సృష్ట్యుపసంహార లక్షణము
సర్వభూతములకును జరుగు ప్రతిసంచరము. అనగా ప్రళయము మూడు విధములు. 1. నైమిత్తికము, 2. ప్రాకృతికము 3. అత్యంతికము. వానిలో 1. బ్రహ్మదేవుని ఆయుఃకాలము సమాప్తికాగా కల్పాంతమున జరుగు ప్రళయము నైమిత్తికము. 2. జీవునకుమోక్షము లభించుటయే అత్యంతిక ప్రళయము. 3. రెండుపరార్ధముల కొకసారి జరుగునది ప్రాకృతప్రళయము. అని వ్యాసుడు పలికెను.
మాకు పరార్ధ కాలపరిమాణము తెలిసినచో దానికి రెట్టింపు కాలమగు ద్విపరార్ధముల తరువాత జరుగు ప్రాకృత ప్రళయము మాకవగతమగును. కనుక దానిని తెలుపుమని మునులు వ్యాసునడిగిరి.
సంఖ్యల లెక్కింపులో కుడివైపునుండి ఎడమవైపునకు పోగా స్థానపువిలువ పదిరెట్లు పెరుగుచుండును. అట్లు పోగా పదునెనిమిదవస్థానముతో పరార్ధమగును. ఒకట్లు పదులు నూర్లు – వేలు లక్ష-పదిలక్షలు-కోటి పదికోట్లు ఇటుపోగా పదునెనిమిదవస్థానములో ఏర్పడుసంఖ్య పరార్థము. అనగా 100,000,000,000,000 ఇదిపరార్ధ సంఖ్య. ఇన్ని సంవత్సరాలకాలమునకు రెట్టింపుచేసినచో ద్వివరార్థము. ఇట్టి ద్విపరార్ధకాలమున కొకసారి జరుగు ప్రళయము ప్రాకృతప్రళయము. అప్పుడు ఈవ్యక్త స్పష్టరూపముకల ప్రపంచము అంతయు తన మూలకారణముతో కూడ అవ్యక్తమగు ప్రకృతి మూలతత్త్వమునందు లయమునొందును.
నైమిత్తిక ప్రళయము వివరింతును. కాలపరిమాణములో మానవుని రెప్పపాటు అన్నిటికి మూలపరిమాణము. అట్టి నిమేషములు పదునైదు (పదునెనిమిది) కాష్ఠా అనబడును. ముప్పదికాష్ఠలుకల పదునైదుకలలునాడిక. రెండునాడికలు ముహూర్తము. ముప్పది ముహూర్తములు ఒకరాత్రింబగలు. ముప్పది అహోరాత్రములు మాసము. పండ్రెండుమాసములు సంవత్సరము. ఇట్టి మూడువందల అరవది సంవంత్సరములు దేవతల సంవత్సరము. పండ్రెండువేల దేవసంవత్సరములు ఒక చతుర్యుగము. అనగా కృత, త్రేతా ద్వాపర కలియుగములు నాలుగు అగును. వేయి చతుర్యుగములు బ్రహ్మదినము. కల్పాంతము, బ్రహ్మతోకూడ నైమిత్తికలయుము జరుగును. దానిస్వరూపము మిగుల భయంకరము . అది ఎదట మీకు తెలిపి పిమ్మట ప్రాకృతప్రళయ స్వరూపము వివరింతును వినుడు.
వేయి చతుర్యుగముల తరువాత మహీతలము చాలా వరకు క్షీణించిపోగా నూరేండ్లు ఎడతెగని అనావృష్టి ఏర్పడును. బలమంతగాలేని ప్రాణులనేకములు భూమిపై మిగుల పీడలపాలై నశించును. అంతట విష్ణుభగవానుడు రుద్రుని రూపమున సమస్త ప్రజలను తనలో లయము చేసికొనుటకు యత్నించును. అతడు సూర్యుని ఏడు కిరణముల యందును నిలిచి సమస్తజలమును త్రాగును. ప్రాణులన్నియు అందుచే శోషించును. సముద్రముల నదుల కొండల సెలయేళ్ళ- పాతాళముల -లోనున్న నీరంతయు ఇంకిపోవును. దానిచేనీరు మాత్రమే ఆహారముగాగల జీవరాశులును నశించి పోవును. అంతట ఏడుమంది సూర్యుల ఆవిర్భవించి వారు అన్ని దిక్కులకును ప్రజ్వలించుచు పాతాళతలము వరకుగల లోకమునంతటిని కాల్చివేయుదురు. వారిమూలమున ఈభూమి పర్వతముల సముద్రములతో కూడ దగ్ధమయి తాబేలు వీపువలె అయిపోవును. అంతట ప్రళయకాలాగ్ని రుద్రుని ఆదిశేషుని నిశ్శ్వాస వాయువుల తాపముచే సప్తపాతాళములను కాల్చివేయును. ఆ అగ్నియే పాతాళమునుండి భూలోకమునకు అచటినుండి స్వర్గమునకు కూడపోయి వరుసగా మూడు లోకములను పూర్తిగా కాల్చివేయును.
అపుడు ఈమూడు లోకములు జ్వాలల సుడులతో చుట్టివేయబడి కాలుచున్న వేపుడుమంగలము వలె నుండును. ముల్లోకములలోని బ్రాహ్మణులును తాపముతోనిండి బలము ఉపక్షీణమై ఎచ్చటను నిలుచుటకు అవకాశములేక మహర్లోకమునకు పోవుదురు. అచ్చటను మహాతాపముతో తపించి అంతకు పైనున్న జనలోకమునకు పోవుదురు. అంతట రుద్రరూపుడగు విష్ణువు తన నిట్టూర్పు అవిరులచే మేఘముల సృష్టించును. సంవర్తకములను పేరుతో ఆ మబ్బులు పెద్దఉరుములతో మెఱపులతో ఆకాశమంతట క్రమ్మును. ఏనుగులవలె కాటుకవలె నల్లకలువపూలవలె న్లలనివి కొన్ని పొగరంగుతోకొన్ని పచ్చనివికొన్ని పసపువలె లక్కవలె వైడూర్యరత్నముల వలె ఇందనీలములవలె శంఖముల వలె మొల్లపూలవలె జాజిపూలవలె అర్ద్రపురుగులవలె మనఃశిలవలె తామరపూరేకులవలె వెలిగెడి అమేఘములు అంతటను వ్యాపించును. నగరములవంటి పర్వతములవంటి గిడ్డంగులవంటి మిట్టనేలలవంటి అకారములతో పెద్దశరీరములతో పెద్దధ్వనులతో అవి ఆకాశమున నిండును. పెద్దవానలు కురియించి అభయంకరాగ్ని జ్వాలలను అర్పివేయును. ఆఅగ్ని చల్లారినతరువాత కూడ అమొఘములు ఎడతెగక వర్షించుచు లోకమునంతటిని నీటితోముంచును. అవి బండి ఇరుసంత లావైన జలధారల నీటితో భూమిని నింపిన తరువాత ఊర్ధ్వరుకములను లోన నింపును. ఇట్లు స్థిర్నర జీవులు జడచేతనే పదార్థములు అన్నియు నశించి లోకమంతయు అంధకారావృతమై యుండగా అమేఘములట్లు నూరుసంవత్సరములకు పై కాలము ఎడతెగక వర్షించుచునేయుండును.
ఇది శ్రీమహాపురాణమున ఆదిబ్రాహ్మమున వ్యాబుషి సంవాదమున సృష్ట్యుసంహారలక్షణకథనము అను నూట ఇరవై ఆరవ అధ్యాయము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹