కృష్ణస్నాన మాహాత్మ్య వర్ణనము
జయజయలోకపాల భక్తరక్షక జయజయ ప్రణతవత్సల
జయజయ భూతచరణ జయజయ
అదిదేవ బహుకారణ జయజయ వాసుదేవ జయ
జయాసురసంహరణ జయజయ దివ్యమీన జయ
జయ త్రిదశవర జయజయ జలధిశయన జయజయ
యోగివర జయజయ సూర్యనేత్ర జయజయ దేవరాజ
జయజయ కైటభారే జయజయ వేదవర |
జయజయ కూర్మరూప జయజయ యజ్ఞవర ||
జయజయ కమలనాభ జయజయ శైలచర |
జయజయ యోగశాయిన్ జయజయవేగధర ||
జయజయ విశ్వమూర్తే జయజయ చక్రధర |
జయజయ భూతనాథ జయజయ ధరణీధర||
జయజయ శేషశాయిన్ జయజయ పీతవాసో |
జయజయ సోమకాంత జయజయ యోగివాస ||
జయజయ దహనవక్త్ర జయజయ ధర్మవాస |
జయజయ గుణనిధాన జయజయ శ్రీనివాస ||
జయజయ గరుడగమన జయజయ సుఖనివాస |
జయజయ ధర్మకేతో జయజయ మహీనివాస ||
జయజయ గహనచరిత్ర జయజయయోగిగమ్య |
జయజయ మఖనివాస జయజయ వేదవేద్య ||
జయజయ శాంతికర జయజయ యోగిచింత్య |
జయజయ పుష్టికర జయజయ జ్ఞానమూర్తే ||
జయజయ కమలాకర జయజయ భావవేద్య |
జయజయ ముక్తికర జయజయ విమలదేహ ||
జయజయ సత్త్వనిలయ జయజయ గుణసమృద్ధ |
జయజయ యజ్ఞకర జయజయ గుణవిహీన||
జయజయ మోక్షకర జయజయభూశరణ్య |
జయజయ కాంతియుత జయజయ లోకశరణ ||
జయజయ లక్ష్మీయుత జయజయ పంకజాక్ష |
జయజయ సృష్టికర జయజయ యోగయుత ||
జయజయాతసీకుసుమ జయజయ సముద్ర శ్యామదేహ జయజయ విష్టదేహ|
జయజయ లక్ష్మిపంకజషట్చరణ జయజయ భక్తవశ ||
జయజయ లోకకాంత జయజయ
పరమశాంత జయజయ పరమసార జయజయ చక్రధర ||
జయజయ భోగియుత జయజయ నీలాంబర |
జయజయ శాంతికర జయజయ మోక్షకర ||
మునులడుగగా బ్రహ్మ బలరామ కృష్ణ సుభద్రా ప్రీతిగా చేసిన స్నానఫలమును గూర్చి ఇట్లు చెప్పెను. జ్యేష్ఠమాసమందు చంద్రదేవతాక మగు నక్షత్రమందు పూర్ణిమనాడు సర్వతీర్థములు పురుషోత్తమ క్షేత్రమునందున్న నూతి యందుండును. భోగవతియను పుణ్యతీర్థము అచ్చట ప్రత్యక్ష మగును. ఆనాడు బంగారు కలశములచే ఆ కూప జలమును తోడి ఆ ముగ్గురి దేవతలకు అభిషేకము చేయవలెను. ఒక మంచము వస్త్ర పుష్పాదులచే అలంకరించి పతాకములెత్తి తెల్లని వస్త్రము పరచి ధూప దీపాదులు అలంకరించి వివిధ మంగళ వాద్యములు మ్రోయ బలరామ కృష్ణులను సుభద్రను పూజింపవలెను. సుభద్రను వారిద్దరికి నడుమ నిలుపవలెను. ఆ విధముగా యధావిధి పూజజేసి మంగళ వాద్యములను మ్రోయించి వేద పారాయణముకూడ చేయించవలెను. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు కూడ ఈ పూజచేయవచ్చును. అపైన స్తుతి చేయవలెను. అస్తుతి”నమస్తే దేవదేవేశ” అని ఆరంభించి(21-22) ”నమస్యామహే భక్త్యా సర్వకామ ఫలప్రదమ్” ఆను వరకును పఠింప వలెను. ఈ పూజకు ఇంద్రాది దేవతలు కూడ వత్తురు. ఆ వచ్చెడి దేవతల పేర్లు ”శక్రాద్యాః” అను 26వ శ్లోకంనుండి 42వ శ్లోకం వరకు మూలమునంచు సులభముగా పేర్కొనబడినది.
శ్లో 43 నుండి 48వరకు అభిషేక సామాగ్రి వర్ణింప బడినది.
49నుంచి 51వరకు అనగా జయజయలోకపాల అని ప్రారంభించి జయవిష్ణో నమోస్తుతే వఱకు కృష్ణస్తవము.
ఈ విధముగా దేవతలు మొదలగు వారు బలరామ సుభద్రా కృష్ణులను అర్చింతురు. ఈ అర్చనవలన సర్వాభీష్టములు సిద్ధించును. సర్వదాన ఫలము కల్గును. గ్రహబాధలు తొలుగును. సంతాన సిద్ధి కలుగును. ఆయా ఫల సిద్ధులను మూలమునుండి సులభముగా ఆర్ధము చేసుకొనవచ్చును.
ఇది బ్రహ్మ పురాణమునందు కృష్ణస్నాన మాహాత్మ్య వర్ణనము అను అరువది ఐదవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹