బ్రహ్మపురాణ ప్రశంస – ఫలశ్రుతి
రోమహర్షణుడు మునులతో ఇట్లు పలికెను.ఓ బ్రాహ్మణులారా! పూర్వము మహామతియగు వ్యాసమహాముని శాస్త్రమునందు చెప్పబడినవియు ఉచ్చారణమునకు సంబంధించినవియు అగు పదునెనిమిది దోషముమలు (ఇవి వ్యాకరణ భాష్యమునందు చెప్పబడియున్నవి.) లేనివియు మిగుల సారభూతములును దోషములు లేనివియు శుద్ధములును అనేక శాస్త్రసముదాయరూపములును అయిన వాక్యములతో నిండినదియు స్వభావముచేతనే శుద్ధమగు విషయసమాయోజనముతో కూడినదియు సాధువులగు వ్యాకరణ విరుద్ధములను శిష్టులకు అసమ్మతములునుకాని శబ్దములతో ఉపశోభితమును పూర్వపక్షవచనములతో సిద్ధాంత వ్యవస్థాపనముతో కూడినది అగు ఈ బ్రహ్మపురాణమును శాస్త్రన్యాయానుసారముగ నుండునట్లు మృదువగువాక్కుతో వినిపించి మగించెను. (పూర్వపకోవచనములతోను సిద్ధాంతవ్యవస్థాపనముతోను కూడి శాస్త్రన్యాయానుసారముగనున్నది. అనుటచేత మీమాంసాశాస్త్ర సిద్ధమగు అధికరణము అనగా విషయో విషయశ్చైవ పూర్వపక్షస్తథోత్తరమ్- ప్రయోజంసంగతిశ్చ ప్రాంచోధికరణంవిదుః అనిచెప్పబడినది. దీనివివరణము పెద్దలవలన తెతియదగినది- అనువాదకుడు.) అ ముని శ్రేష్ఠులును వేదములతో సమానమును నర్వవాంఛా ఫలప్రద మును ఆధ్యమును అగు బ్రహ్మపురాణమును విని హర్షమును ప్రీతిని ఆశ్చర్యము పొందినవారై కృష్ణద్వైపాయన వ్యాసమహామునిని మరలమరల ప్రశంసించిరి.
మునులు వ్యాసుని ప్రశంసించినవిధము ఎంత ఆశ్చర్యమిది! ఓమునిశ్రేష్ఠా! మీరు వేదములతో సమానమును సర్వాభీష్టఫలప్రదమును సర్వపాపహరమును ఉత్తమమును విచిత్రపదములతో అక్షరములతో కూర్చబడినదియు అగు పురాణమును ప్రవచింపగా మేమువింటిమి. ఓప్రభూ ! త్రిలోములయందును మీకు తెలియనిది ఏదియులేదు. మీరు దేవతలలో బృహస్పతి వంటివారు. ఓమహాభాగా ! తాము సర్వజ్ఞులు. మహాప్రాజ్ఞులును బ్రహ్మతత్త్వజ్ఞలలో శ్రేష్ఠులును మహామునియునగు మిమ్ము నమస్కరించుచున్నాము. తాము భారతము నందు వేదములందు ప్రతిపాదింపబడిన విషయములను ఆనేకములను ప్రతిపాదించితిరి. ఓమహాముని! తాము ప్రతిపాదించిన సర్వగుణములను ఎవరుచెప్పగలరు? షడంగములతోకూడ వేదములను నాల్గింటిని వ్యాకరణములను ఆధ్యయనము చేసి భారతమున రంచిచిన జ్ఞాన స్వరూపుడగు వ్యాసునకు నమస్కారము. భారతమను తైలముతో నింపబడిన జ్ఞానమయమగు ప్రదీపమును వెలిగించిన వాడవును విశాలబుద్ధి కలవాడవును వికసించిన పద్మముల ఆకులవలె విశాలములగు కన్నులు కలవాడవును అగుఓవ్యాసా! నీకు నమస్కారము. ఆజ్ఞానమను తిమిరముచే గ్రుడ్డివారై కుదృష్టులచే భ్రాంతినొందింపబడిన వారినేత్రములను జ్ఞానమును కాటుకతోకూడిన శలాకతో మీరు విప్పారించితిరి. వారందరును ఇట్లుపలికి వాసునిపూజించి కృతార్థులై తాముతాము వచ్చినమార్గముల తమతమ ఆశ్రమములకు వెళ్లిరి.
ఓమునిశ్రేష్ఠులారా!సనాతనమున శాశ్వతములగు ధర్మములను ప్రతిపాదించు నదియు- సర్వపాప ప్రణాశనమును మహాపుణ్యప్రదమునునగు ఈపురాణమును వీకు చెప్పితిని. మీరు అడిగిన ప్రశ్నముల ననుసరించి దానికి అంతటికిని సవాధానమును వ్యాసుని అనుగ్రహమువలన ప్రతిపాదించితిని.
ఓం తత్సద్ర్బహ్మార్పణమస్తు.
ఇది బ్రహ్మచారులును గ్పహస్థులును యతులునుకూడ శ్రవణము చేయదగినది. పవిత్రము. నరులకు ధనసౌఖ్య ప్రదము; పాపనాశనము, బ్రహ్మ తత్త్వము నెరుగగోరిన బ్రాహ్మణాది వర్ణములవారందరును శ్రేయో೭భికాంక్షు లగువారును ప్రయత్నముతో లెస్సగా దీనిని వినవలెను. అందువలన బ్రాహ్మణుడు విద్యను క్షత్రియుడు రణమున విజయమును వైశ్యుడక్షయధనమును శూద్రుడు సుఖమును పొందును. పురుషుడు శుచిమనస్కుడై ఏఏకోరికను అభిధ్యానించుచు ఈ పురాణమును వినునో ఆకోరికనెల్ల పొందును. అందుసందేహములేదు. ఈ పురాణము విష్ణుని పరమదైతముగా ప్రతిపాదించునది. సర్వపాపనాశనము. పురుషార్థములన్నింటిని సంపాదింపజేయునది. అన్ని శాస్త్రములకంటె విశిష్ట మయినది. నేనుమీకు వినింపించిన వేదసంమితమగు ఈపురాణము వినినవారికి సర్వదోషములవలన కలిగిన పాపరాశియు నశించును. ప్రయాగ పుష్కర కురుక్షేత్రార్బుదక్షేత్రములందు ఉపవసించుటవలన కలుగు పుణ్యము కలుగును. నరుడు సంవత్సరముపాటు అగ్నిహోత్రమును చక్కగ వేల్చుటవలన కలుగు సుమహాపుణ్యఫలము కలుగును. జ్యేష్ఠశుక్లైకాదశి నాడు మధురలో యమునాజలమున స్నానముచేసి శ్రీకృష్ణుని దర్శించుటచే కలుగు ఫలముకలుగును. కేశవునియందు మనస్సుఅర్పించి-నిలిపి-సరియగు మనస్సుమాధానముతో హరికీర్తనము చేయుటచే కలుగు ఫలము ఈ పురాణశ్రవణమునందు (ని) హితమై – నిలుపబడియున్నది. దీని శ్రవణమువలన యజ్ఞక్రియాదర్శనముచే కలుగు ఫలము కలుగును. వేదసదృశమగు ఈ పురాణమును పఠించినను విన్నను అతడు విష్ణులోకమునకు ఏగును. ఏకాదశి ద్వాదశివంటి పర్వదినములందు శుచియై బ్రాహ్మణులచే ఈపురాణమును వినిపించిన – వినిపించుకొనిని – వారు విష్ణులోకమునకు పోవుదరు. ఇది యశమును ఆయువును సుఖమును కీర్తిని బలమును పుష్టిని కలిగించును. ధన్యునిగాచేయును. దుఃస్వప్నముల నశింప జేయును. చక్కని మనస్సమాధానముతో శ్రద్ధతో ఈశ్రేష్ఠమగు ఆఖ్యానమును వినినవారు సర్వములగు ఈప్సితములను పొందుదురు. రోగార్తుడు రోగమునుండి బద్ధుడు బంధనమునుండి భీతుడు భయమునుండి ఆపన్నుడు ఆపదలనుండి విముక్తుడగును. నరుడు పూర్వజన్మస్మృతిని విద్యను పుత్రులను మేధను పశువులను ధైర్యమును ధర్మార్థకామమోక్షము లను – ఇంతయేకాదు ప్రయతమగు – శుచియగు – మనస్సుతో ఏకోరికలను సంకల్పించివినునో ఆకోరికలనెల్ల పొందును. అందు సందేహమే లేదు.
స్వర్గ మోక్షప్రదుడును లోకములకు గురుడును (తల్లితండ్రి విద్యనుపదేశించినవాడు హితమునుపదేశించువాడు ఇట్టివారు గురువులనబడుదురు.) వరములనిచ్చువాడునగు విష్ణునినమస్కరించి భక్తియుక్తమగు ఏక చిత్తముతో శుచియై ఈ పురాణమును నిరతమును వినువారు సమస్తపాపములను నశింపజేసికొని ఇహలోకమున సమస్తసుఖ ములను అనుభవించి స్వర్గమున దివ్యసుఖమునుపొంది కడపట ఈ ప్రకృతి జన్యములగు గుణములనుండి విడుదలనుపొంది ముక్తులై మిగుల విమలమగు శ్రీహరిస్థానమును చేరుదురు. అందువలన స్వధర్మ నిరతులును ముక్తిమార్గమును మాత్రమే కోరువారును అగు బ్రాహ్మణశ్రేష్ఠులును నియమపరులును శాశ్వత శ్రేయస్సును కోరువారునగు క్షత్రియపుంగవులును విశుద్ధవంశమున జన్మించిన వైశ్యులును ధార్మికులగు శూద్రులును ఉత్తమమును బహుఫలప్రదమును ధర్మార్థమోక్షప్రదమునగు ఈ పురాణము అనుదిన మును వినవలయును.
పురుషోత్తములగు మీకందరకును ధర్మమునందు బుద్ధిస్థిరమగుగాక! పరలోకమునకు మీరుఏగినప్పుడు మీకు బంధువు అదియొక్కటియే. అర్థకామములను రెండు పురుషార్థములను మీరు ఎంత జాగరూకులై సేవించినను అవిమీపై సత్ఫలమును చూపజాలవు. వాని ఫలములు స్థిరములై యుండవు.
ధర్మముచే నరుడు రాజ్యమును స్వర్గమును ఆయువును కీర్తిని తపస్సును ధర్మమును దానిచే మోక్షమును పొందును. ఇహమునను పరలోకమునను ధర్మమే తల్లిదండ్రులును మిత్రుడును రక్షకుడును మోక్షప్రదమును. ధర్మము తప్ప మఱింకేదియులేదు.
ఈ పురాణము రహస్యమును శ్రేష్ఠమును వేదములతో సమానమును. బుద్ధిదోషము కలవానికిని. విశేషించి నాస్తికునకును – ఇంద్రియగోచరముకాని దేదియు నమ్మదగినది కాదనువానికిని – దీనిని అందించరాదు.
శ్రేష్ఠమును పాపనాశకమును ధర్మమును వృద్ధిచేయునదియు అగు ఈ పురాణమును నేనుప్రవచించితిని పర మర హస్యమగు దీనిని మీరువింటిరి. అయ్యా! పోయివచ్చెదను. ఆజ్ఞఇండు.
ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున రోమహర్షణ – మునిసంవాదమున పురాణప్రశంసనమను నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము.
ఆదిబ్రాహ్మపురాణము ముగిసినది
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹