వ్యాధి హర వైష్ణవ కవచం
రుద్రాదులారా! ఇపుడు మీకు సమస్త వ్యాధి వినాశకం, సకల కల్యాణ కారకం, పరమశివ పూజితం అయిన వైష్ణవ కవచాన్ని వినిపిస్తాను. ”అజన్ముడు, నిత్యుడు, అనామయుడు, ఈశానుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, దేవదేవేశ్వరుడు, జనార్దనుడునగు మహావిష్ణువుకి ప్రణామం చేసి ఈ అమోఘమైన అప్రతిమానమైన వైష్ణవ కవచాన్ని ధారణచేస్తున్నాను.” అని సంకల్పం చెప్పుకొని సర్వదుఃఖనివారకమైన ఈ కవచాన్ని చదవాలి, ఇలా
విష్ణుర్మామ గ్రతః పాతు కృష్ణా రక్షతు పృష్ఠతః |
హరిర్మే రక్షతు శిరో హృదయంచ జనార్దనః ||
మనోమమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః |
పాతు నేత్రే వాసుదేవః శ్రోత్రే సంకర్షణో విభుః II
ప్రద్యుమ్నః పాతుమే ఘ్రాణ మనిరుద్ధస్తు చర్మచ |
వనమాలాగల స్థాం తం శ్రీవత్సో రక్షతా దధః ||
పార్శ్వం రక్షతు మే చక్రం వామం దైత్య నివారణం |
దక్షిణంతు గదా దేవీ సర్వాసుర నివారిణీ ||
ఉదరం ముసలం పాతు పృష్ఠం మే పాతు లాంగలం |
ఊర్ధ్వం రక్షతు మేశాంగం జంఘే రక్షతు నందకః ||
పార్టీ రక్షతు శంఖశ్చ పద్మం మే చరణావు భౌ |
సర్వకార్యార్ధ సిద్ధ్యర్థం పాతుమాం గరుడః సదా ||
వారాహోరక్షతు జలే విషమేషు చ వామనః |
అటవ్యాం నరసింహశ్చ సర్వతః పాతుకేశవః ||
హిరణ్య గర్భో భగవన్ హిరణ్యం మే ప్రయచ్ఛతు |
సాంఖ్యాచార్యాస్తు కపిలో ధాతు సామ్యం కరోతుమే ||
శ్వేత ద్వీప నివాసీ చ శ్వేత ద్వీపం నయత్వజః |
సర్వాన్ సూదయతాం శత్రూన్ మధుకైటభ మర్దనః ||
సదా కర్షతు విష్ణు శ్చ కిల్బిషం మమ విగ్రహాత్ |
హంసో మత్స్యస్తథా కూర్మః పాతుమాం సర్వతో దిశాం ||
త్రివిక్రమస్తు మే దేవః సర్వపాపాని కృంతతు |
తథానారాయణో దేవో బుద్ధిం పాలయతాం మమ ||
శేషో మే నిర్మలం జ్ఞానం కరోత్వజ్ఞాన నాశనం |
వడవా ముఖో నాశయతాం కల్మషం యత్కృతం మయా ||
పద్ భ్యాందదాతు పరమం సుఖం మూర్ధ్ని మమ ప్రభుః |
దత్తాత్రేయః ప్రకురుతాం సపుత్ర పశుబాంధవం ||
సర్వానరీన్ నాశయతు రామః పరశునా మమ |
రక్షోఘ్నస్తు దాశరథిః పాతు నిత్యం మహాభుజః ||
శత్రూన్ హలేన మే హన్యాద్ రామో యాదవ నందనః |
ప్రలంబ కేశి చాణూర పూతనా కంస నాశనః ||
కృష్ణస్యయో బాలభావఃసమే కామాన్ ప్రయచ్ఛతు ||
అంధకార తమో ఘోరం పురుషం కృష్ణ పింగళం |
పశ్యామి భయ సంత్రస్తః పాశహస్త మివాంతకం |
తతో – హం పుండరీ కాక్షం అచ్యుతం శరణం గతః ||
ధన్యో-హం నిర్భయో నిత్యం యస్యమే భగవాన్ హరిః |
ధ్యాత్వా నారాయణం దేవం సర్వోపద్రవ నాశనం |
వైష్ణవం కవచం బద్ధ్వా విచరామి మహీ తలే ||
అదృష్యోస్మి భూతానాం సర్వదేవ మయో హ్యహం |
స్మరణా దేవ దేవస్య విష్ణో రమిత తేజసః ||
శివాదులారా! రాక్షసులతో పిశాచాలతో నిండిన దట్టమైన అడవులలోనైనా, అశుభప్రాంతాలలో నైనా, రాజమార్గమందైనా, ద్యూతక్రీడయందైనా, చిన్న గొడవల్లో గాని, పెనుపెనుగు లాటల్లోగాని, నదిని దాటుతున్నప్పుడూ, ఆపత్కాలంలో, ప్రాణ సంకటమప్పుడూ, అగ్ని చోర గ్రహ విద్యుత్ బాధలందునూ, సర్పవిషం అలుము కొన్నపుడూ, విఘ్న రోగ పీడలలో ఇతరేతర భయంకర పరిస్థితుల్లో ఈ వైష్ణవ కవచస్తోత్రాన్ని భక్తిగా చదివిన వారికి ఆయాబాధల నుండి విముక్తి కలుగుతుంది. నిత్యం చదివే వారికి ఆ బాధలే కలుగవు. ఇది మంత్రరూపి కూడ..
నూట ముప్పై రెండవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹