పులస్త్యుడు తరువాతి కథ కొనసాగించాడు
ఓ నారదా! అలా దేవత లంతా స్వర్గం వదలిపెట్టి బ్రహ్మలోకానికి వెళ్లిన తర్వాత బలి రాజేంద్రుడు ముల్లోకాలను ధర్మం తప్పకుండా పరిపాలించాడు. జగత్తు నంతా కృతయుగంగా మారిపోవడం గమనించిన కలి భయంతో తన స్వభావానికి తగినట్టుగా సత్యలోకానికి వెళ్లి బ్రహ్మ కాళ్లు పట్టుకున్నాడు. అక్కడ యింద్రాది దేవతలు రాక్షసులతో కూడి బ్రహ్మ తన తేజస్సుతో, పరిసరాన్నంతా వెలిగింపజేస్తూ దర్శన మిచ్చాడు. బ్రహ్మ రెండు…
సతీదేహ త్యాగము
అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ! యిక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను, పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు…
దక్షయజ్ఞనాశము కామదహనము
రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు, వాని వెంట…
పులస్త్యుడిట్లనెను
నారదా| తన త్రిలోకాధిపత్యం రాక్షసుల పాలైపోగా మొగము వ్రేల వేసికొని దేవతలతో కలిసి యింద్రుడు బ్రహ్మసదనానికి వెళ్లాడు, అక్కడ పద్మోద్భవుడైన బ్రహ్మను, ఋషి సమూహాన్ని తన తండ్రి అయిన కశ్యప మహర్షినీ, చూచి వారలందరకు తలవంచి ప్రణామాలు గావించి యిలా విన్నవించాడు. "పితామహా| నా రాజ్యాన్నంతనూ బలిదైత్యుడు బలపూర్వంగా అపహరించాడు. 'అది విని చతుర్ముఖుడు 'అది అంతా నీ స్వయంకృతాపరాధ ఫలితమే' ననగా శక్రుడు…
రతి దుఃఖము - దేవతల ఊరడింపు
నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచూ ఇట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను. కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను…
పులస్త్యుని వచనం :-
దేవమాత ఉదరంలో వామనాకృతితో భగవంతుడు ప్రవేశించినంతనే, ఆ స్వామి చెప్పినట్లే, దైత్యులందరూ తమ తేజస్సును కోల్పోయారు. అలా అసురులందరు తేజో హీనులగుట చూచి బలి, దానవేశ్వరుడైన ప్రహ్లాదునితో యిలా అన్నాడు. 'తాతా! మీరు పరమ జ్ఞానులు. మన రాక్షస వీరు లంతా యిలా తేజస్సు గోలుపడి యుండుటకు కారణమేదో చెప్పండి.' అంతట మనుమని ప్రశ్న విని ఆ ప్రహ్లాదుడు ముహూర్తకాలం ధ్యానస్థుడై వారలతేజోహానికి…
కుమారజననము
మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను యింటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును, ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను…
నారదుడు ప్రశ్నించాడు : -
ఓ ద్విజోత్తమా ! ప్రహ్లాదుడు డే యే తీర్థాలలో పర్యటించాడు. ఆ వివరాలు సమగ్రంగా చెప్పండి.
ఆ వివరాలు చెప్పండి. అందుకు పులస్త్యుడిలా అన్నాడు. నారదా ! వినుము పాపపంకాన్ని క్షాళనం చేయ గలిగిన ఆ ప్రహ్లాదుని తీర్థ యాత్రా విశేషాలు చెబుతున్నా, ప్రహ్లాదుడు బంగారు పర్వతం మేరువును వదలి, భూలోకంలో దేవతలచే చుట్టబడి కళ్యాణ ప్రదంగా భావించ బడే మానస తీర్థానికి…
ఛత్రదాన మహిమ
శ్రుతదేవమహాముని యిట్లు పలికెను. వైశాఖమాసమున యెండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు ఎండ వలన బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యమనంతము. దానిని వివరించు కథను వినుము. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ యిది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు నతడు ఒకప్పుడు వేటకు…
పులస్త్యుడిలా అన్నాడు
పవిత్ర యమునా నదిలో స్నానం చేసి విక్రమ దేవుని పూజించి ఆ రాత్రి ఉపవాస ముండి ప్రహ్లాదుడి, లింగ భేద పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్మలోదకాల్లో స్నానం చేసి భక్తితో దర్శించి ఒక రాత్రి ఉపవసించి పిమ్మట కేదార క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ స్నానాదులు చేసి అభేదబుద్ధితో మాధవ ఉమాధవులను అర్చించి ఏడు దినాలు ఉపవసించి ఆమీద కుబ్జామ్ర క్షేత్రానికి వెళ్ళాడు. ఆ…
అశూన్య శయనవ్రతము
నారదమహర్షి అంబరీషమహారాజుతో నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు "మునివర్యా! మన్మధుని భార్య రతిదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకా వ్రతవిధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి. దయయుంచి నాకా వ్రత విధానమును వివరింపుడు. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజనము, ఫలము మున్నగువానిని గూడ చెప్పగోరుదునని యడిగెను. …
నారదుడిలా అడిగాడు :-
ఓ విప్రోత్తమా ! శ్రీ యఃపతి యగు వాసుదేవుని పురూరవుడు నక్షత్ర పురుష వ్రతం ద్వారా ఎలా ఆరాధించినదీ చెప్పండి అందుకు పులస్త్యుడు చెప్ప మొదలు పెట్టాడు. నారదా ! నక్షత్ర పురుష వ్రత విధానమూ శ్రీహరి నక్షత్రాంగాల వివరమూ చెబుతున్నా వినుము. శ్రీహరి చరణాలలో మూలా నక్షత్రం జంఘలలో రోహిణీ నక్షత్రం ఉంటాయి. మోకాళ్లలో అశ్వినులు రూపొందుతాయి తొడలలో ఆషాఢా నక్షత్రం ఉంటే…