సూర్యగ్రహ మహిమ ఏడవ భాగము
"బాల వానరా ! ఆగు ! ఏమిటి అకృత్యం ? తిరిగి పో !" అన్నాడు ఇంద్రుడు గంభీరంగా , ఆయన కంఠ స్వరం ఆకాశంలో ఉరుముల శబ్దంలా ప్రతిధ్వనించింది. బాలాంజనేయుడు నిర్లక్ష్యంగా ఇంద్రుడి వైపు చూస్తూ , పళ్ళు ఇకిలించి , సూర్యుడి వైపు దూసుకెళ్ళాడు. ఇంద్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆయన చేతిలోని వజ్రాయుధం మెరుపులా కదిలి , రివ్వున…
వాత వ్యాధి నిదానం
ధన్వంతరి ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓయి శుశ్రుతా! వాత లేదా వాయు ప్రకోపమే మానవ శరీరంలో కనిపించకుండానే ఎన్నో అనర్థాలను కలిగిస్తుంది. ఆ వాయువే విశ్వకర్మ, శ్రీ విశ్వాత్మ విశ్వరూప ప్రజాపతి, స్రష్ట, ధాత, విభుడు, ప్రభువు, విష్ణువు, సంహర్త, మృత్యువు. ప్రాణవాయువు ప్రాణాలను నిలబెడుతుంది. అయితే సరిగా బతకడం చేతకాక దానినే శరీరంలోపల చెడగొట్టుకుంటే అదే ప్రాణం…
సూర్యగ్రహ మహిమ ఎనిమిదవ భాగము
కేసరి ఆంజనేయుడి వైపు జాలిగా చూశాడు. అతని చూపులు అంజన వైపు తిరిగాయి. “దేవ గురువు కదా , ఆయన ! అందుకే మన వానరజాతిని చిన్న చూపు చూశారు !" "ఆ విధంగా అనుకోవలసిన అవసరం లేదు నాన్నగారూ !" అంజనేయుడు మెల్లగా…
సూర్యగ్రహ మహిమ తొమ్మిదవ భాగము
"ఆ విధంగా ఆంజనేయుడి విద్యాభ్యాసం విజయవంతంగా పూర్తయింది !" నిర్వికల్పానంద చిరునవ్వుతో ముగించాడు. "గురువుగారూ ! అనంతర భవిష్యత్తులో ఆంజనేయుడు ఏ మహత్కార్యం ద్వారా గురువుగారి ఋణం తీర్చుకున్నాడు ?" శివానందుడు ప్రశ్నించాడు."రామావతార సమయంలో... శ్రీరామచంద్రుడి బంటుగా అద్వితీయమైన సేవ ద్వారా..." "శ్రీరామ సేవతో గురువు సూర్యభగవానుడి…
సంక్షిప్త ఔషధీయ యోగసారం
సుశ్రుతా! ముందుగా ఏయే ఋతువుల్లో ఏయే అపథ్యాలు ప్రకోపాలకు దారితీస్తాయో చూద్దాం. వర్ష ఋతువులో తీక్ష, చేదు, వగరు రుచులు, రూక్ష గుణాలు గల తిండిని తినడం వల్లనూ, అతిగా బెంగ, శృంగారం, వ్యాయామం, భయం, శోకం, రాత్రి జాగరణ, గట్టిగా కేకలేయడం, చేవ కంటే ఎక్కువగా చేతలు వంటివి కారణాలుగా భోజనం అరుగుతున్నపుడూ, సందెలందూ వాయువు కుపితమవుతుంది. గ్రీష్మంలోనూ వర్ష…
పదార్థాల గుణదోషాలు, ఔషధ సేవనంలో అనుపాన మహత్త్వం
ఓయి శుశ్రుతా! పదార్థాలలో ఏవి మంచివో అనే జ్ఞానం చికిత్సకునికి మిక్కిలి అవసరం. ఎఱ్ఱటి శాలి బియ్యం వాత, కఫ, పిత్త దోషాలు మూడింటినీ నశింపజేయగలదు. దాహాన్నీ, కడుపులోని కొవ్వునీ కూడా తొలగించగలదు. మహాశాలి జీర్ణానికి గొప్ప దోహదకరం. కలము (అనగా ఎక్కువ నీటితో కలిపిన కలమ బియ్యం) కఫ, విత్తాలను అదుపు…
చంద్రగ్రహ మహిమ - మొదటి భాగము
“దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం !
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ !!”
శ్రావ్యంగా , భక్తిరసభరితంగా , భావస్ఫోరకంగా చంద్రస్తోత్రం పఠించిన నిర్వికల్పానంద , కళ్ళు తెరిచి , ప్రశాంతంగా శిష్యుల వైపు చూశాడు. వాళ్ళ ముఖాల్లో శ్రద్ధా , ఆసక్తీ , ఆత్రుతా ప్రతిబింబిస్తున్నాయి. …
చంద్రగ్రహ మహిమ రెండవ భాగము
అశ్వం డెక్కల చప్పుడు హిరణ్యగుప్తుడి ఆలోచనలకు అడ్డుకట్ట వేసింది. అతను తలవాల్చి చూశాడు. నీళ్ళు తాగిన తన అశ్వం తన వైపు రాకుండా అటు వైపు పరుగెడుతోంది. అతను అప్రయత్నంగా ఈల వేశాడు. యజమాని ఈల పిలుపును పట్టించుకోకుండా పరుగు లంకించుకుంది. క్షణంలో పొదల మధ్య దూరి మాయమైంది !అటు వైపు చూస్తున్న హిరణ్యగుప్తుడి కళ్ళు ఒక్కసారిగా…
జ్వరం, అతిసార నివారణ
శుశ్రుతా! త్రిదోషాలలో నొకదాని వల్లగాని, రెండింటి వల్ల గాని, మూడు కలిసి వచ్చిన కలిసి దాని కాలంలో గాని వచ్చే జ్వరాలు ప్రధానంగా ఎనిమిది రకాలున్నాయని. అనుకున్నాం కదా! దాహం, ఉష్ణోగ్రతలో విపరీతమైన పెరుగుదల వున్న జ్వరానికి ముస్త, పర్పటక, ఉశీర, చందన, ఉదీచ్య, నాగరలను సమపాళ్ళలో నీళ్ళలో పోసి మరిగించి బాగా చల్లార్చి రోగి చేత త్రాగించడం మంచి చికిత్స.…
నాడీ వ్రణాది రోగాల చికిత్స
నరం మీద లేచిన కురుపుని నాడీవ్రణమంటారు. దీనికి శస్త్రచికిత్స అవసరమైనపుడు వెనుకాడరాదు. సాధారణంగా గుగ్గిలం, త్రికుట, త్రిఫలాలను సమానపాళ్ళలో తీసుకొని శుద్ధిచేసి సిద్ధం చేసుకొని వుంచిన నేతితో కలిపి దాని సహాయంతో నాడిలో లేచిన వికృతవణాలపై, శూలపై,భగందరమను రోగం పైవిజయాన్ని సాధించవచ్చును. నిర్గుండకీ రసాన్ని శుద్ధతైలంతో కలిపి పూస్తే నాడీ దోషాలూ, వ్రణాలూ దూరమౌతాయి. పామాయను రోగానికిఈ మందును త్రాగించి కాని, అంజనం…
చంద్రగ్రహ మహిమ - మూడవ భాగము
రోజులు వారాలుగా , నెలలుగా ఎదిగిపోతున్నాయి. యోగానంద మహారాజు ఒకటి తర్వాత ఒకటిగా పరివార బృందాలను యువరాజు అన్వేషణ కోసం నియమిస్తూ ఉన్నాడు. అరణ్యాలలో ఇరుగు పొరుగు రాజ్యాలలో గాలించి గాలించి , వృథా ప్రయాసపడి పరివారం తిరిగి వస్తూనే ఉన్నారు. …
చంద్రగ్రహ మహిమ నాల్గవ భాగము
"నీ ప్రశ్నను మహామంత్రిగారే ఆనాడు శిరచ్ఛేదం చేయించే ముందు వరరుచిగారిని అడిగాడు !” నిర్వికల్పానంద అన్నాడు. "మంత్రి ప్రశ్నకు సమాధానంగా , ''గ్రహబలం'' అన్నాడు వరరుచి. తన మీద ఉన్న గ్రహవక్రదృష్టి తన చేత ఆ పని చేయించిందనీ , ''ఆలోచనకూ , ఆచరణకూ కారణం గ్రహవీక్షణే'' అని కూడా ఆయన అన్నాడు. అదలా ఉంచి , తరువాతి కథ వినండి !"…