విష్ణు ధర్మాఖ్య విద్య
దేవరాజైన ఇంద్రుడు ఏ ”విష్ణుధర్మ” మనుపేరుగల విద్యను జపించి సమస్త శత్రువులను ఓడించి స్థిరంగా దేవరాజైనాడో ఆ విద్యనుపదేశిస్తాను, స్వీకరించండి.
ఈ విద్యా జపానికి ముందు రెండు పాదాలను, రెండు మోకాళ్ళను, ఇరు జంఘ ప్రదేశాలను, ఉదర హృదయ వక్షస్థల ముఖాలను, తలను ఓంకారాది బీజ వర్ణాలతో క్రమంగా న్యాసం చేయాలి.
ఆ తరువాత అవే అంగాలను వెనుక నుండి ముందుకు నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ న్యాసం చేయాలి. అప్పుడు ద్వాదశాక్షర యుక్తమైన వాసుదేవ మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క అక్షరానికొక్కొక్క అంగం చొప్పున కరముతో మొదలుపెట్టి చివరి ”య” కారం తో చిటికెన వ్రేలిని న్యాసం చేయాలి.
చివరగా హృదయన్యాసాన్ని ఓంకారంతోనూ మస్తక న్యాసాన్ని సంపూర్ణ మంత్రంతోనూ చేయాలి. నేత్రాలను ఓం విష్ణవే నమః తో న్యాసం చేసుకొని పరమశక్తి సంపన్నుడైన పరమాత్మ శేషనారాయణుని ఈ విధంగా ధ్యానించాలి..
మమరక్షాం హరిః కుర్యాన్ |
మత్స్య మూర్తి ర్జలే వతు ||
త్రి విక్రమ స్తథాకాశో |
స్థలే రక్షతు వామనః ||
ఆటవ్యాం నరసింహస్తు |
రామో రక్షతు పర్వతే ||
భూమౌరక్షతు వరాహో |
వ్యోమ్ని నారాయణో వతు ||
కర్మ బంధాచ్చ కపిలో |
దత్తో రోగాచ్చ రక్షతు ||
హయగ్రీవో దేవతాభ్యః |
కుమారో మకర ధ్వజాత్ ||
నారదో న్యార్చనాద్దేవః |
కూర్మోవై నైరృతే సదా ||
ధన్వంతరి శ్చాపథ్యాచ్చ |
నాగః క్రోధ వశాత్ కీల ||
యజ్ఞో రోగాత్ సమస్తాచ్చ |
వ్యాసో జ్ఞానాచ్చ రక్షతు ||
బుద్ధః పాషండ సంఘాతాత్ |
కల్కీ రక్షతు కల్మషాత్ ||
పాయాన్మధ్యం దినే విష్ణుః |
ప్రాతర్నారాయణో వతు ||
మధుహా చాపరా హ్ణే చ |
సాయం రక్షతు మాధవః ||
హృషీకేశః ప్రదోషే వ్యాత్ |
ప్రత్యూషే వ్యాజ్జనార్దనః ||
శ్రీధరోజ వ్యాదర్ధరాత్రే |
పద్మనాభో నిశీథకే ||
చక్ర కౌమోదకీ బాణా |
ఘ్నంతు శత్రూంశ్చ రాక్షసాన్ ||
శంఖం పద్మంచ శత్రుభ్యః |
శార్ జగీం వై గరుడ స్తథా ||
బుద్ధీం ద్రియ మనః ప్రాణాన్ |
పాంతు పార్శ్వ విభూషణః ||
శేషః సర్పస్వరూపశ్చ |
సదా సర్వత్ర పాతుమాం ||
విదిక్షు దీక్షుచ సదా |
నరసింహశ్చ రక్షతు ||
ఏతద్ధారయ మాణశ్చయం |
యం పశ్యతి చక్షుషా ||
సవశీ స్యాద్వి పాప్మా చ |
రోగముక్తో దివం వ్రజేత్ ||
ఈ విధంగా విష్ణు ధర్మాఖ్య విద్యను ధారణ చేసిన వానికి ఏది కావాలనుకున్నా సమకూడుతుంది. రోగాలనుండి, పాపాలనుండి ముక్తుడై దేహాంతంలో స్వర్గలోకానికి వెళతాడు.
నూట ముప్పై నాల్గవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹