పురాణ పరిచయం
గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో ”పురాణం పంచలక్షణం” అనే కనిపిస్తుంది. భాగవతంలో మాత్రం పురాణం దశ లక్ష్మణ సమన్వితమని ఇలా చెప్పబడింది.
సర్గో స్యాథ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ!
వంశో వంశాను చరితం సంఖ్యా హేతు రపాశ్రయః!
దశభిర్ల క్షణైర్వుక్తం పురాణం త్వదిదో విదుః !
కేచిత్పంచ విధం బ్రహ్మన్ మహా దల్ప వ్యవస్థయా !
నిజానికి, ప్రతి పురాణంలోనూ, సర్గా ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితలనే పంచలక్షణాలంటే ఎక్కువ లక్షణాలే ఉంటాయి. ఇక ”గరుడ పురాణం” లో ”భాగవత” కారులు చెప్పిన పదింటి కంటే ఎక్కువ లక్షణాలు ఉన్నాయి.
ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి.
ఆచారకాండ (కర్మకాండ)
ప్రేతకాండ (ధర్మకాండ)
బ్రహ్మ కాండ (మోక్షకాండ)
మొదటి కాండను పూర్వఖండమని చివరి రెండు కాండాలను కలిపి ఉత్తర ఖండమని వ్యవహరిస్తారు. ఈ కాండలొక ఒక దాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో వుంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడా పోలిక లేదు.
ఆచారకాండ – 240 అధ్యాయాలు.
ప్రేతకాండ – 50 అధ్యాయాలు.
బ్రహ్మకాండ – 30 అధ్యాయాలు.
ఇక ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్న శాస్త్రం పై, 43 ఖగోళ, పదార్ధతత్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి.
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
పరమ పవిత్రమైన మధుర బృందావనం లో ఈ మహాద్ గ్రంధాన్ని భాగవతులకు అందించాలన్న సంకల్పం నాకు కలిగింది.గోలోక వాసులైన రాధా కృష్ణుల ఆశీస్సులతో ప్రారంభిస్తున్నాను. మీరందరూ దీనిని ఒక నిత్య పారాయణ గ్రంధంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను
రాధే రాధే రాధే రాధే రాధే రాధే రాధే రాధే రాధే
బృందావన విహారికి జై
గోకుల విహారికి జై
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹