భీమా - ఏకాదశి (భీమైకాదశి) (సంస్కృత వ్యాకరణం ప్రకారం ''భీమైకాదశి'' అనాలి)
ప్రాచీనకాలంలో పాండు పుత్రుడైన భీమసేనుడు మాఘశుద్ధ హస్తనక్షత్ర యుక్త ఏకాదశినాడు ఈ పరమ పుణ్యప్రద వ్రతాన్ని చేసి పితృణ మిముక్తుడైనాడు. ఆ మరుసటి రోజును ఆనాటినుండి భీమద్వాదశిగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా ఆ రోజు శాస్త్రోక్తంగా వ్రతం చేస్తే నశిస్తాయి. …
వ్రత పరిభాష, నియమాదులకు సంబంధించిన జ్ఞానం
వ్యాసమునీంద్రా! నారాయణ సంప్రీతికరములైన కొన్ని వ్రతాలను ఉపదేశిస్తాను. శాస్త్రములలో వర్ణింపబడిన నియమములను తప్పకుండా పాటించడమే వ్రతం. అదే తపస్సు కూడానూ. కొన్ని సామాన్య నియమాలిలా వుంటాయి. నిత్యం త్రిసంధ్యలలో స్నానం. భూమిపై శయనం. పవిత్రంగా ఉంటూ రోజూ హవనం చేయడం.పతిత జన సాంగత్యాన్ని వర్ణించడం. వ్రతం కోసం…
శనిగ్రహ చరిత్ర నాల్గవ భాగం
సన్నగా , నల్లగా బలహీనంగా ఉన్న వ్యక్తి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు. దూరం నుండి అతన్ని చూస్తూ జ్యేష్ఠ నవ్వుకుంది. తనను దగ్గర నుండి చూడగానే అతని మందగమనం పరుగుగా మారిపోతోంది. ఆ పురుషుడిని దాటి ముందుకు…
పాడ్యమి నుండి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు
వ్యాసమహర్షీ! ఇపుడు నేను ప్రతిపదాది తిథుల వ్రతాలను ఉపదేశిస్తాను. ప్రతి పదా అనగా పాడ్యమి తిథి నాడు చేయవలసిన ఒక విశేషవ్రతం పేరు శిఖి వ్రతం. ఈ ప్రతాన్నాచరించిన వారికి వైశ్వానరపదం సిద్ధిస్తుంది. పాడ్యమి నాడు ఏకభుక్తవ్రతం. అనగా పగటిపూట ఒకేమారు భోజనం చేసి వుండిపోవాలి. వ్రతం చివర్లో కపిల గోవును . దానమివ్వాలి.…
రాహుగ్రహ చరిత్ర మొదటి భాగము
దుర్వాస మహర్షి అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. వేగంగా. చల్లటి గాలి ఆయన శ్రమను ఉపశమింపజేస్తోంది. దుర్వాస మహర్షి నడకలో వేగం తగ్గింది. అద్భుతమైన , మహా మధురమైన సువాసన ఏదో , గాలిలో తేలుతూ వస్తోంది. ఆ సువానసతో ఆయన శరీరం పరవశిస్తోంది. అలౌకిక పుష్ప సౌరభాన్ని ఆఘ్రాణిస్తూ దుర్వాసుడు నిలబడి పోయాడు. ఆయన చూపులు సువాసన వస్తున్న వైపే…
రాహుగ్రహ చరిత్ర రెండవ భాగము
"ఇంద్రా ! మృతసంజీవనితో సరితూగే మహా శక్తి ఒక్కటే. అది అమృతం ! క్షీరసాగరాన్ని చిలికి ఆ అమృతాన్ని మీరు హస్తగతం చేసుకోవాలి. అమృతంతో బాటు అదృశ్యమైన మీ ఐశ్వర్యాలన్నీ మీకు అందుతాయి. అమృతపానంతో శరీరం గట్టిపడుతుంది ! మృత్యువు జయించబడుతుంది..." "ధన్యోస్మి దేవా ! క్షీరసాగర మధనానికి…
షష్ఠి, సప్తమి వ్రతాలు
భాద్రపద షష్ఠినాడు కార్తికేయుని పూజించాలి. ఈ పూజలో చేసే స్నానాది పవిత్ర కృత్యాలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ప్రతి షష్ఠినాడుపవాసం చేసి సప్తమి నాడు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ముందుగా ఓం ఖఖోల్కాయనమః అనే మంత్రంతో సూర్యుని పూజించాలి. అష్టమినాడు…
రాహుగ్రహ చరిత్ర మూడవ భాగము
దేవదానవులు అందరూ కలసి , వాసుకిని మందర పర్వతం చుట్టూ తాడులాగా చుట్టారు. దేవతలు వాసుకి పడగ వైపు పట్టుకున్నారు. "తుచ్ఛమైన పుచ్ఛాన్ని మేమెందుకు పట్టుకోవాలి ? పడగ వైపే పట్టుకుంటాం !'' అంటూ రాక్షసులు మొండికేశారు. …
దూర్వాష్టమి, శ్రీకృష్ణాష్టమి
భాద్రపద శుద్ధ అష్టమినాడు దూర్వాష్టమి వ్రతాన్ని చేయాలి. దూర్వ యనగా గరిక. ఆ రోజు ఉపవాసం చేసి గౌరీ, గణేశ, శివ ప్రతిరూపాలను గరికెతోనూ ఆపై ఫల పుష్పాదులతోనూ పూజించాలి. ప్రతి పూజాద్రవ్యాన్నీ శంభవేనమః, శివాయనమః అంటూ శివునిపై వేయాలి. దూర్వను కూడా ఇలా ప్రార్ధించాలి.
త్వందూర్వే మృతజన్మాసి వందితా చ సురాసురైః |
సౌభాగ్యం సంతతిం కృత్వా…
రాహుగ్రహ చరిత్ర నాల్గవ భాగము
"జగన్మోహనాకారంతో నువ్వెవరో మా కోసమే వచ్చినట్టున్నది ! మేమంతా కశ్యప ప్రజాపతి పరంపరకు చెందిన వీరాధివీరులం ! ఇదిగో , ఈ ''అమృతం'' సాధించాం ! మాలో మాకు భాగ పరిష్కారం కుదరకపోవడం వల్ల గొడవపడుతున్నాం ! నీ సౌందర్యాన్ని చూస్తూ ఉంటే నీ సహాయం కోరాలనిపిస్తోంది. మా అందరికీ ఈ అమృతాన్ని పంచిపెట్టి , సహాయం…
బుధాష్టమి - వ్రతం, కథ
బుధవారం, అష్టమి కలిసిన నాడు ఈ వ్రతాన్ని చేస్తారు. జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి. తరువాత గుమ్మడికాయనూ, బియ్యాన్నీ, దానమిచ్చి యథాశక్తి దక్షిణనివ్వాలి. బుధదేవుని యొక్క పూజలో వాడే బీజమంత్రం ఓం బుం బుధాయనమః. …
రాహుగ్రహ చరిత్ర ఐదవ భాగము
మేఘహాసుడు తపస్సు తీవ్ర రూపం ధరించింది. అచిరకాలంలో ఫలించింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. "వత్సా ! వరం కోరుకో !" అన్నాడు శివుడు. "పరమేశ్వరా ! నా తండ్రి రాహువుకూ , ఆయన సోదరుడు కేతువుకూ శరీరాలు పూర్వంలా…