నారదుడిట్లనియె : -
అంబిక నందీ, యిర్వురే అంధకాసురునితో నేలపోరాడిరి ? ఆ సమయాన శంకరుడెచట నుండెను. పులస్త్యుడిట్లు చెప్పెను. మునీ ! వెయ్యేండ్లు మోహంలో మునిగి నందున అప్పటినుండి శివుని వీర్యం క్షీణమై ఆయన తేజస్సును కోల్పోయాడు. తన శరీరంలోని అంగాలు అలా బలం కోల్పోవడం గమనించిన ఆ శివుడు లెస్సగా ఆలోచించి తపోచర్యకు పూనుకున్నాడు. అలా దీక్షబూని, పార్వతిని సమాధాన పరచి నందిని ఆమెకు కాపుగా నియమించి ఆ మహేశ్వరుడు భూమిమీద…
బ్రహ్మ యిలా అన్నాడు :-
పరభార్యలను కూడడం, పాపులను సేవించడం, ఇతర ప్రాణులపట్ల కఠినంగా వ్యవహరించడం మొదటి నరకం అని చెప్పబడతుంది. పండ్లు దొంగిలించడం, పనిపాటలు లేకుండా తిరగడం, వృక్షజాతులను నరకడం ఈ మహాపాపాలు రెండవ నరకం. నిషేధింపబడిన వస్తువులు గ్రహించడం, అవధ్యులను వధించడం, బంధించడం, డబ్బుకోసమై కలహించడం మూడవ నరకం. సర్వప్రాణులకు భీతికలిగిస్తూ ప్రపంచంలోని వస్తువులు నాశనం చేయడం, తన విధులనుండి వైదొలగుట నాలుగవనరకం. ఇతర జీవులను చంపడం మిత్రులపట్ల…
శివపూజా విధానం :-
ఓ నారదా ! అంతట నా దేవతలందరు మురారి విష్ణు మందిరానికి వెళ్ళి ఆ దేవునకు ప్రణామాలు గావించి జగత్సంక్షోభానికి కారణమేమని ప్రశ్నించారు.అదివిని శ్రీహరి మనమందరము శ్రీ శంకరుని నివాసానికి వెళ్ళుదము. మహాజ్ఞానియగు నాతడే జగత్తు సంక్షోభ కారణం చెప్పగలుగును. అన్నాడు. జనార్దనుని సలహా మేరకు ఆయన వెంటరాగా ఇంద్రునితో గలిసి దేవతలందరు మందరగిరికి వెళ్ళగా నచట శివపార్వతులు కాని నందీశ్వర వృషభాలు కాని కనిపించలేదు. అజ్ఞానాంధకారం…
నారదుడిలా అన్నాడు :-
ఓ మహర్షీ ! అలా పాతాళానికి వెళ్ళిన అంధకుడేమి చేశాడు? మందరగిరి మీద నున్న శంకరుడేమి చేశాడో దయచేసి చెప్పండి. అందుకు పులస్త్యుడిలా చెప్పసాగాడు. నారదా! పాతాళానికి పారిపోయిన అంధకుడు మదనజ్వాలల్లో తగలబడుతూ భరించలేక తోటి దానవులతో యిలా అన్నాడు. ''ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ శైల పుత్రిని తెచ్చి నాయెదుట నుంచువాడే నాకు నిజమైన స్నేహితుడు, సోదరుడు, బాంధవుడు, జనకుడు.'' కామాంధుడై అలా మాటాడే అంధకుని వారిస్తూ ప్రహ్లాదుడు…
దండుడిలా అన్నాడు :-
ఓ ఆరజా ! ఆ చిత్రాంగద అక్కడ వీరుడైన సురథుడ్ని స్మరిస్తూచాలాకాలం ఉండిపోయింది. దైవోపహతుడై విశ్వకర్మ మునిశాపంవల్ల భయంకరాకారంతో వానరుడై మేరుశిఖరాన్నుంచి భూమ్మీద శాలూకినీ నదీతీరాన శాల్వేయ పర్వతం వద్ద భయంకర అరణ్యంలో పడిపోయాడు. అక్కడ కందమూల ఫలాలు తింటూ అనేక సంవత్సరాలు గడిపాడు. ఒక పర్యాయం కందరుడు దైత్యశ్రేష్టుడు దేవపతిగా ప్రసిద్ధిగాంచిన తన ప్రియ పుత్రికను వెంట బెట్టుకని అక్కడకు వచ్చాడు. తండ్రితో కలిసివస్తున్న…
దండకుడన్నాడు : -
ఓ బాలా ! ఆ లోపల యోగయోగీశ్వరుడైన శ్రీ కంఠేశ్వరుని దర్శనానికై ఆ యక్ష అసుర కన్యకలు ఆలయానికి వెళ్ళారు. అక్కడ వారల వాడిపోయిన పూజ అక్షతాదులతో నిర్మాల్యంతో నిండియున్న స్వామి లింగాన్ని దర్శించారు. ఆది ఋతధ్వజుడు కావించిన పూజా నిర్మాల్యం . అంత నా కన్య లిద్దరూ నిర్మాల్యం తొలగించి విధిపూర్వకంగా అభిషేకం చేసి రాత్రింబవళ్ళు అర్చన గావించారు. వారక్కడ అలా ఉండగా నొకనాడు అవ్యక్తమూర్తియగునా శ్రీ కంఠదేవుని దర్శించడానికి గాలవుడను…
అరజ ఇలా అన్నది :-
ఓ రాజా నీవు ఎన్నిచెప్పినా ఇటు శీలాన్ని, అటు శాపానలాన్నుంచి నన్ను కాపాడుటకై నేను నీకు లోబడజాలను. తర్వాత ప్రహ్లాదుడు (అంధకునితో) ఇలా అన్నాడు. అలా వాదులాడుతున్న ఆ శుక్రకుమారి తను కామాంధుడైన ఆ బుద్ధిహీనుడు బలాత్కరించి, ఆమె శీలాన్ని ధ్వంసం గావించాడు. అంతట నా ఆశ్రమాన్ని వదలి ఆ నీతిహీనుడు క్రూరుడునైన పృథివీపతి తన నగరానికి వెళ్ళిపోయాడు. పాప మాదీనురాలు అరజ, రజస్రావంతో తడిసి ఆశ్రమ కుటీరంవదలి బయట, తల…
పులస్త్యుడిలా అన్నాడు :-
శంబర దైత్యుడు వెళ్ళిన పిమ్మట హరుడు నందిని పిలచి నీ యేలుబడిలో గల వారల నందరను, ఓ శిలాదనందనా ! వెంటనే పిలువుమని ఆదేశించాడు. మహేశ్వరుని మాట విన్నంతనే నంది అచమనం గావించి శివగణాల నాయకులందరిని స్మరించాడు. శ్రీమంతుడైన నందీశ్వరుడు స్మరించినవెంటనే వేల సంఖ్యలో, ఆ గణ నాయకులంతా ఎగిరివచ్చి ఆ దేవదేవునకు ప్రణమిల్లారు. నంది చేతులుజోడించుకుని పరమశివునకావచ్చిన వారలనందరును ఎరుకపరిచాడు. ప్రభో శంకరా…
వైశాఖమాస ప్రశంస
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా ! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసములయందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. …
మందరగిరికి అంధకాసురుడు తన సేనలతో వచ్చి చేరాడు.
ఈ లోపల ఆ ప్రమథులకాశ్రయాలైన కందరాలతో కూడిన ఆ మందరగిరికి అంధకాసురుడు తన సేనలతో వచ్చి చేరాడు. ఆ దానవులను చూచి ప్రమథులందరు కిలికిల ధ్వనులు చేసి గొప్ప సంరంభంతో అనేకాలయిన తూర్యాలు భేరీలు మోగించారు. ఆ మహానాదం ప్రళయ ఘోషలాగ భూమ్యాకాశాలను నింపివేసింది. ఆకాశమార్గాన వెళ్తున్న విఘ్నరాజైన వినాయకుని చెవిన బడినది. అదివిని క్రుద్ధుడై తన ప్రమథులతో కూడికొని పర్వతశ్రేష్ఠమైన మందరానికి…
వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు
నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు…
పులస్త్యుడు చెప్పప్రారంభించాడు :-
ప్రమథుల చేతిలో హతమైన తన సైన్యాన్ని చూచి ఆ అంధకుడు రాక్షసగురువైన శుక్రుని సమీపించి యిలా అన్నాడు. ''భగవన్! తమ అండ చూచుకొని మేము దేవ కిన్నర గంధర్వాదులను సంహరిస్తున్నాము. బ్రహ్మర్షీ! ఇటు చూడుడు. నాచే రక్షితమైన సేన అంతయు ప్రమథులచేత పరాభవింపబడి అనాథవలె పారిపోయి వచ్చింది. నా సోదరులయిన కుజంభాదులు చనిపోయారు. ఓ భార్గవా! ఇక ప్రమథులో కురుక్షేత్రం ఫలం లాగా…