రాలు, వనమాల, స్వర్ణరేఖ, గోపద సుశోభితం, కదంబ పుష్పాకృతి

లక్ష్మీనారాయణశిల

చక్రాలు మాత్రమే ఉండేవి ఇవి:-

ఏకచక్రం – సుదర్శన శాలగ్రామం

రెండు చక్రాలు – లక్ష్మీనారాయణ

మూడు చక్రాలు – త్రివిక్రమ

నాలుగు చక్రాలు -చతుర్వ్యూహ

అయిదు చక్రాలు – వాసుదేవ

ఆరు చక్రాలు – ప్రద్యుమ్న

ఏడు చక్రాలు – సంకర్షణ

ఎనిమిది చక్రాలు – పురుషోత్తమ

తొమ్మిది చక్రాలు – నవ వ్యూహ

పది చక్రాలు – దశావతార

పదకొండు చక్రాలు – అనిరుద్ధ

పన్నెండు చక్రాలు – ద్వాదశాత్మ

పన్నెండు కన్న నెక్కువ – అనంత

ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment