శ్రాద్ధవిధివర్ణనమ్
మునులిట్లనిరి:- పరలోకమునకేగి తమ కర్మానుగుణమయిన స్థానమందున్న వారికి కొడుకులు మఱియును గల బంధువులు శ్రాద్ధమెట్లుపెట్టవలయునన వ్యాసభగవాను డిట్లనియె. జగన్నాథునికి వరాహమూర్తికి నమస్కరించి తెలుపుచున్నాను. కల్పమును వినుండు. మున్ను కోకాజలడందు మునిగిపోయిన పితరులను వరాహమూర్తియైన ప్రభువు శ్రాద్ధముంగావించి యుద్దరించెనన మునులు అదెట్లు జరిగెనో ఆనతిమ్మన వ్యాసుండిట్లనియె.
త్రేతా,ద్వాపరయుగ సంధిలో మున్నుమెరుగిరిమీద దివ్యులు మానుషులునైన పితరులు విశ్వేదేవులతో వసించిరి. (పితరులకు దేవత్వము మనుష్యత్వము నను రెండు ధర్మములు గలవజ శస్త్రములు తెలుపుచున్నవి. కావున పితృవతియైన యమునికి నరకచతుర్ధశినాడు. చేయవలసిన తర్పణము దేవతగాభావించి నవ్యముగానూ మనుషత్వమును భావించి ప్రాచీనారీతగిగానూ చెయవచ్చునని ధర్మశాస్త్రములు తెలుపుచున్నవి) అచటవారు కూర్చున్న దరికి సోముని కూతురు కాంతిమతియను దేవకన్య ప్రాంజలియై వారియెదుట నిలిచెను. వారు కళ్యాణి! నీవెవ్వతెవు. నీకు ప్రభువెవ్వడు? తెలుపుమనిరి. చంద్రకళను మీకిష్టమగునేని మిమ్ము నా ప్రభువులుగా వరించుచున్నాను. నా మొదటిపేరు ఊర్జ ఆపైన స్వధయను పేరంబిలువబడుచున్నాను. ఇప్పుడే మీరు ‘కోక’ అనుపేర బిల్చినారు. పితరులామె పలుకులువిని ఆమె మొము వంక జూచి తృప్తిసెందరైరి. (మోహపడిరన్నమాట) అ కన్యసూరకచూచుతు తనివి సెందక యోగ భ్రష్టులైనవారని యోఱింగి విశ్వేదేవులా పితరులను వారిని వదలిపెట్టి త్రిదివంబున కరిగిరి.
చంద్రభగవానుడు. తనకూతురు నూర్జనింటగానక మనసు కలతపడిన మనస్సుతో ఎటుపోయినదని ఆలోచించెను. అసమాధిలో అతడామె కామముతో ఇతరులకడకు ఏగెనని వారిచే హృదయ పూర్వకముగా ఆమె స్వీకరింపబడిన దనియు తపోబలమున నేణింగెను. అంత గినుకగొని శశాంకుడు యోగభ్రష్టులై మనస్సు స్థాయిచెడి తండ్రి హద్దులోనున్న సాధ్వినీ! చీనీయకుండ నాకన్యను హరించితిరి గావున మీరు క్రింద బడుదురుగాక అని శపించెను. ఈ నాకూతురును స్వతంత్రురాలై ధర్మమువిడిచి భరించినందున కోకయను పేర హిమాద్రిపైన యుగుగాక యనియె. ఇట్లుశప్తులైన పితృదేవతలు యోగ భ్రష్టులై హిమగిరి మొదటబడిరి. ఊర్జయు నక్కడనే హిమగిరి ప్రస్థమందుపడి సప్తసాముద్రమము తీర్థముంజేరి కోకయను పేర నూరుతీర్థములతో హిమగిరి శిఖరమును దడుపుచు నర్పణము సేయుటవలన (ప్రవహించుట వలన) సరిత్తు(నది) అను పేరందెను.
యోగమందిన పితరుల చల్లనినీటితోనున్న మహానదిం జూచిరి. కానియది చంద్రుని కూతురగు ఊర్జయేయని యెఱుంగరైరి. అంతట పితరుల ఆకలిచే గుములుచున్నట్లు ఒక రేగువృక్షమును మధుక్షీరమునోసంగు నొక ఆవును నొసంగెను. దివ్యమైన క్షీరముకొరకా నది జలము రేగుపండు అను నీ ఆహారము పితృదేవతల పోషణమునను నిరూపించబడినది. ఆ విధమైన వృత్తితో (ఆహారాదుల సేవనముతో) ఈవించుచున్న పితరుల కదివేలేండ్లొక్క దినమట్లు గడచెను.
ఈ విధముగా లోకమెల్ల పితృశూన్య స్వధాకారము వినిపింప నంతట దైత్యులు రాక్షసులు యాతుధానులు బలవంతులైరి. వారు విజృంభించి విశ్వదేవతలతో విడివడిన పితృగణములపై నలువైపుల నుండి వచ్చిపడిరి. అదిచూచి పితరులు రోషముగొని యొడ్డునున్న యొక రాతినెత్తి పట్టుకొనిరి. ఆరాయి తొలగగానే నది వేగమెక్కువై నీటిచే పితరులను హిమాలయమును గూడ మంచెత్తెను. పితరులంతా ర్హితులైనంత రాక్షసులు తాండ్ర చెట్టునెక్కి నిరాహారులై దాగికొనిరి. పితృదేవతలు నీటివెల్లువకు వంత చెంది యాకట నకనకంబడి ఆ నీటనే యుండి విష్ణుని శరణోందిరి.
గోవింద! నీవు జయింపుము. జగన్నివాస! ఓ కేశవ నీదయచే మాకును జయమగుగాక ! ఆప్రతిమతప్రతావుడవు మమ్మీనీట మునిగిన వారినుద్దరింపుము. దారుణాకారులైన ఆ రాక్షసులకు జడిసిపోవుచున్న మమ్ము ఓవరాహమూర్తీ! రక్షింపుము. నీ పుణ్యనామములు సంకీర్తనము నేసినంత రాక్షసులు భూతప్రేత పిశాచాదులు నశితురు. ధర్మాధి పురుషార్థములు సిద్ధించును. అని యిట్లు స్తుతింప విని తన దివ్యమూర్తిని జూపి కోకానది ముఖమందు నీటమునిగి తలపై రాతిం ధరించి యున్న పితృగణముం జూచెను. అంతట వరాహమూర్తియే హరి పితృగణము నుద్దరింప సంకల్పించెను. తన కోఱచే గొట్టియేత్తి ఆ రాతిని విసరివైచెను. పితరులనీటినుండియెత్తిమీదికాకర్షించెను. ఆదివ్యవరాహము కోరయందున్న పితరులు బంగారమట్లు మెఱయుచు విష్టునిచే భయముక్తులైరి. అట్లువారినెత్తి విష్టుతీర్థమను పేరందిన ఆ తావున హరి వారిని లోహార్గములనందలి జలమును త్రావనిచ్చెను. అవ్వల తన రోమముల నుండి పుట్టిన దర్భలను చెమటనుండి పుట్టిన నువ్వులను జేకొని కొఱకం చొకదానిని సూర్యసమాన ప్రభనుగ గల్పించి ఒక పాత్రను తీర్థముగా రూపొందించి కోటివటము క్రింద నిలువబడి గంగాధరమను తీర్థమందలి ఉదకమును తుంగకూటము నుండి గైకొని యజ్ఞయములైన ఓషధులను మధుక్షీర రసములను గంధములను పువ్వులను గంధదూపదీపాదులను జేకొని సరస్సు నుండి ధేనువును సముద్రమునుండి రత్నములను గైకొని భూమిని కోరచే గీసి నీటం దడిపి భూమిని కుశలచే గీసి కొఱవినిదానిచుట్టుం ద్రిప్పిమఱలమఱల నీరు ప్రోక్షించి రోమకూపములందుండి ప్రాగగ్రములైన (తూర్పువైపుకొసలుగా నున్న) కుశలను గ్రహించి ఋషుల నాహ్వానించి పితృతర్పణము చేయుదుననిమె. వారును చేయమను ప్రభువు విశ్వేధవులను బిల్చి సమంత్రకముగ వారికి విష్టరముల (అసనములను) నొసంగి యక్షతలచే దేవతారక్ష సేసెను. సర్వదేవతల యంశలతో బుట్టిని అక్షతలు ఓషదులు సన్నిదిశల నంతట రక్షణ యిచ్చుటకు గల్పింపబడినవి.దేవదానవ దైత్య యక్షరక్షస్సులం జరాచరమందెక్కడును వానికి క్షయము నెవ్వరు గల్పింపజాలరు. గావున వానికి అక్షతములు అనుపేరేర్పడినది. మున్ను విష్ణువు దేవతారక్షరణకొరకే యక్షతల నేర్పరచెను. కుశలు గంధము యువలు పువ్వులచే అర్ఘ్యమొనంగి వరాహమూర్తి విశ్వేదేవుల నిట్లడిగెను.
దివ్యులు మనుషులును గూడ నైన పితరులను ఆహ్వానించుచున్నాననియో. వారు పిలువుమని వారిని శుచియై పిలిచెను. నువ్వులతో మొదళ్ళు చివరలు కూర్చిన దర్భలను మోకాలిపై హస్తమానించి సవ్యముగ అననమోసంగెను. అదే విధముగ పితరులను పితృస్థానమందున్న విప్రులకు ”ఆయాంతు” అను మంత్రము సెప్పుచునాహ్వనించెను. ”అపహత” అను మంత్రముచే నపస్యవముగా అసురాదులనవలసరక్షణనిచ్చి పితరుల నామగోత్రములతో ”తత్పతరోమనోజరానావా ఆగచ్ఛత” అనుమంత్రముకూడా జెప్పుచు నావాహనము సేసెను. ”సంవత్సరైః” అను మంత్రముచే నర్ఘ్యమిచ్చెను. యాస్తిష్టంత్యమృతావాచోయన్మ అనియన్మేపితామహ అనితండ్రికిపితామహునికి ”యన్మే ప్రపితామహ”అని ప్రపితామహునికి కుశ గంధపుష్పతిలమిశ్రమైన యర్ఘ్యమును అపస్యముగ నిచ్చెను. అట్లే మాతామహులకును విష్ణువు పొనరించెను. ఇట్లు గంధాదులచే నర్చించి ధూవదీపము లొసంగి ”అదిత్యా వనసవోరుద్రా” అను మంత్రముతో నెయ్యి నువ్వులు దర్భలతో నన్నమును పాత్రయందుంచి యవ్వల మునులజూచి ”అగ్నౌకరిష్యే” అని పిలికి వారు కురుష్య (చేయుము) అని ప్రేరణ యీయి సోమునికి అగ్నికిని యమునికిని మూడాహుతులిచ్చెను. ”యోమామకేతి” అను యజుర్మంత్ర సప్తకము జపించి హోమశిష్టమును నామగోత్రములతో నొక్కొక్కసారి మూడేసి యాహుతులుగా పితృస్థానమం దొసంగెను. ఇందు మిగిలిన యన్నమును పిండపాత్ర యందుంచెను.
ఆ మీదట పరిశుద్దము (ప్రత్యగ్రము) ఒకేసారి యుడికినది నిలువయుండనిది కూరలు తక్కువ పండ్లెక్కువ యునై యాఱురసములు గల్గి యమృతోపమానమయిన యన్నమును బ్రాహ్మణుల కారగిం పిడి పిండపాత్రయందు గూడ వడ్డించి మంత్రముతో నేయి తేనెయుంగూర్చి పృథివి అనియు మధువాతా అను ఋగ్వేదమంత్రమును బఠించెను. బ్రాహ్మణులు భోజనము సేసినతర్వాత నై దుమంత్రములు య త్తే యను ఋక్కుతో నారంభించి నాధికం అను సమాప్తిమంత్రమువరకు జపించెను. త్రిమధు త్రిసువర్ణ మంత్రములను బృహదారణ్యకమును మఱియు జపింప వలసిన సౌకరసూక్త పురుషపూక్తములనుగూడ జపించెను. విప్రులు భోజనము సేసిన తర్వాత తృప్తాస్థ మీరు తృపులైనారా? అని అడిగి వారు తృప్తాస్మ తృప్తులైనాము అని అన్న తర్వాత అంతవరకు మౌనముతో భోజనము సేసిన బ్రాహ్మణులు మౌనవిమోచనము నేయుటను సూచించును ఉత్తరపోశన మొసంగెను.
ఇతి శ్రీమహాపురాణే అది బ్రహ్మే వ్యాపఋషి సంవాదే శ్రాద్ధ విధినిరూపణంనామ
ఏకోన వింశత్యధిక ద్విశతతమోధ్యాయః
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹