పులస్త్యుడిలా చెప్పసాగాడు :-
ఓ నారదా ! ఋషి కన్య అయిన పవిత్ర ఇరావతికి వెళ్ళి స్నానం చేసి ఆ ప్రహ్లాదుడు చైత్ర అష్టమి నాడు జనార్దనుని పూజించాడు. అచట శుచియై పుణ్య ప్రదమైన నక్షత్ర వ్రత మాచరించి ఆ దానవేశ్వరుడు కురుక్షేత్రానికి వెళ్లాడు. ఐరావత మంత్రాలతో సుదర్శనుడగు చక్రతీర్థుని అర్చించి విధ్యుక్తంగా స్నానం చేశాడు. ఆ రాత్రి ఉపవసించి భక్తితో కురుధ్వజుని పూజిచి శుచియై నృసింహదేవుని చూచుటకు వెళ్ళాడు. ఆ…
వైశాఖవ్రత మహిమ
నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల…
యముని పరాజయము
అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు…
నారదుడు ప్రశ్నించాడు :-
స్వామీ ! ఆ అసమాక్షుడు శివుడు లోకనాధుడైన విష్ణునకు లోకపూజితమైన చక్రాయుధం ఎందులకిచ్చెను? అందుకు పులస్త్యుడిలా చెప్పపాగాడు. నారదా ! ఈ చక్ర ప్రధానకధ మహా పురాతనమైనది. శివమాహత్మ్యాన్ని పెంపొందించేదని. చెబుతున్నా జాగ్రత్తగా వినుము. ఒకప్పుడు వేత్త ద్విజాతిశ్రేష్ఠుడు మహానుభావుడు గృహస్థాశ్రమంలో వున్నవాడు ''వీతమన్యుడు'' అనువాడు ఉండెను. ఆత్రేయుడు, అతని భార్య పతివ్రత శీలవతి, పతియే ప్రాణంగా భావించిన సాధ్వి, పేరు ధర్మశీల.…
యమదుఃఖ నిరూపణము
నారదుడు అంబరీషునితో నిట్లు పలికెను. శ్రుతకీర్తి మహారాజునకు శ్రుతదేవుడు తరువాతి కథనిట్లు వివరించెను. వాయువు చేసిన యుపచారముల వలన ఊరడింపువలన కొంత తేరుకున్న యముడు బ్రహ్మనుద్దేశించి యిట్లు పలికెను. స్వామీ! సర్వలోక పితామహా! బ్రహ్మ! నా మాటను వినుము. నేను నా కర్తవ్యమును నిర్వహింపకుండ…
గయాక్షేత్రానికి ఆ ప్రహ్లాదుడు ప్రయాణించాడు
ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి శంకరుని దర్శించి సువర్ణాక్షుని అర్చించి అతడు నైమిషారణ్యానికి వెళ్లాడు. అక్కడ గోమతి కాంచనాక్షి గురుదా నదుల మధ్య నున్న పాపనాశకాలయిన ముప్పదివేల తీర్థాలలో స్నానాలు చేసి పీతాంబరుడగు నచ్యుతుని అర్చించి, అచటగల నైమిషారణ్యవాసులయిన ఋషులనందరను పూజించాడు. మహాదేవుడగు శంకరుని ఆరాధించి అటనుండి గోపతిదేవుని దర్శించుటకు గయాక్షేత్రానికి ఆ ప్రహ్లాదుడు ప్రయాణించాడు. అచట బ్రహ్మధ్వజంలో స్నానం చేసి ప్రదక్షిణలు చేసి పితృదేవతలకు పిండ…
విష్ణువు యముని ఊరడించుట
నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ యిట్లనెను. ఓయీ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత…
నారదుడు ప్రశ్న చేశాడు : -
బ్రహ్మర్షి ! పరమ భక్తుడైన ప్రహ్లాదులు శ్రద్దగా జపించిన గజేంద్ర మోక్షణం మొలయిన నాలుగు స్తోత్రాలేమో చెప్పండి అపుడు పులస్త్యుడిలా చెప్ప సాగాడు. ఓ తపోధనా! దేనిని జపిస్తే వింటే స్మరిస్తే దుఃస్వప్నాలు నశించునో ఆ గజేంద్ర మోక్షణ గాధను ముందుగా వినుము. తర్వాత సారసత్వ పాప ప్రశమన స్తోత్రాలు చెబుతాను. సర్వ రత్నాలతో నిండిన త్రికూట మనే భవ్య పర్వతం ఉంది. సూర్య కాంతితో వెలిగే…
పిశాచత్వ విముక్తి
నారదుడు అంబరీషునకు వైశాఖమహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి యింకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. శ్రుతదేవుడిట్లనెను, రాజా! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును…
పులస్త్యుడిలా అన్నాడు : -
ఒకప్పుడు బ్రాహ్మణ హింసకుడు, దగా కోరు, పరులను పీడించువాడు, నీచుడు, క్రూర స్వభావుడు నైన క్షత్రియాధముడుండెడి వాడు. పితృ దేవతలను, ద్విజులను, వాడెల్లప్పుడు ద్వేషించి హింసించేవాడు. కొంతకాలమునకు ఆయువు తీరి వాడు మరణించి భయంకర రాక్షసుడైనాడు. ఈ కర్మదోషం వల్ల రాక్షస యోనిలో కూడ వాడు మరింత జన పీడకుడుగా నరభక్షకుడుగా రూపొందాడు. అదే రాక్షస వృత్తిలో వాడు నూరేండ్లు…
పాంచాలరాజు - రాజ్యప్రాప్తి
నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు…
పులస్త్యుడు నారదునికి ఆ స్తోత్రం యిలా వినిపించాడు -
ఓ జగన్నాధా! నీకు ప్రణామము. దేవ దేవా నీకు నమస్కారము!వాసుదేవా! బహురూపీ! నీకు నమస్కారము. ఏకశృంగా! వృషాకపీ! శ్రీనివాసా!భూతభావనా! నీకు నమస్సులు. విష్వక్సేనా! నారాయణా! ధ్రువకేతనా! సత్యధ్వజా! నీకు నమోవాకములు! యజ్ఞధ్వజా! ధర్మధ్వజా! తాళధ్వజా! (బలరామ), గరుడధ్వజా! నీకు నమస్కారము. సర్వోత్తమా! విష్ణూ!వైకుంఠా!పురుషోత్తమా!జయంతా!విజయా! జయా!అనంతా!పరాజితా! (భక్తపరాజితా)! నీకు నమస్కారము. కృతావర్తా! (కల్పాల రూపాన తిరిగేవాడా)! మహావర్తా! (అందరనూ…