భగవంతుని విభిన్న అవతారాల కథ, పతివ్రతా మహాత్మ్యం - ఆఖ్యానాలు
"వేదాది ధర్మాలను రక్షించడానికి ఆసురీ ధర్మాన్ని నాశనం చేయడానికీ సర్వశక్తి మంతుడైన భగవంతుడు శ్రీహరి ఎన్నో అవతారాలను ధరించి ఈ సూర్యచంద్ర వంశాల పాలన పోషణలను చేశాడు. జన్మమే లేనివాడు మనకోసం చివరికి చేపగానూ తాబేలు గానూ పుట్టవలసి వచ్చినా వెనుకాడలేదు. …
రామాయణకథ
రామాయణానికే సీతా చరితమనే పేరు కూడా వుంది. ఆమె చరిత్రను విన్నంత మాత్రాననే అన్ని పాపాలూ నశిస్తాయి. భగవంతుడైన శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి మరీచి, అలా పరంపరగా కశ్యపుడు, సూర్యుడు, వైవస్వతమనువు, ఇక్ష్వాకువు ఆయన వంశంలో రఘుమహారాజు, అజమహారాజు,…
కేతుగ్రహ చరిత్ర రెండవ భాగము
అరుణుడు నడుపుతున్న రథం మీద సూర్యుడు విలాసంగా కూర్చున్నాడు. త్రిమూర్తులు కల్పించుకోవడంతో తనకు ఆ ''రాహు పీడ'' వదిలింది ! రథికుడినీ , అశ్వాలనూ కూడా అర్ధం చేసుకోగలిగిన నేర్పరి సారథిగా లభించాడు ! తన దినచర్య ఇక నిరాఘాటంగా సాగుతుంది ! …
కేతుగ్రహ చరిత్ర మూడవ భాగము
తన వదనగహ్వరంలో బంధితుడుగా చిత్రవధ అనుభవించిన చంద్రుడిని సూర్యోదయానికి ముందు వదిలిపెట్టాడు. కేతువు. నీరసంగా , నిస్సహాయంగా , కళావిహీనంగా అగుపిస్తున్న చంద్రుడిని రాక్షస కుంచికతో తాను చిత్రించిన చిత్తరువును చూస్తున్న విచిత్ర చిత్రకారుడిలా తృప్తిగా చూశాడు కేతువు. "నువ్వు చేసిన నేరానికి శిక్ష పరంపరకు ఇది ప్రారంభం మాత్రమే , చంద్రా ! ముచ్చట వేసినప్పుడల్లా…
కేతుగ్రహ చరిత్ర నాల్గవ భాగము
తన ప్రయాణం ముగించిన కేతువు చంద్రుడికి సమీపంలో ఉన్న ఒక తెల్ల మబ్బు చాటుకు నక్కాడు. దొంగచాటుగా , చంద్రుణ్ణి గమనిస్తున్నాడు. చంద్రుడు లోపల నుంచి ఉబికి వస్తున్న ఆందోళనను , త్రిమూర్తులు ఆదుకుంటారన్న ఆలోచనతో అణగద్రొక్కుతూ , గగనయానం సాగిస్తున్నాడు. క్రిందటి రాత్రి చవిచూసిన బీభత్సానుభవం ఎంత మరిచిపోవాలనుకున్నా…
హరివంశ వర్ణన (శ్రీకృష్ణకథ)
భగవానుడైన శ్రీకృష్ణుని మాహాత్మ్యముచే పరిపూర్ణమైన కారణంగా శ్రేష్ఠ తమంగా నిలచిన హరివంశాన్నొకమారు తలచుకుందాం. పృథ్విపై పెచ్చుమీరిన అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పూర్వ వైభవాన్ని తెచ్చి నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు బలరామునితో సహా దేవకీ వసుదేవులకు జన్మించాడు. పుట్టిన కొన్ని దినాలకే కృష్ణుడు పూతనను స్తన్యంతో బాటు ప్రాణాలను కూడా పీల్చి సంహ…
కేతుగ్రహ చరిత్ర ఐదవ భాగము
"చాలా మంచి పురోగతి , మీ ఒడంబడిక ! మీరిద్దరూ నా పుత్రులే ! సూర్యుడూ నా పుత్రుడే ! నా కంటిని నా వేలితో నేనే పొడుచుకున్నట్టుగా లోలోపలే కుమిలిపోయాను , ఇన్నాళ్ళూ !" కశ్యపుడు చిరునవ్వుతో అన్నాడు. "ఆ చంద్రుడు కూడా మనకు దూరస్థుడేం కాదు. నా తండ్రిగారి సోదర మానస పుత్రుడైన అత్రి మహర్షి పుత్రుడే !” …
మహాభారతం - బుద్ధాది అవతారాలు
భూభారాన్ని తగ్గించడానికీ వీలైనంత ఎక్కువమంది దుష్టుల్ని సంహరింపడానికీ భగవానునిచే కల్పింపబడిన మహాభారత యుద్ధమును యుధిష్ఠిరాది పాండవులను శ్రీకృష్ణుడు రక్షించిన తీరును ఒకపరి తలుద్దాం. విష్ణు భగవానుని నాభి కమలం నుండి నేను (అనగా బ్రహ్మ)పుట్టాను కదా! నానుండి అత్రి, అతడి నుండి చంద్రుడు, అతడి నుండి…
నవగ్రహాల పట్టాభిషేకం దేవ మహాసభలో వైభవం తాండవిస్తోంది.
క్షీరసాగర తీరం - మహాసభకు విచ్చేసిన దేవతలతో , వాళ్ళ పత్నులతో కళకళలాడుతోంది. ఒక్కొక్కదేవ పురుషుడు , ఒక్కొక్కదేవ పురంధ్రీ ఒక్కొక్కదీపకళికలా వెలిగిపోతున్నారు ! క్షీరసాగర మధుర తరంగాల మీద నుంచి సాగి వస్తున్న శీతలపవనాలు అందర్నీ పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి ! శ్రీమహావిష్ణువు…
నవగ్రహాల పట్టాభిషేకం రెండవ భాగము
నవరత్నాల అద్భుత కాంతులతో అందరికీ నేత్రపర్వం చేసిన త్రినేత్రుడిని విష్ణువూ , బ్రహ్మా తమ చూపులతో ప్రశంసించారు. తమ సింహాసనం చుట్టూ వర్షించి , రకరకాల రంగుల వెలుగుల్ని చిమ్ముతున్న నవరత్నాల రాసుల మధ్య నవగ్రహాలు వెలిగి పోతున్నారు. "శ్రీహరీ ! నవగ్రహబృందానికి నాయకుణ్ణి నిర్ణయించండి !”…
ఆయుర్వేద ప్రకరణం
గరుడ పురాణంలోని ఆయుర్వేద ప్రకరణానికి గొప్ప ప్రసిద్ధి ఉంది. ఇందులోని మొదటి ఇరవై అధ్యాయాలలో నిదాన స్థాన విషయాలు వర్ణింపబడ్డాయి రోగ కారణాలనూ లక్షణాలను బట్టి రోగనిర్ణయాన్ని చేయడాన్నే రోగ నిదానమంటారు. తరువాతి నలభై అధ్యాయాలలో రోగచికిత్స, ఔషధాలు…
జ్వర నిదానం
జ్వరాలలో చాలా రకాలే ఉన్నాయి. కొన్నిటి పేర్లు ఇలా వుంటాయి. ఇవి శివుని కంటిమంట నుండి పుట్టినవని అంటారు. రోగపతి, పాప్మ, మృత్యురాజ, అశన, అంతక, ఓజో౬ శన, మోహమయ, సంతాపాత్మ, సంతాప, అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి. ఏనుగు కొచ్చే జ్వరాన్ని…