హృదయ తృషారోగము
హృద్రోగం – అనగా గుండె జబ్బు. క్రిముల వల్ల వాత, పిత్త, కఫ, ప్రకోపాల వల్ల లేదా మూడింటి కలయిక వల్ల మొత్తం అయిదు కారణాలలోనేదో ఒక దాని వల్ల కూడా వచ్చును.
వాతం వల్లే వచ్చే హృద్రోగంలో గుండె, కడుపుభాగం అంతా ఖాళీ అయిపోయినట్లుంటుంది. రోగి తెగతింటూ వుంటాడు. ఈ తిన్నదంతా ఎక్కడికి పోయిందని ఏడుస్తుంటాడు. గుండె భాగం తిమ్మిరెక్కినట్లవుతుంది. తడుముకుంటే లోపలేదో విరిగిపోయినట్లుంటుంది. గుండె తడారిపోతుంది. రోగికి మత్తుగా వుంటుంది.
ఉన్నట్లుండి రోగి నిరాశ చెందుతాడు.దుఃఖభారం పెరుగుతుంది. తీవ్రంగా భయపడతాడు. ధ్వని ద్వేషం కలుగుతుంది. చిన్న ధ్వనికి కూడా చిరాకు పడిపోతాడు. నిద్ర సరిగా పట్టదు, శ్వాస కష్టం మీద ఆడుతుంది.
పిత్తం వల్ల వచ్చే హృద్రోగంలో రోగికి విపరీతమైన దాహం, నీరసం, నిస్సత్తువ, మంట, చెమట, త్రేన్పులు (పుల్లటివి) అరగనివి, ఆమ్లం, వాంతి, జ్వరం, కనులు మబ్బు వేయుట జరుగుతాయి.
ఇదే రోగం కఫం వల్ల వస్తే గుండె తిమ్మిరెక్కి పోతుంది. జీర్ణకోశం చెడుతుంది. ముఖంలోతుకి పోయినట్లవుతుంది. లేదా ఉబ్బుతుంది. వెక్కుళ్ళు, ఒంటి నొప్పులు, ఉమ్ములో చీము పడుట, మత్తుగా వుండుట, ఆయాసము, తిండిపట్ల విముఖత దీని ఇతర లక్షణాలు.
వాత, కఫ, పిత్త, మూడింటి దోషాల కారణంగా గుండె సమస్య వస్తే పై విభిన్న లక్షణాలన్నీ కనబడతాయి. క్రిముల వల్ల వచ్చే హృదయ తుషారోగంలోనల్లని పచ్చని కలగలుపు రంగు కనులలో కనబడుట, మత్తుగా వుండుట, కళ్ళు చీకట్లు కమ్ముట, గుండె రసాల నిల్వ, అశాంతి, అంగాలలో దురద, దగ్గున్నా లేకున్నా కఫం నోటి నుండి రాలుట అనే లక్షణాలు బయటపడతాయి.
గుండెనెవరో ఱంపంతో కోస్తున్నట్లుంటుంది. కత్తెరతో కత్తిరిస్తున్నట్లుంటుంది. ఈ రోగమునకు తొలి దశలోనే మందు పడకపోతే ప్రాణాంతకమే.
త్రిదోషాలలో దేనివల్లనైనా పిపాస హెచ్చు మీరుతుందిగానీ గుండె నీరసం మాత్రం మూడూ కలిసి వస్తేనే వుంటుంది.
హృద్రోగాలలో అంటువ్యాధి కూడా ఒకటుంది. అది సోకినా వాత, పిత్త దోషాలుం టేనే శరీరం లో వర్ధిల్లుతుంది (ఇది ఆరవ హృద్రోగం) హృదయరోగం లేదా హృద్రోగం ఏదైనా మరొక దోష ప్రోద్భలం ఉంటేనే ఉద్రేకిస్తుంది. కుదుపు, గుండెదడ, మనోద్రేకము, గుండెలో మంట, ధాతు బలహైన్యము వల్ల మూర్ఛ ఇవన్నీ కనిపిస్తాయి.
నాలుక అంగిలి భాగం ఎండిపోయి దాహం వేయుట, అన్ని జలభాగాలూ పొడిబారుట, పరాకుమాటలు, స్పృహ తప్పుట, నోరు బీటలు వారి నట్లాగుట అన్నద్వేషం, గొంతులో దైన్యం, మనసు ఒకరీతిలో నుండక పోవుట, జలాంగాలన్నీ ఎండుట వల్ల నాలుకను బయటకు తీయలేకపోవుట, త్రేనుపులు కూడా హృద్రోగికి ఉంటాయి.
వాత దోషం వల్ల వచ్చే గుండెజబ్బు అతి బల హైన్యము, నిరాశ, తలలో మత్తు, కణతల నొప్పి, వాసన చూసే శక్తి తగ్గుట, (నాలుకకి) నునుపు జిడ్డుతగ్గుట, నిద్రపట్టక పోవుట, మొత్తంగా నీరసంలను కలిగివుంటుంది.
పిత్తదోషం ఆమ్లత్వంలో సన్నటి పెరుగుదలనూ, మూర్ఛనూ, నోట చేదునీ, కంట ఎరుపునీ, శరీరంపై పొడినీ, లోపల మంటనీ, రోమకూపాల్లోంచి ఆవిరులొస్తున్న భ్రమనీ కలిగిస్తుంది.
హానికారక కఫం ఒక చోట స్థిరంగా వుండిపోయి అలా వెళుతున్న, జలనాళికలలోని, వాయువుని అద్దేస్తుంది. అప్పుడా గొట్టాలు మంటలలో పడిన మట్టి కుండల్లా ఉష్ణాన్ని పీల్చుకున్నట్లయిపోతాయి. గొంతు బార్లీ గింజతో పొడవబడుతున్నట్లుంటుంది. నోటిలో తీపి, నిద్రవస్తున్నట్లు వుండడం అనుభవమవుతాయి. తల సోమరిగా మారుతుంది. అలసట, ఆయాసము, తిండి నచ్చకపోవుట, అజీర్ణము ఇవన్నీ త్రిదోషాలూ కలిసి హృద్రోగిపై దాడి చేయడం వల్ల వస్తాయి.
చీము, అజీర్ణ పదార్థాల నిలువ కలిసి రక్త ప్రసరణాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల వాత, పిత్తాలు ఆందోళితమవుతాయి. దీని వల్ల రోగి కొంతసేపు వేడినీ కొంతసేపు చల్లదనాన్నీ తట్టుకోలేకపోతుంటాడు. రెండూ భరించలేనంత భారీగానే శరీరంపై దాడి సలుపుతాయి.
దాహం ప్రేగులలోని ముఖ్య ప్రాంతాన్ని నిరోధిస్తే అది పిత్త ప్రకోపమే. రసాల తగ్గుదల వల్ల వచ్చే దాహం త్రిదోష కారకం. కణజాల క్షీణత, మూర్ఛ, జ్వరం, త్రిదోష తీవ్రతల వల్ల దాహాన్ని ఉపసర్గాత్మిక అంటారు. ఇది మృతికి ముందరి దశ చిహ్నం.
నూట పదిహేడవ అధ్యాయం సంపూర్ణం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹