చాతుర్మాస్య వ్రతం
ఈ వ్రతాన్ని ఆషాఢమాసంలో ఏకాదశినాడుగాని పూర్ణిమ నాడు గాని భగవానుడైన హరిని వీలైనన్ని విధాల పూజించి ఈ క్రింది శ్లోకాలతో ప్రార్థించి ప్రారంభించాలి.
ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ |
నిర్విఘ్నం సిద్ధి మాప్నోతు ప్రసన్నే త్వయి కేశవ ||
గృహీతే స్మిన్ ప్రతేదేవ యద్య పూర్ణే మ్నియామ్యహం |
తన్మే భవతు సంపూర్ణం త్వత్ప్రసాదాజ్జనార్దన ||…
శుక్రగ్రహ చరిత్ర పదవ భాగము
శుక్రుడు కచుడికి ఆశ్రమ గోవుల ఆలనా పాలనా అప్పగించాడు. అనధ్యయన సమయంలో ఆవులను అరణ్యానికి తోలుకు వెళ్ళి మేపడం , పూలూ , పళ్ళూ , సమిధలూ , దర్భలూ తీసుకురావడం కచుడికి నిత్య కృత్యమైపోయింది. ఏ పని అయినా…
మాసోపవాస వ్రతం
ఇది సర్వోత్తమ వ్రతాలలో ఒకటి. ఈ వ్రతాన్ని వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు పాలన చేసారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం చేసి ప్రతారంభంలో విష్ణు భగవానునిలా ప్రార్థించాలి.
ఆద్యప్రభృత్యహం విష్ణో యావదుత్థానకం తమ ||
అర్చయే త్వామనశ్నంస్తు దినాని త్రింశదేవ తు ||
కార్తికా శ్వినయోర్విష్ణో ద్వాదశ్యోః శుక్లయోరహం ||
మ్రియే యద్యంతరాలే తువ్రతంభంగో నమేభవేత్ ||
…
శుక్రగ్రహ చరిత్ర పదకొండవ భాగము
"నాకు ఎవ్వరూ కనిపించలేదు ! గుండెలో ఒక్కసారిగా ఏదో - అగ్నికణంలా చొచ్చుకు పోయినట్టనిపించింది. అంతే తెలుసు...” కచుడు జరిగినదాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు. "మరీ అరణ్య గర్భంలోకి వెళ్ళకు ! సూర్యాస్తమయం కాక ముందే ఆశ్రమానికి తిరిగి రావాలి సుమా !” అంటూ దేవయాని అతని కళ్ళల్లోకి తదేకంగా చూసింది. “నీకు…
భీష్మ పంచక వత్రం
కార్తికమాసమంతా ఏకభుక్తాలతో, నక్తవ్రతాలతో, అయాచిత వ్రతాలతో,కూర పాలు పండ్లు వీటిలో నొక ఆహారంతో ఉపవాసాలతో హరి పూజనం గావిస్తూ గడపాలి. అలా గడిపిన వారికి అన్ని పాపాలూ నశించి అన్ని కోరికలూ తీరి, హరిని కటవాస ప్రాప్తి కలుగుతుంది. …
శుక్రగ్రహ చరిత్ర పన్నెండవ భాగము
దేవయాని కచుడి వైపు చిరునవ్వుతో చూసింది. "రెండవ సారి పునరుజ్జీవితుడయ్యాక నీలో వర్చస్సు పెరిగింది, తెలుసా ?” అంది నవ్వుతూ. " అంతా నీ చలువే ! గురుదేవులు చెప్పారు. నేను సజీవంగా వచ్చేదాకా అన్నపానాలు ముట్టనని శపథం చేశావట ! నీ…
శివరాత్రి వ్రతకథ - విధానం
ఒకప్పుడీ వ్రతాన్ని శంకరభగవానుడు గౌరీదేవికి ఉపదేశించాడు. మాఘ, ఫాల్గుణ మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశినాడు ఉపవాస, జాగరణాలు చేసి శివుని పూజించిన వారికాయన ''ఇక్కడ'' భుక్తినీ ''అక్కడ'' ముక్తినీ ప్రసాదిస్తాడు. …
శనిగ్రహ చరిత్ర మొదటి భాగము
యముడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. సావర్ణినీ , శనినీ , యమినీ , తపతిని ప్రేమగా పలకరించాడు. "అనుకున్నది సాధించావు కద , యమా ?" సూర్యుడు కుమారుడిని అడిగాడు. "అనుకోని అద్భుత పదవిని బ్రహ్మదేవుడు నాకు అనుగ్రహించాడు. నాన్నగారూ !"…
ఏకాదశీ మహాత్మ్యం
ఒకప్పుడు మాంధాతయని ఒక రాజుండేవాడు. ఆయన ఈ వ్రతాన్ని చేసి చక్రవర్తి, సమ్రాట్ అనిపించుకొనే స్థాయికి ఎదిగాడు. ఈ వ్రతపుణ్యం అంత గొప్పది. ఈ వ్రతంలో ప్రథమ నియమం కృష్ణ, శుద్ధ రెండు ఏకాదశులలోనూ జీవితాంతమూ భోజనం చేయకుండా వుండుట. కౌరవ సామ్రాజ్ఞి గాంధారి దశమి విద్ధ…
శనిగ్రహ చరిత్ర రెండవ భాగము
శనైశ్చరుడు అరణ్య మధ్యంలో , ఒక ఏకాంత స్థలంలో తపస్సు ప్రారంభిచాడు. తాను రూపొందించుకున్న అష్టాక్షరీ మంత్రాలతో వరుసగా బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను ఏకదీక్షతో స్మరించడంతో అతని తపస్సు ఓ ప్రత్యేకతను పొందింది.
"ఓం చతుర్ముఖాయ నమః !
ఓం మహా విష్ణవే నమః !
ఓం మహేశ్వరాయ నమః…
విష్ణుమండల పూజావిధి
“భుక్తి ముక్తిప్రదాయకం, పరమగతి ప్రాప్తిదం ఐన మరొక శ్రేష్ఠ పూజను విధి విధానయుక్తంగా వర్ణిస్తాను వినండి" అంటూ బ్రహ్మదేవుడు విష్ణుమండల పూజను వర్ణించసాగాడు. ముందొక సామాన్య పూజామండలాన్ని నిర్మించి దాని ద్వారం దగ్గర పూజను మొదలుపెట్టాలి. ద్వార ప్రదేశంలోనే…
శనిగ్రహ చరిత్ర మూడవ భాగము
శనైశ్చరుడు విజయోత్సాహంతో సూర్యమందిరానికి తిరిగి వచ్చాడు. సంజ్ఞకూ , సూర్యుడికీ పాదాభివందనాలు చేశాడు. "యముడు ఎక్కడ ?" అని సంజ్ఞను అడిగాడు. "నువ్వు తపస్సుకు వెళ్ళినపుడే సంయమనీ పట్టణానికి వెళ్ళిపోయాడు…