అతిసార గ్రహణి రోగాలు
శుశ్రుతా! నిజానికి అతిసార, గ్రహణిరోగాలు రెండూ నీళ్ళ విరేచనాలకి పెట్టబడిన పేర్లే. ఇవి ఆరు రకాలుగా వుంటాయి. త్రిదోషాలూ ఒక్కొక్కటిగానూ అంటే విడివిడిగానూ కలివిడిగానూ నాలుగు రకాలౌతాయి. భయం, దుఃఖం ఉత్పత్తి చేసే రకాలు రెండు. నీటిని గాని ఇతర పానీయాలను గాని అతిగా…
సూర్యగ్రహ మహిమ మొదటి భాగము
"జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి !
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం !!"
"మహర్షి యాజ్ఞవల్క్యుడు జనకమహారాజు గారికి గురువు. ఆయన ఆస్థానంలో ఉండేవాడు. గురువు తిరస్కారానికి గురి అయిన కారణంగా యాజ్ఞవల్క్యుడు వేదవిద్యను సంపూర్ణంగా అధ్యయనం చేయలేకపోయాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా జనకమహారాజుకు వినిపించాడు..." …
సూర్యగ్రహ మహిమ రెండవ భాగము
సూర్యుడి కిరణాలకు ఏదీ అడ్డుతగలని చోట , ఉదయం నుండీ సాయం సమయం దాకా ఎండ పడేచోట - యాజ్ఞవల్యుడు తపస్సు ప్రారంభించాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు , అస్తమిస్తున్నాడు. అయితే ఆ రెండు దైనిక క్రియల్నీ గమనించే స్థితిలో లేడు , యాజ్ఞవల్క్యుడు. అతనిలోని పట్టుదల భక్తి శ్రద్ధలకూ , ఏకాగ్రతకు పదనుపెట్టుతోంది. అచిరకాలంలోనే అతడు శారీరక స్పృహను కోల్పోయాడు.…
మూత్ర ఘాత నిదానం
సుశ్రూతా! వస్తి, వస్తిశిరం, మేడ్రం, కటి, వృషణములు, గుదము - ఈ ఆరు శరీరభాగాలూ ఒకదానికొకటి సంబంధితములై, ముడిపడియుంటాయి. మూత్రకోశం క్రిందికి వంగి వున్నా ఎప్పుడూ నిండుగానే వుంటుంది. దానిలోకి ఎన్నో చిన్న చిన్న నాళాలు ద్రవాలను తెచ్చి నిరంతరం ఒంపుతునే వుంటాయి. ఈ ద్రవాలలో త్రిదోషాలు ప్రవేశిస్తే ఇరవై రకాల రోగాలొస్తాయి. …
సూర్యగ్రహ మహిమ మూడవ భాగము
"ఆ విధంగా సూర్యగ్రహ వీక్షణ శుభప్రదం అయ్యేసరికి , స్వయంగా చదువుల తల్లి దిగివచ్చి , యాజ్ఞవల్క్యునికి ఆయన కోరిన ''యజుస్సు''లనూ , వైదిక విజ్ఞానాన్నీ , సాంఖ్యయోగాన్నీ , యోగాన్నీ - ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల వేదాల సారాన్నీ ప్రసాదించింది !" నిర్వికల్పానంద వివరిస్తూ అన్నాడు. "సూర్యగ్రహానుగ్రహంతో సరస్వతీ కటాక్షంతో లభించిన పారమార్థిక విజ్ఞానం యాజ్ఞవల్క్యుడిని మహోన్నత స్థానాన్ని అధిరోహింపజేసింది. విశ్వావసుడు…
ప్రమేహ రోగ నిదానం
ప్రమేహ శబ్దానికి మోతీలాల్ బనారసీదాస్ ప్రకాశకులు ప్రచురించిన గరుడ పురాణంలో డయాబిటిస్ అనే అర్థం ఈయబడింది. ఈ గ్రంథంలో చక్కెరవ్యాధి అని కూడా వాడడం జరిగింది. ప్రమేహ లేదా చక్కెర వ్యాధిలో ఇరవై రకాలున్నాయి. వీటిలో పది కఫ దోషం వల్ల, ఆరు పిత్త ప్రకోపం వల్ల నాలుగు వాత…
సూర్యగ్రహ మహిమ నాల్గవ భాగము
అంజనా , కేసరీ మాతంగ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఏడో అలౌకిక ప్రశాంతత తాండవిస్తోందక్కడ. అందమైన అనేక వర్ణాల పుష్పాలు కొత్త సువాసనలను వెదజల్లుతూ కళకళలాడుతున్నాయి. అల్లంత దూరాన , ఆశ్రమ వాటికలోని వటవృక్షం క్రింద అరుగు మీద ఆసీనుడై ఉన్న మాతంగ మహర్షి ఆ దంపతులకు కనిపించాడు.…
విద్రధ, గుల్మనిదానం
నిలవై, పాసిపోయిన మిక్కిలిగా వేడెక్కిన, గరుకైన, సారంలేని, దప్పికను పెంచు ఆహారాన్ని తీసుకోవడం. అసలేవంకరగా నున్న శయ్యపై గాని మరెక్కడ గాని వంకర టింకరగా పడుక్కోవడం అనే స్వయంకృతాపరాధాల వల్ల రక్తాన్ని పాడుచేసే ఆహార విహారాల వల్ల వ్యక్తి దేహంలోని రక్తం కలుషితమై పోతుంది. దీనివల్ల చర్మం, మాంసం, పొట్ట, నరములు, ఎముకలు, మూలుగ ఇవన్నీ రూపుమాసి పోతాయి. రోగం పొట్టలోచేరి అక్కడి నుండి…
ఉదర రోగ నిదానం
మందాగ్ని వల్ల వచ్చే రోగాల్లో ఉదరరోగం ప్రధానమైనది. ఉదరంలో మలం ఉండి పోవడం వల్ల అజీర్ణరోగం పట్టుకుంటుంది. వాయువు దీని వల్ల పైకీ క్రిందికీ స్వేచ్ఛగా పోవడానికి కడ్డంకి ఏర్పడుతుంది. అప్పుడు ప్రవాహిని నాడులన్నీ పనిచేయకుండా ఆగిపోతాయి. ప్రాణాపానాది వాయువులు దూషితాలై మాంస సంధులలో ప్రవేశిస్తాయి. దాంతో కడుపు పనులకు అడ్డంకులేర్పడి ఉదరవ్యాధులు వస్తాయి. ఇవి ఎనిమిది రకాలు. వాతజ,…
సూర్యగ్రహ మహిమ ఐదవ భాగం
కైలాసం.... "ఆదిదంపతుల చరణాలకు అభివందనాలు !" కైలాస మందిరంలో పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ అన్నాడు వాయువు. …
పాండు - శోథ నిదానం
పిత్త, వాత ప్రకోపాల వల్ల ఒక దశలో శరీరంలోని మలిన రక్తనాళాలు, ఇతర మలాలు కూడా ప్రకుపితాలవుతాయి. అపుడు ఈ దశలో పరమ బలవత్తరమైన వాయువు గుండెలోని కెగసి హృదయంలో నుండు పదిధమనులనూ ఆశ్రయంగా చేసుకొని సంపూర్ణ శరీరమంతటా విస్తరిస్తుంది. తరువాత పిత్తాన్నాశ్రయించి శ్లేష్మ, చర్మ, రక్త, మాంసాదులను చెడగొట్టి మలిన రక్తం చర్మానికీ మాంసానికి మధ్య చేరేలా చేస్తుంది. దాని…
సూర్యగ్రహ మహిమ - ఆరవ భాగము
ఋతువులు మారుతున్నాయి. ప్రకృతి కాంత ఋతువుకు తగ్గ వేషం ధరిస్తూ , అన్ని ఋతువుల్లోనూ అందంగా కనిపిస్తూ వస్తోంది. మొగ్గలు పుష్పించాయి. పువ్వులు కాయలుగా ఎదిగాయి. కాయలు పళ్ళయ్యాయి. అంజన గర్భం రోజు రోజుకూ వృద్ధి చంద్రుడిలాగా పెంపొందుతోంది. కేసరి ఆమెకు సకల సౌకర్యాలూ సమకూర్చుతున్నాడు. గర్భ భారాన్ని మోస్తున్న అంజన బొద్దుగా ఉన్న తామర మొగ్గను…