Skip to content Skip to sidebar Skip to footer

🌹🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹🌹 – పదకొండవ భాగము

"కృష్ణస్తు భగవాన్ స్వయం" భగవంతుని అన్ని అవతారములూ గొప్పవే. అందునా కృష్ణావతారము చాలా గొప్ప అవతారము. "కృష్ణస్తు భగవాన్ స్వయం" అందుకే భాగవతమునకు "జయ" అని వింతయైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే, "నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్! దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్!!"…

Read More

🌹🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹🌹 – పదవ భాగము

భగవంతుని అవతారములు:- పరమాత్మ నీవు గుర్తుపడితే ఇరవైరెండు రూపములు ప్రధానమయినవిగా వచ్చాడు. ఆ ఇరవైరెండు రూపములు గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థం అయిపోతుంది." అన్నాడు సూతుడు. అలా ఎక్కడ వచ్చాడో చెప్పమని శౌనకాది మహర్షులు పరమానందంతో అడిగారు. అపుడు ఆయన అన్నారు – "క్షీరసాగరమునందు శయనించి లోకుల అన్ని…

Read More

🌹🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹🌹 – తొమ్మిదవ భాగము

వేదవ్యాసుడిని నారద భగవానుడు ప్రార్థనచేస్తే ఆయన సలహామేరకు వ్యాసుడు తన ఆశ్రమంలో భాగవతమును రచించడం ప్రారంభంచేశారు. దానిని మన అదృష్టవశాత్తు మన తెలుగువారయిన పోతనామాత్యులవారు ఆంధ్రీకరించారు. శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా కారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ!! …

Read More

🌹🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹🌹 – ఎనిమిదవ భాగము

నారదుని పూర్వజన్మ వృత్తాంతము "వ్యాసా! నేను ఈవేళ ఎందుకు నారదుడుగా ఉన్నానో నీకు చెపుతాను. నా చరిత్ర వింటే నీవు తెల్లబోతావు" అని నారదుడు తాను నారదుడెలా అయ్యాడో చెపుతాడు. నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లిగారు చిన్నతనంనుంచీ బాగా ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది. వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ…

Read More

🌹🌹🌹శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹🌹 – ఏడవ భాగము

భాగవతం అనేది సామాన్యమయిన గ్రంథము కాదు. లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మంజులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై!! దీని స్కంధము చూస్తే లలితము. కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టుబాగా పెరగాలంటే చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తారు. అపుడు చెట్టు బాగా పెరుగుతుంది. శుకబ్రహ్మ ఆలాపన చేసిన మహోత్కృష్టమయిన స్తోత్రము. అపారమయిన మంజులమయిన…

Read More

🌹🌹🌹శ్రీమదాంధ్ర భాగవతం🌹🌹🌹 – ఆరవ భాగము

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన! విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేతపరతు!! ఎంతవినయంగా చెప్పుకున్నారో చూడండి! భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు. జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది. కానీ "మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో దానిని నాకు అర్థమయిన…

Read More

🌹🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹🌹 – శ్రీకైవల్యపదంబు జేరుటకునై – పద్యం

పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు. శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!! పోతనగారి శక్తి ఏమిటో పోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ…

Read More

🌹🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹🌹 – ఐదవ భాగము

పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు. శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!! పోతనగారి శక్తి ఏమిటో పోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి –…

Read More

🌹🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹🌹-నాల్గవ భాగము

శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షంలో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం ఏమిటి? తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన అన్నాడు – "ఈ శరీరం చచ్చిపోతుంది – బెంగలేదు" అన్నాడు. ఆయనకు తెలిసిపోయింది. ఏమిటి? చనిపోవడం అనేది అసలు ఆత్మకు లేదు. మరి చనిపోయేది ఏది? శరీరం. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగం చేసినా తపస్సు చేసినా, అశ్వమేధ యాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షాన నిలబడి యుద్ధం…

Read More

🌹🌹🌹శ్రీమదాంధ్ర భాగవతం🌹🌹🌹 – మూడవ భాగము

భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరు వినలేరు అని శాస్త్రం చెపుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన పదిహేడు పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది. ఏదో నిరాశ! ఏదో లోటు!…

Read More

🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹 – రెండవ భాగము

మొట్టమొదటిది అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ పదునెనిమిది పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. …

Read More

🌹🌹 శ్రీమదాంధ్ర భాగవతం 🌹🌹 – మొదటి భాగము

భాగవత పురాణము వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము…

Read More