వాయుజయ నిరూపణం
వాయుజయమనేది ఒక ప్రశస్తమైన విద్య. దీని ప్రభావం వల్ల జయపరాజయాలు ముందే తెలుస్తాయి. పరాజయాన్ని నిలువరించడానికి సంకేతాలు కూడా ఇవ్వబడతాయి. అలాగే విదేశయాత్రలకు శుభాశుభ ముహూర్తాలకి సంబంధించిన జ్ఞానం కూడా ఈ విద్య వల్ల ఒనగూడుతుంది. వాయు, అగ్ని, జల, ఇంద్రులను మాంగలిక చతుష్టయమంటారు. వాయువు ఎక్కువగా ప్రాణి యొక్క వామ, దక్షిణ భాగములలో నున్న నాడులలో ప్రవహిస్తుంటుంది. …
శుక్రగ్రహ మహిమ - రెండవ భాగము
అదితి వ్రతం ఫలించింది. ఆదిదేవుడి వరం సాకారమైంది. అదితి దివ్యగర్భం ధరించింది. ఆమె శరీరాన్ని ఏదో దివ్యకాంతి ఆవరించింది. సహజ సౌందర్యవతి అయిన ఆమె అందం వెయ్యింతలయ్యింది. ఆదితి గర్భాన అందంగా , ఆనందంగా కదలాడుతూ అవతరించడానికి సన్నద్ధుడవుతున్న క్షీరసాగరశాయిని చతుర్ముఖ బ్రహ్మ పరిపరివిధాలుగా ప్రస్తుతించాడు.…
ధర్మసారం
"ఇది బ్రహ్మశంకరునికి బోధించినది" అంటూ సూతుడు మహామునులకిలా చెప్పసాగాడు. "శంకరా! అన్ని పాపాలనూ అగ్నిలో తోసేదీ, ''ఇక్కడ'' భోగాన్నీ, ''అక్కడ'' మోక్షాన్నీ నరులకు కలిగించేదీ, చీకటి మనసును వెలిగించేదీ అగు అతిశయ సూక్ష్మమైన ధర్మసారాన్ని సంక్షిప్తంగా అందిస్తాను, వినండి. శోకం మనిషికి అన్నిటికన్న పెద్ద శత్రువులలో…
శనిగ్రహ మహిమ - మొదటి భాగము
"నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ !
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ !!”
శనైశ్చరుణ్ణి స్తుతించి , నిర్వికల్పానంద శనిగ్రహ మహిమా కథనం ప్రారంభించాడు.“ ''శని'' అనగానే మానవులలో భయమూ , భక్తీ పెనవేసుకుని పుట్టుకొస్తాయి. వక్రవీక్షణతో ఎంత కీడు చేస్తాడో , శుభవీక్షణతో అంతకు రెండింతలు మేలు చేసే గ్రహం శనైశ్చరుడు !…
శనిగ్రహ మహిమ - రెండవ భాగము
"ఎవరి దారికి అడ్డు నిలుచున్నావో తెలుసా , దశరథా ? రథాన్ని మళ్ళించి , తొలగిపో !" శనైశ్చరుడి గంభీర కంఠం ఉరుములా ధ్వనించింది. "శనైశ్చరుల చరణారవిందాలకు నమస్సులు !" దశరథుడు చేతుల్ని శిరస్సు మీద జోడిస్తూ ,…
ప్రాయశ్చిత్తం, చాంద్రాయణం, మరికొన్ని వ్రతాలు, పంచగవ్య విధానం
పాపాలకు ఫలితం నరకప్రాప్తే అయినా కొన్ని పాపాలకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకొని ఇంకెన్నడూ ఏపాపమూ చేయకుండా వుంటే నరకవాసం తప్పవచ్చు. తగ్గవచ్చు. ఆ ప్రాయశ్చిత్తాలను చెప్తాను.ఈగ, జలకణం, స్త్రీ, నేలనుండి ఊరుజలం, అగ్ని, పిల్లి, ముంగిస ఇవి ప్రాయశ్చిత్తానికి సంబంధించినంతవఱకూ పవిత్రంగా పరిగణింపబడతాయి. …
రాహుగ్రహ మహిమ
"అర్ధకాయం మహావీహం చంద్రాదిత్య విమర్ధనమ్ !
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ !!"
రాహుదేవ ప్రార్థన పఠించిన నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు. "రాహువు వక్రంగా వీక్షిస్తే అష్టకష్టాలూ పట్టి పీడిస్తాయి. ఘోర యుద్ధాలు సంభవిస్తాయి. వ్యక్తికి దేశాటన క్లేశమూ , శ్మశాన వాసమూ దాపురిస్తాయి అని తెలియ జేస్తున్నాయి శాస్త్రాలు..." …
నాలుగు యుగాల ధర్మాలు
విష్ణు మహిమ, ధర్మం నాలుగు పాదాలు, పురాణ, ఉపపురాణ పదునెనిమిది విద్యల లెక్క, ప్రళయం నాలుగు యుగాల ధర్మాలు, కలియుగం నామ సంకీర్తన మహర్షీ! ఇప్పటిదాకా మీరు విన్న ధర్మాలూ, వ్రతాలూ విష్ణు ప్రీతికరాలు కూడ. సూర్యాదిదేవుల పూజ, పితృతర్పణలు, హోమాలు, సంధ్యావందనాలు, పురుషార్థ చతుష్టయ సిద్ధిని సమకూర్చేవ్రతాలు. వీటన్నిటినీ విష్ణుభగవానుడే స్వీకరించి…
కేతుగ్రహ మహిమ - మొదటి భాగము
"పలాశపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ !
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !!”
నిర్వికల్పానంద చేతులు జోడించి ప్రార్థించాడు. “గురువుగారూ... ''పలాశపుష్పం'' అంటే...” సదానందుడు ప్రారంభించాడు. "మోదుగు పువ్వు నాయనా ! కేతువు వర్ణం మోదుగు పువ్వులాగా ఎర్రగా ఉంటుంది ! ఇతర గ్రహాలకు లాగే…
కర్మక కథనము
జగత్సృష్టి, ప్రళయాదిక చక్రగతిని తెలుసుకున్న విద్వాంసులు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికములనే మూడు సాంసారికతాపాలను తెలుసుకుని జ్ఞాన వైరాగ్య మార్గాలను స్వీకరించి అత్యంతిక లయను అనగా మోక్షాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. ఇపుడు సంసార చక్రాన్ని వర్ణిస్తాను. ఇది లేనిదే పురుషార్థి పరమాత్మలో లీనం కాలేడు. మనిషి లేదా జీవి…
కేతుగ్రహ మహిమ
త్రిశంకుడు యాగనిర్వహణకు అవసరమైన ఋషులను ఆహ్వానించే ప్రయత్నంలో వశిష్ఠ పుత్రులను కలిశాడు. "మీ తండ్రిగారు నా ప్రార్ధనను నిరాదరించి , యజ్ఞం చేయడానికి నిరాకరించారు. విశ్వామిత్ర మహర్షి ఆ కార్యం చేయడానికి అంగీకరించారు. మీరు యజ్ఞంలో పాల్గొని నన్ను దీవించండి !" "మా జనకులు నిరాకరించిన కార్యం మాకూ…
అష్టాంగయోగం, ఏకాక్షర బ్రహ్మ, ప్రణవ జపమాహత్మ్యం
ద్విజశ్రేష్ఠులారా! మానవులకు భోగ, మోక్ష ప్రదానానికి శ్రేష్ఠతమ సాధనమైన మహాయోగాన్ని సర్వాంగ సహితంగా వినిపిస్తాను. భక్తి పూర్వకంగా ఈ మహాయోగ విధిని చదివినంతమాత్రాననే మనుష్యులు సర్వపాపాలూ పటాపంచలౌతాయి. ఒకప్పుడు మహామతియు భగవంతుడునైన దత్తాత్రేయుడు అలర్క మహారాజుకీ మహావిషయాన్ని అనుగ్రహించాడు. మమతయే దుఃఖాలకు మూలము. ఆ మమతను పరిత్యజించుటయే…