Skip to content Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – నూట ముప్పై ఏడవ అధ్యాయం

వాయుజయ నిరూపణం

వాయుజయమనేది ఒక ప్రశస్తమైన విద్య. దీని ప్రభావం వల్ల జయపరాజయాలు ముందే తెలుస్తాయి. పరాజయాన్ని నిలువరించడానికి సంకేతాలు కూడా ఇవ్వబడతాయి. అలాగే విదేశయాత్రలకు శుభాశుభ ముహూర్తాలకి సంబంధించిన జ్ఞానం కూడా ఈ విద్య వల్ల ఒనగూడుతుంది. వాయు, అగ్ని, జల, ఇంద్రులను మాంగలిక చతుష్టయమంటారు. వాయువు ఎక్కువగా ప్రాణి యొక్క వామ, దక్షిణ భాగములలో నున్న నాడులలో ప్రవహిస్తుంటుంది.

(అష్టమాతృకలలో అపరాజిత (దుర్గ) పేరు కనిపిస్తోంది. మంత్రాలలో మాత్రం ఆ పేరుతో కాకుండా ఆ దేవిని చండికా నామ జపంతో ఆవాహన చేయాలని తెలుస్తున్నది.)అగ్ని ప్రాణి శరీరంలో క్రింది నుండి పైకీ, జలంపై నుండి క్రిందికీ కదులుతుంటాయి. మహేంద్రతత్త్వం శరీర మధ్యభాగంలో వుంటుంది. కాని కృష్ణపక్షంలో దక్షిణ, శుక్లపక్షంలో వామ భాగాలలో గల నాడులలో ప్రవహిస్తుంటుంది.

రెండు పక్షాలలోనూ మొదటి మూడు రోజులలోనూ నాసిక నుండి ప్రవహించే వాయువుకి ఉదయకాలపు గాలియని పేరు. ఈ వాయువు కుడి నాసికా రంధ్రం నుండే నిర్గమించాలి. అలాకాకుంటే అనారోగ్యం. అలాగే ఏ ప్రాణి శరీరంలోనైనా వాయువు సూర్యమార్గంలో పుట్టి చంద్ర మార్గంలో అస్తమించాలి. అటునుంచి ఇటైతే అనారోగ్యం.ఓ వరాననా! వాతావరణంలో ఒక పగలూ, రాత్రి కలిపి మొత్తం పదహారు సంక్రాంతులుంటాయని చెప్పబడింది. గంటన్నరకొకమారు ఏర్పడే ఈ సంక్రాంతుల గతి తోనే శరీరంలో వాయువుయొక్క సంక్రాంతుల పరిమాణం కూడా వుంటుంది.

ఇది ఒక క్రమంలో తిరిగినంతకాలం ఏ ముప్పూరాదు కాని గతితప్పితే కష్టం. భోజన, మైథున కాలాల్లోనూ కత్తి పట్టి కదనరంగంలో కదలాడుతున్నపుడూ కుడివైపు నుండి వాయువు ప్రవహించాలి. అలాగే ప్రశ్న కర్తకు ఆ సమయంలో వాయువు నాసిక యొక్క వామరంధ్రం నుండి ప్రవహిస్తే చాల మంచిది. వాయువు జలతత్త్వ మహేంద్ర తత్త్వాల ద్వారా ప్రవహించి. నంతసేపు కూడాఏ దోషమూ అంటదు. రాజ్యానికి కుడివైపునుండి వాయుప్రసార మెక్కువైతే అనావృష్టి, ఎడమవైపు నుండి ఎక్కువైతే అతివృష్టి కలుగుతాయి.

నూట ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Leave a comment