బదరికాశ్రమ మాహాత్మ్యం
పవిత్రమైన హిమాలయపర్వతాల మీద దేవతలకి కూడా దుర్లభమైన ఒక దివ్య ప్రదేశం ఉంది. అదే బదరికాశ్రమం. ఆ క్షేత్రం సంసారబాధల నుంచి ఉపశమనం కలిగించే శక్తి కలిగింది. శ్రీమన్నారాయణుడి మీద అచంచలమైన భక్తి శ్రద్ధఉన్నవారు మాత్రమే ఆ బదరికాశ్రమానికి చేరుకోగలరు. అక్కడికి వెళితేనే చాలు మానవుల మనోరథాలన్నీ తీరిపోతాయి. అక్కడున్న ఎత్తైన శిఖరాల మధ్యలో బ్రహ్మకుండం అనే ప్రసిద్ధ సరోవరం ఉన్నది. ఆ ప్రాంతంలోనే…
శ్రీమన్నారాయణ రహస్య పూజావిధానం :-
భూదేవితో వరాహ అవతారాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడు ఈ విధంగా అంటున్నాడు. దేవీ! నీవు ఇంతకు ముందు సంసారతారణం గురించి ఏంచేయాలి? అని ప్రశ్నించావు చెబుతున్నా విను. "నా పనుల మీద శ్రద్ధతో, నన్ను పూజించాలన్న ఆసక్తితో, ఎలాంటి చెడ్డ ఆహారాన్నీ స్వీకరించకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవారే…
త్రిశక్తి ఆవిర్భావం :-
సకల కళాస్వరూపిణిగా భాసిస్తున్న ఆ దివ్యశక్తిరూపిణి తెల్లగా ప్రకాశిస్తోంది. సర్వాక్షరాలూ ఆ దేవి స్వరూపాలే. అందుకే ఆమెని వాగీశ్వరి అంటారు. కొంతమంది సరస్వతి అంటారు. సకల విద్యలకీ ఆమే అధి దేవత. అందుకే పండితులు ఆ దేవిని విభావరి! విశాలాక్షీ! వరాననా! అని పిలుస్తారు. బ్రహ్మాది దేవతలంతా ఆ దేవి దగ్గరకొచ్చి "దేవీ! నీవు ముగ్గురు మూర్తుల శక్తితో ఆవిర్భవించావు.…
శక్తి స్వరూపం
పూర్వం భూదేవి వరాహమూర్తిని ప్రభూ! పరబ్రహ్మ పరమాత్మ ఎవరంటే! శివుడని కొందరు, బ్రహ్మదేవుడని మరికొందరు చెబుతున్నారు. నిజానికి పరదైవం ఎవరు అని అడిగింది. వరాహమూర్తి భూదేవితో పరదైవం గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు. జగన్నాథుడైన నారాయణుడే పరదైవం పరబ్రహ్మ. ఆయన నుంచే…
రుద్రుడు - విష్ణువు అభేదం
పూర్వం బ్రహ్మదేవుడు తననుంచి ఆవిర్భవించిన రుద్రుణ్ణి పిలిచి సృష్టిచేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు సృష్టిచేసే సామర్థ్యం లేనికారణంగా రుద్రుడు నీళ్ళలోకి మునిగాడు. అలా నీటిలోకి చేరిన రుద్రుడు బొటనవేలంత పరిమాణంలో ఉన్న పరబ్రహ్మని ధ్యానిస్తూ అక్కడే ఉన్నాడు. అంతలో ఆయన ముందు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న పదకొండుమంది మహాపురుషులు, నీళ్ళలోంచి పైకి లేచి వెళుతున్నారు. వారిప్రభావంతో ఆ జలమంతా వేడెక్కిపోయింది.…
ప్రజాపాలుడు - గోవింద స్తవం
పూర్వం ప్రజాపాలుడనే మహారాజుండేవాడు. అతడెంతో ధర్మ పరాయణుడు. అతడి పూర్వీకులందరూ మొదటి త్రేతాయుగంలో మణివంశంలో జన్మించిన వారు. వారంతా తిరిగి రెండో త్రేతాయుగంలో కూడా జన్మించారు. వారిలో మణివల్ల జన్మించిన దీప తేజుడనే వాడు రెండో త్రేతాయుగంలో శంతుడనేవాడిగా, అలాగే సురరశ్మి - శతకర్ణుడుగా, శుభదర్శనుడు పాంచాలుడిగా, సుశాంతి…
పౌర్ణమాసీ తిథి - చంద్రుడి వృత్తాంతం
బ్రహ్మమానసపుత్రుడు అత్రిమహర్షి. ఆయన గొప్ప తపస్సంపన్నుడు. ఆయన పుత్రుడే చంద్రుడు. ఆ చంద్రుడు దక్షుడి కుమార్తెలైన 27 మంది కన్యల్ని వివాహం చేసుకున్నాడు. వారందరిలోకీ చిన్నది రోహిణి. చంద్రుడు నిత్యం రోహిణితోనే విహరిస్తూ మిగిలిన భార్యల్ని నిర్లక్ష్యం చేసేవాడు. వారంతా తండ్రి దగ్గరకి వెళ్ళి తమ భర్త తమని నిర్లక్ష్యం చేస్తున్న సంగతిని చెప్పారు. అప్పుడు దక్షుడు చంద్రుడి…
అమావాస్య తిథి, పితృదేవతలు
పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు. అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూల ద్రవ్యాన్ని మనసులో నిలుపుకుని, వారిని బైటికి తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుంచి లోపల ఉన్న తన్మాత్రలు పొగరూపంలో బైటికి వచ్చాయి. పొగరంగులో వున్న ఆ దివ్య పురుషులు మేము సోమరసం త్రాగుతాం…
చతుర్ధశీతిథి - రుద్రసంభూతి వృత్తాంతం :-
పూర్వం సృష్టిని చేయాలని ప్రయత్నించిన బ్రహ్మదేవుడు ఎంత ప్రయత్నించినా సృష్టిని ఎలా ప్రారంభించాలో స్ఫురించలేదు. ఆ కారణంగా ఎంత కాలానికీ సృష్టి వృద్ధిచెందక పోవటంతో ఆయనకి ఎంతో బాధకలిగింది. తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కొద్ది సేపటికి వెంటనే ఆయన శరీరం నుంచి...
తపస్సతో తః స్థిరకీర్తిఃపురాణో రజస్తమోధ్వస్తతిర్బభూవ|
వరోవరేణ్యో వరదః ప్రతాపీకృష్ణారుణః పురుషః పింగనేత్రః ॥…
త్రయోదశి - ధర్మోత్పత్తి వృత్తాంతం
పూర్వం అవ్యయుడు, సనాతనుడు అయిన బ్రహ్మ ప్రజల్ని సృష్టించాలని సంకల్పించాడు. అయితే తాను సృష్టించిన ప్రజల్ని పాలించేవాడెవరు? అన్న సందేహం ఆయనకి వచ్చింది. అలా ఆయన చింతిస్తుండగా బ్రహ్మ కుడిభాగం నుంచి తెల్లటి కుండలాలు, తెల్లటి పూలమాలలు ధరించిన పురుషుడు ఆవిర్భవించాడు. ఆ దివ్య పురుషుణ్ణి చూసిన బ్రహ్మ అతడితో " ఉత్తముడా! నీవు నేను సృష్టించిన ప్రజలందర్నీ…
ద్వాదశి తిథి - వైష్ణవ వృత్తాంతం
పూర్వం పరబ్రహ్మ అయిన నారాయణుడికి ఈ సృష్టి గురించి ఒక ఆలోచన వచ్చింది. "ఈ సృష్టినంతా నేనే చేసాను కదా! కనుక నేనే దీన్ని పాలించాలి. అసలు ఆకారంలేని సృష్టితో ఏ పనీ చేయటం వీలుకాదు. కనుక నేనొక మూర్తిని సృష్టించటం మంచిది.…
దశమీతిథి - దిక్కుల వృత్తాంతం :-
ఆరంభంలో సృష్టిని మొదలుపెట్టిన బ్రహ్మదేవుడికి నేను సృష్టించిన ప్రజల్ని ఎవరు ధరిస్తారు? అన్న సంశయం కలిగింది. ప్రజల గురించి ఇలా ఆలోచిస్తుండగా ఆయన చెవుల్లోంచి గొప్ప కాంతితో వెలిగిపోతున్న పదిమంది కన్యలు పుట్టుకొచ్చారు. వారిలో 1. తూర్పు 2. దక్షిణం 3. పడమర 4. ఉత్తరం 5. పైదిక్కు 6. క్రిందిదిక్కు అనే ఆరుగురు కన్యలు ముఖ్యమైనవారు.…