ఆరోగ్య వ్రతం :-
ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ అని ఆర్యోక్తి. అనగా ఆరోగ్యం కావలసినవారు సూర్యభగవానుణ్ణి ఉపాసించాలి. వ్రతాలన్నిటిలోకీ గొప్పది ఆరోగ్యాన్నిచ్చేది ''ఆరోగ్య వ్రతం''. దీన్ని అగస్త్యులవారు లోకానికందించారు. మాఘమాసం శుక్లపక్ష సప్తమినాడు ఉపవాసం ఉండి విష్ణు స్వరూపుడు, సనాతనుడు అయిన సూర్యనారాయణుణ్ణి - ఓం ఆదిత్యాయనమః, ఓం భాస్కరాయ నమః, ఓం రవయే నమః, ఓం భానవే నమః, ఓం సూర్యాయ నమః అని…
శాంతి వ్రతం :-
గృహస్థులైన వారందరికీ మనశ్శాంతిని ప్రసాదించే వ్రతం శాంతి వ్రతం. ఎంతో గొప్పదైన ఈ వ్రతాన్ని అగస్త్య మహర్షి ప్రబోధించాడు. కార్తికమాసం శుక్లపక్ష పంచమినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించినప్పట్నుంచీ ఒక సంవత్సరం పాటు పులుసుని, పులుపు పదార్థాల్ని…
అగస్త్యుడు చెప్పిన అవిఘ్నకర వ్రతం :-
ఫాల్గుణ శుద్ధ చవితి తిథినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ముందు రోజు రాత్రి నువ్వులు కలిపిన అన్నాన్ని భుజించాలి. తరువాత నువ్వులతోనే హోమం చేసి, విప్రుడికి నువ్వుల్ని బియ్యాన్ని కలిపి దానమివ్వాలి. ఈ వ్రతాన్ని వరుసగా నాలుగు నెలలు ఆచరించి అయిదో నెలలో బంగారంతో యథాశక్తి గణపతి ప్రతిమని తయారుచేయించాలి. దానితో పాటు అయిదు పాత్రల్లో నువ్వులు…
గోవర్ధనగిరి పరిక్రమ - మాహాత్మ్యం :-
మధురకు సమీపంలోనే పశ్చిమ దిక్కున రెండు యోజనాలు విస్తరించి గోవర్ధన గిరివుంది. దానినే అన్నకూటపర్వతమని కూడా అంటారు. ఆ పర్వతం మీద చక్కని చెట్లు, లతలు అందంగా వున్నాయి. అక్కడే ఒక అందమైన సరోవరం కూడా ఉంది. మధురానగరానికి తూర్పుదిశలో ఇంద్ర…
మధురాతీర్థం - ప్రదక్షిణా విధి - మాహాత్మ్యం :-
అయోధ్యా మధురామాయా కాశీకాంచీ అవంతికా|
పురీ ద్వారావతీం చైవ సప్తయితే మోక్షదాయికా॥
అన్న శ్లోకం ప్రకారం మథురానగరం సప్తమోక్షపురాల్లో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దివ్య నగరం ఇరవై యోజనాలు విస్తరించివుంది. దీని ప్రాచీన నామం మధుపురి, మధుహాలి.…
బృందావనం ఇతర తీర్థాలు
మధురామండలంలో పరమపుణ్యప్రదమైన ''వత్సక్రీడనకం'' అనే పవిత్ర తీరంవున్నది. అక్కడ ఎర్రటి రంగుతో ఎన్నో విశాలమైన శిలలున్నాయి. ఒక్కసారి ఆ తీర్థంలో స్నానం చేస్తే చాలు పుణ్యం ప్రాప్తించి వాయులోకాన్ని చేరుకుంటారు. ఆ ప్రదేశంలో విధివశాత్తు మరణించినవారు సరాసరి విష్ణులోకాన్ని చేరుకుంటారు. దానికి సమీపంలోనే భాండీరక వనం అనే దివ్య స్థలం వున్నది. ఆ వనంలో…
మధురాతీర్థ మాహాత్మ్యం :-
జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మకి మథురానగరం కన్నా ప్రియమైన లోకం ముల్లోకాలలో మరేదీలేదు. ఈ దివ్య నగరంలోనే శ్రీకృష్ణుడు అవతరించాడు. అందుకే ఆ నగరం పుష్కర, ప్రయాగ, కాశీ, ఉజ్జయినీ, నైమిశారణ్య క్షేత్రాలకన్నా గొప్పది. ఆ నగరంలో విధి పూర్వకంగా నివసించే మానవులు నిస్సందేహంగా ముక్తిని పొందుతారు. మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో ప్రయాగక్షేత్రంలో ఉంటే ఎలాంటి పుణ్యఫలం…
గర్భవాస దుఃఖాన్ని పోగొట్టే ధర్మాలు : -
శ్రీహరి వరాహరూపాన్ని ధరించి భూదేవితో గర్భవాస దుఃఖాన్ని పొంద కూడదనుకునే మానవులు ఎలాంటి ధర్మాలు ఆచరించాలో ఈ విధంగా చెప్పాడు.
గొప్ప గొప్ప పనులు చేసినప్పటికీ తన్ను తాను పొగుడుకోకుండా నిర్మలమైన మనసుతో ఎన్నో సత్కర్మల్ని ఆచరించేవాడు.
శ్రీహరికి ప్రీతికరంగా షోడశోపచారాది పూజలుచేసి ఎలాంటి అహంకారం,కోపం పొందనివాడు.
మనసుతో అందీర సమానంగా దర్శిస్తూ లాభనష్టాల…
సంసారం నుంచి ముక్తి ప్రసాదించే ధర్మాలు :-
వర్షఋతువు పూర్తికాగానే ప్రసన్నమైన శరత్కాలం వస్తుంది. ఆ ఋతువులో ఆకాశం నిర్మలంగా, స్వచ్ఛంగా వుంటుంది. ఎక్కువ ఎండా ఎక్కువ చలిలేని ఆ శరదృతువులో వచ్చే కార్తిక మాస శుక్లపక్షద్వాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన ద్వాదశినాడు విష్ణువుని అర్చించేవాడు ఎంతో ధన్యుడు. వైకుంఠ ధామాన్ని చేరాలనుకునేవారు ఆరోజు ఇలా స్తుతించాలి.
బ్రహ్మణారుద్రేణచయః…
ద్వారకా మాహాత్మ్యం
ద్వాపరయుగంలో యాదవకుల శ్రేష్ఠుడుగా వాసుదేవుడైన శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆయన చిన్నతనంలో మధురా బృందావనాల్లో గడిపాడు. తరువాత విశ్వకర్మ సముద్రంలో నిర్మించిన ద్వారకా పట్టణాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. ద్వారకానగరం ఎంతో సుందరంగా నిర్మంచబడింది. అక్కడ ''పంచసర'' అనే పేరుతో ఒక దివ్య…
శవాన్ని తాకటం - ప్రాయశ్చిత్తం :-
మరణించిన వ్యక్తిని తాకి ఆలయప్రాంగణంలోకి వచ్చి నిల్చుండేవాడు. వందవేల సంవత్సరాలు గర్భంలో పడి దొర్లుతుంటాడు. పదివేల సంవత్సరాలు ఛండాలుడుగా పుడతాడు. ఏడువేల సంవత్సరాలు గ్రుడ్డివాడిగా జన్మిస్తాడు. వంద సంవత్సరాలు కప్పగా, మూడు సంవత్సరాలు ఈగగా, పదకొండు సంవత్సరాలు లకుముకి పిట్టగా జన్మిస్తాడు.…
రాజాన్నదోషం - ప్రాయశ్చిత్తం :-
భాగవతులైనవారు ఎవ్వరూ రాజుల్ని యాచించి వారుపెట్టిన అన్నం తినకూడదు. క్షత్రియుడైన వాడు నారాయణుడి అంశతో ఉన్నప్పటికీ, రజస్సు, తమోగుణం కలిసి ఎన్నో దారుణమైన పనులు చేస్తుంటాడు. అందుకే అతడు పెట్టే అన్నం నిందనీయంగా చెప్పబడింది. ఒకవేళ రాజాన్నం స్వీకరించాల్సివస్తే రాజుద్వారా పొందిన అన్నాన్ని ముందుగా నారాయణుడికి నివేదించి ఆ తరువాత దాన్ని ప్రసాదంగా భావించి స్వీకరిస్తే దోషం అంటదు.…