కొన్ని నవమి వ్రతాలు - ఋష్యేకాదశి
చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త శుద్ధ అష్టమిని అశోకాష్టమి అంటారు. ఈ రోజు ఎనిమిది అశోకమంజరి మొగ్గలను కషాయం తీసి త్రాగాలి. అలా త్రాగుతున్నపుడీ శ్లోకం ద్వారా శివప్రియమైన ఆ దేవతను ప్రతి శోక విముక్తికై ప్రార్ధించాలి.
త్వామ శోక హరాభీష్ట మధుమాస సముద్భవ|
పిబామి శోక సంతప్తో మామశోకం సదాకురు ॥
…
శ్రవణద్వాదశి వ్రతం
(నక్షత్రాల పేర్లనూ, తిథుల పేర్లనూ స్త్రీ లింగాలుగా భావించి సంస్కృత మర్యాద ప్రకారం చివర దీర్ఘాన్నుంచే సంప్రదాయముంది. తెలుగులో అవసరం లేదు. పెట్టినా దోషమేమీ కాదు. ప్రాణులకు భోగమునూ మోక్షాన్నీ కూడా కలిగించే వ్రతమిది. ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రం ఈ మూడూ యోగించిన రోజును విజయతిథి అంటారు.…
రాహుగ్రహ చరిత్ర ఆరవ భాగము
దినమంతా రాహువు వదనగహ్వరంలో ఇరుక్కుని ఉండిపోయినందుకు అలసటా , అతని ముందు ఓడిపోయినందుకు అవమానం సూర్యుణ్ణి ఆవేదనలో , ఆగ్రహంలో మునకలు వేయిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా తనకు అలసట చాలా తీవ్రంగా ఉంది. శరీరం నలిగిపోయిన అనుభూతి ! దేహంలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో సూర్యుడికి అర్థమై పోయింది. రాహువు నోటిలోని…
రాహుగ్రహ చరిత్ర ఏడవ భాగము
“గురువు గారూ ! అరుణుడి జన్మ వృత్తాంతం మీరు మాకు వివరించలేదే !" చిదానందుడు అన్నాడు. "ఇప్పటి దాకా ఆ పాత్రతో మన కథకు అవసరం కలగలేదు కదా ! అందుకని ఆయన గాథను అలా వదిలేశాను ! ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను , వినండి !" అన్నాడు నిర్వికల్పానంద. …
తిథి, వార, నక్షత్రాది వ్రతాలు
చైత్ర శుద్ధ త్రయోదశిని కామదేవ త్రయోదశి అంటారు. ఈ రోజున తెల్లకమలం మున్నగు పూలతో రతి, ప్రీతియుక్తుడు, మణి విభూషితుడు, శోక విదూరకుడునగు మన్మథుని పూజించాలి. ఈ వ్రతం పేరు మదన త్రయోదశి. ఇది సుఖసంతోషాలనిస్తుంది. ప్రతిమాసంలోనూ రెండు చతుర్దశులలోను రెండు అష్టమి దినాల్లోనూ…
సూర్య వంశవర్ణన
రుద్రదేవా! ఇక భరతఖండాన్ని ఏలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను. విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ఠ భాగము నుండి. దక్షప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది. అదితి నుండి వివస్వతుడను పేర సూర్యుడు, ఆయనకు వైవస్వతమనువు జనించారు.…
రాహుగ్రహ చరిత్ర ఎనిమిదవ భాగము
ఉన్నట్టుండి సూర్య తాపం తగ్గుముఖం పట్టడం రాహుకేతువులను ఆశ్చర్యానికి గురి చేసింది. "సోదరా ! వాతావరణం మనకు అనుకూలించినట్టుంది ! సూర్యుడిని కబళించేద్దాం.” కేతువు ఉత్సాహంగా అన్నాడు. "పద ! ఏం జరిగిందో , ఏం…
రాహుగ్రహ చరిత్ర తొమ్మిదవ భాగము
"జననీ జనకుల పాదపద్మాలకు ప్రణామాలు !" నారదుడు సరస్వతీ బ్రహ్మలకు చేతులెత్తి నమస్కరించాడు. సరస్వతి చిరునవ్వు నవ్వింది. "మీ జనకుల కర్ణపుటాలలో వేయడానికి ఏమి తెచ్చావు , నారద కుమారా ?” …
చంద్రవంశ వర్ణన
శ్రీహరి పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. “నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి ఆయననుండి చంద్రుడు ప్రాదుర్భవించారు. చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు, పురూరవుడు కలిగారు. చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా ఆరుగురు పుత్రులు కలిగారు. వారు శ్రుతాత్మక, విశ్వావసు, శతాయు,…
భవిష్యత్తులో రాజవంశాలు
చంద్రవంశంలో జనమేజయుని వంశంలో క్రమంగా శతానీక అశ్వమేధ దత్త, అధిసోమక, కృష్ణ, అనిరుద్ధ, ఉష్ణ, చిత్రరథ, శుచిద్రథ, వృష్టిమాన్, సుషేణ, సునీథక, నృచక్షు, ముఖబాణ, మేధావి, నృపంజయ, బృహద్రథ, హరి, తిగ్మ, శతానీక, సుదానక, ఉదాన, అహ్నినర, దండపాణి, నిమిత్తక, క్షేమక, శూద్రకులు రాజ్యం చేశారు. …
రాహుగ్రహ చరిత్ర పదవ భాగము
ఆహా ! త్రిమూర్తులకు మాట ఇచ్చిన విధంగా ఏడాదిలో తక్కువ పర్యాయాలు మాత్రం , తక్కువ సమయ వ్యవధానంతో సూర్య చంద్రులను గ్రహణం చేస్తూనే ఉన్నాడుగా !" నిర్వికల్పానంద సమాధానం చెప్పాడు. "అమావాస్య నాటి పగలు సూర్యుడినీ , పూర్ణిమ నాటి రాత్రి చంద్రుడినీ గ్రహణం చేయాలని…
కేతుగ్రహ చరిత్ర మొదటి భాగము
కేతువు ఆశ్రమం వెనుక తోటలో అసహనంగా తిరుగుతున్నాడు. సహజంగా మండుతున్న మంట రంగులో ఉండే అతని ముఖం ఇంకా అసహజంగా ఎర్రబడి భీతి గొలుపుతోంది. ఎర్రటి ముఖంలోంచి మరింత ఎర్రగా ఉన్న కళ్ళు కణకణలాడే నిప్పుకణాల్ని తలపిస్తున్నాయి. త్రిమూర్తులతో జరిగిన ఒడంబడిక…