భగవద్భక్తి నిరూపణం - భక్తుల మహిమ
సూతుడు శౌనకాది మహామునులకు విష్ణుభక్తిని ఈ విధంగా వర్ణించి చెప్పాడు. “విష్ణుభగవానుడు భక్తి చేత , ఇంక దేనిచేతా సంతుష్టినొందడు. మనిషి శ్రేయస్సుకి మూలం నిరంతర హరినామ స్మరణే. అదే పుణ్యోత్పత్తి సాధనం, అదే జీవన మధురఫలం.. …
నామసంకీర్తన మహిమ
ముక్తికి కారణభూతుడు, అనాది, అనంతుడు, అజుడు, నిత్యుడు, అవ్యయుడు, అక్షయుడునగు శ్రీ మహావిష్ణువు నామ సంకీర్తననే నిత్యం చేసేవానికి ఈ లోకమే నమస్కరిస్తుంది. నేను (అనగా సూతుడు, బ్రహ్మ మొదలగువారు) ఆనందస్వరూపుడు, అద్వైతుడు, విజ్ఞానమయుడు, సర్వవ్యాపకుడు, సకల జన హృదయ వాసుదేవుడునగు విష్ణుభగవానునికి భక్తిభావంతో, ఏకాగ్ర మనస్కుడనై ఎల్లపుడూ నమస్కరిస్తున్నాను. ఈశ్వరుడై…
విష్ణుపూజలో శ్రద్ధాభక్తుల మహిమ
శౌనకాది మహామునులారా! జీవన సారం సర్వలోక స్వామియైన శ్రీహరి ఆరాధన మాత్రమే. పురుషసూక్తం ద్వారా ఎవరైతే పుష్ప జలాదులను ఆ పరాత్పరునికి ఆ శ్రీమహా విష్ణువుకి సమర్పిస్తారో వారు సర్వదేవతలనూ సర్వజగత్తుతో సహా పూజించిన పుణ్యాన్ని పొందుతారు. విష్ణు పూజ చేయని వానిని బ్రహ్మఘాతిని చూసినట్లే చూడాలి. …
విష్ణుభక్తి మాహాత్మ్యం
అన్ని శాస్త్రాలనూ అవలోకించి మరల మరల విచారించి చూస్తే తేలే పరమవిజ్ఞాన పూర్ణమైన నిష్కర్ష ఒక్కటే. అదేమనగా మనుష్యులు ఎల్లవేళలా శ్రీమన్నారాయణునే ధ్యానించాలి. ఆలోక్య సర్వశాస్త్రాణి | విచార్య చ పునః పునః || ఇద…
నృసింహస్తోత్రం - తన్మహిమ
శౌనక మహామునీ! ఇపుడు మీకు సాక్షాత్తు పరమశివునిచే చెప్పబడిన నారసింహస్తుతి (నృసింహస్తోత్రము) ని మీకు వినిపిస్తాను. ప్రాచీన కాలంలో ఒకప్పుడు మాతృగణాలవారంతా కలిసి కూడబలుక్కొని శంకరుని వద్దకేగి ''స్వామీ! మేమంతా మీరు దయతో అవునంటే ఈ విశ్వంలోని దేవ, అసుర, మనుష్యాది ప్రాణులన్నిటినీ తినేస్తాము. అనుజ్ఞనివ్వండి అన్నారు. పరమశివుడు వెంటనే "హే మాతృకలారా! మీరంతా ప్రజలని రక్షించటానికి సృష్టింపబడ్డారు. మీద్వారా రక్షణయే గాని…
కులామృతస్తోత్రం
మహామునులారా! కులామృతమను శ్రేష్టమైన స్తోత్రాన్ని మీకిప్పుడు వినిపిస్తాను. ఒకప్పుడు దేవర్షిvనారదుడు పరమేశ్వరుని ఇలా ప్రార్థించాడు. హే భగవాన్! మనుష్యులందరూ పుట్టిననాటి నుండీ మంచివారుగా ఉండడం జరుగదు కదా! వారిలో కొందరు దుర్మతులుంటారు. పరిస్థితుల ప్రభావం కొందరిని దుష్టులనుగా మారుస్తుంది. వారు కామ క్రోధ, శుభాశుభ ద్వంద్వాలలో పడికొట్టు మిట్టాడుతూ…
మృత్యు నివారకాష్టక స్తోత్రం
శౌనకాదులారా! ఇపుడొక మృత్యు నివారకాష్టకమును అనగా ఎనిమిది శ్లోకాల స్తోత్రమును వినిపిస్తాను. ఇది మార్కండేయ కృతం.
దామోదరం ప్రపన్నో… స్మికిన్నో మృత్యుః కరిష్యతి ||
శంఖచక్రధరం దేవం వ్యక్త రూపిణ మవ్యయం ||
అధోక్షజం ప్రపన్నో… స్మి కిన్నో మృత్యుః కరిష్యతి ||
వారాహం వామనం విష్ణుం నారసింహం జనార్దనం ||
మాధవంచ ప్రపన్నోస్మి కిన్నోమృత్యుః కరిష్యతి ||
పురుషం పుష్కర క్షేత్ర…
అచ్యుత స్తోత్రం
శౌనకాదులారా! ఇపుడు సర్వప్రాణి గణాలకూ సర్వమునూ సమకూర్చే అచ్యుత స్తోత్రాన్ని వినిపిస్తాను. ఇది కూడా లోక కల్యాణ వారధియైన నారద మహాముని తెచ్చి మనకిచ్చినదే. ఒకనాడాయన బ్రహ్మ వద్దకు పోయి "హే దేవదేవేశా! నేను పూజా సమయంలో అక్షయుడు, అవ్యయుడు, వరప్రదాతయగు విష్ణు భగవానుని స్తుతించాలి. ఎందుకంటే ఆ అచ్యుత భగవానుని నిత్యం…
బ్రహ్మజ్ఞాన నిరూపణం - షడంగ యోగం
శౌనకాదులారా! ఇపుడు నేను వేదాంత, సాంఖ్య సిద్ధాంతానుసారం వివరింపబడిన బ్రహ్మజ్ఞానాన్ని వర్ణిస్తాను. "నేను జ్యోతిర్మయ పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువును'' అని మనసులో స్థిరీకరించుకొని ఆలోచిస్తూ "సూర్యునిలోనూ, అగ్నిలోనూ,నాహృదయాకాశం లోనూ ఒకే జ్యోతి త్రిస్వరూప ధరమై వున్నది'' అని నిశ్చయించుకోవాలి. ఆవులోనే నెయ్యి ఉంటుంది.…
ఆత్మజ్ఞాన నిరూపణం
ఇప్పుడు ఆత్మ జ్ఞానము యొక్క తాత్త్వికవర్ణనను వినిపిస్తాను. అద్వైత తత్త్వమే సాంఖ్యము, దానిలో ఏక చిత్తతయే యోగము. అద్వైత తత్త్వయోగ సంపన్నుడైనవాడు ముక్తిని పొందగలడు. అద్వైత తత్త్వమేదో తెలిసి రాగానే అతీత, వర్తమాన, భవిష్య కర్మలన్నీ నష్టమై పోతాయి. జ్ఞానియైన వ్యక్తి సద్విచారమను గొడ్డలితో సంసారమనెడి వృక్షాన్ని నఱకివేసి వైరాగ్యమను తీర్థం ద్వారా వైష్ణవ పదాన్ని పొందుతాడు. …
గీతాసారం
నారదా! ఒకప్పుడు నేను అర్జునునికి ''గీత'' ఉపదేశించాను. దాని సారంలో కొంత నీకిపుడు వినిపిస్తాను. అష్టాంగంయోగ యుక్తుడూ వేదపారంగతుడూ నగు వ్యక్తికి ఆత్మ కల్యాణం సంభవం. అనగా అట్టివాడు ఆత్మ సాక్షాత్కారాన్నీ, తద్వారా ఆనందాన్నీ పొంది లోకానికి సుఖాన్ని కలిగించే అవకాశముంది.ఆత్మకి దేహం లేదు. ఇంద్రియాలు లేవు. నేను ఆత్మను.…
బ్రహ్మగీతాసారం
శౌనకాదులారా! ఒకప్పుడు నారదుని కోరికపై బ్రహ్మదేవుడు సంసార విముక్తి కరమైన బ్రహ్మగీతను ఉపదేశించాడు. దానిని మీకు వినిపిస్తాను. ''నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి'' అనే వాక్యార్థాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకోగలిగినవారు ముక్తులౌతారు. నేను, బ్రహ్మ అనే ఈ రెండు పదాలనూ అర్థం చేసుకోవాలి. విద్వాంసులు వాచ్య, లక్ష్య రూపాలు రెండింటిలోనూ వీటికి అర్థాలు స్వీకరించారు.…