అక్షయ తృతీయ విశిష్టత
నారదమహాముని అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తదియ అక్షయ తృతీయఅని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానం సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన…
పులస్త్యుడిలా అన్నాడు : -
అలా నడుము విరిగిన దైత్యసేనను చూచి శుక్రాచార్యుడంధకాసురునితో ''నోవీరా ! రమ్ము నేటికి యింటికి మరల వచ్చి ఈ మందరగిరిమీద హరునితో పోరాడుదమ''నగా నాతడు, 'బ్రహ్మర్షి ! తమరు చెప్పునది యుక్తముకాదు. నా కుల గౌరవ ప్రతిష్ఠలను మంటగలిపి యుద్ధభూమిని విడచి రాజాలను. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నా అమోఘ వీర్యాన్ని ప్రదర్శించి నేడు ఇంద్రమహేశ్వరులతోసహా దేవదానవ గంధర్వుల నందరనూ జయిస్తాను. చూస్తూండండి. అని ఆ హిరణ్యాక్ష నందనుడు…
వివిధ దానములు - వాని మాహత్మ్యములు.
నారదమహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయ యుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును…
నారదుడిలా అడిగాడు
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! మలయ పర్వతం మీద యింద్రుడు తన స్వంత పనులెలా నిర్వర్తించుకొనెనో ఆ వివరాలు తెలయ చెప్పండి. అందుల కాపులస్త్యుడో నారదా ! మలయ పర్వతానికి వెళ్లి యింద్రుడు నిర్వర్తించిన లోకహిత కార్యమూ తన కార్యమూ చెబుతున్నా వినుము. అంధకాసురుడి అనుచరులలో, యుద్ధంలో ఓడిపోయిన మయతారాది రాక్షసులు పాతాళానికి వెళ్లవలెనని ఉత్సహించి వెళ్లుతూ దారిలో సిద్ధులకు నివాసాలయిన గుహలతో లతా సమూహాలతో మదించిన మృగాదులతో…
వైశాఖధర్మ ప్రశంస
నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటి అకు, విస్తరాకు, తామరాకు…
వైశాఖమాస వైశిష్ట్యం
నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము ఇతర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటెనుత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా ! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును…
జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ
నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును.…
నారదుడు ప్రశ్నించాడు.
మహర్షే! దితి పుత్రులు మరుత్తులైనారని నీవు చెప్పి యున్నావు గదా. అయితే వారలు వాయుమార్గాన చరించుటకు కారణమేమి? వారలకు పూర్వపు మన్వంతరాలలో మరుత్తులుగా నున్న వారెవరు? ఈ వివరం నాకు తెలియ జేయుము. అందులకు పులస్త్యుడిలా చెప్ప సాగెను. నారదా! స్వాయంభువ మనువు నుండి వర్తమాన కాలపు మనువు వరకు గల మన్వంతరాలలో మరుత్తులెవరెవరుండిరో వివరంగా చెబుతున్నా వినుము. స్వాయంభువ మనుపు…
వైశాఖమాస దానములు
అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను. రాజర్షీ…
పులస్త్యుడిట్లనియెను :-
ఓ కలహప్రియుడవగు నారదా! ఈ కారణాననే బలి దైత్యుని రాజును గావించారు. మంత్రి ప్రహ్లాదుడైనాడు. శుక్రాచార్యుడు పురోహితు డైనాడు. విరోచన పుత్రుడు బలి దైత్యుడు రాజ్యాభిషిక్తుడు గావటం వినగానే మయదానవునితో సహా రాక్షసు లందరు తమ ప్రభువును దర్శించుటకు వచ్చి చేరారు. ఆ వచ్చిన దైత్యుల నందరను యథావిధిగా పూజించి నాకు శ్రేయస్కరమైన కర్తవ్య మేదో చెప్పుడని అర్ధించాడా వినయశీలి యగు బలిరాజేంద్రుడు. అంతట నా దైత్యులందరు ఆ బలితో యిలా అన్నారు -…
పిశాచ మోక్షము
పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ…
పులస్త్య వచనము : -
ఓ నారదా ! బాణుడు యుద్ధభూమికి తిరిగి రావడంతో యితర దైత్య వీరులు కూడ తమ తమ శస్త్రాస్త్రాలతో యుద్ధోత్సాహులై తిరిగి వచ్చారు. మహా తేజస్వి అయిన విష్ణువు బాణుడు (బలిసుతుడు) అజేయుడని తెలిసికొని దేవతలతో తలపడగా, తాను అంతర్థానమై పోయాడు. జనార్దునుడు వెళ్లిపోవుట తెలిసికొన్న శుక్రాచార్యుడు ఆనందంతో - ఓ బలీ! గోవిందుడు దేవతలను వదలి వెళ్లాడు. ఇది మంచి అవకాశం.…