Skip to content Skip to sidebar Skip to footer

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై నాల్గవ అధ్యాయం

రెండవ భాగం | నీతిసారం - ఐదవ భాగం లోభం ఎలాగూ మంచిదికాదు. ఒక్కొక్కప్పుడు చిన్నపొరపాట్లు, గట్టి నమ్మకము కూడా ప్రమాదిస్తాయి. కాబట్టి ఈ మూడింటి విషయంలో జాగ్రత్త అవసరం. భయం కూడా అలాటిదే. ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడి జాగ్రత్తగా వుండడం మంచిదేకాని ఆపద వచ్చేశాక మాత్రం భయాన్ని పూర్తిగా పరిత్యజించి ఆపదను ధైర్యంగా ఎదుర్కోవాలి. …

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై రెండవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర నాల్గవ భాగము "ఎలాగైనా సరే , నువ్వు జయించి తీరాలి ! ఆ రాక్షస గురువు , గురు రాక్షసుడూ అయిన శుక్రుడి తపస్సు భగ్నం కావాలి !" ఇంద్రుని మాటలు జయంతి చెవుల్లో గింగిరుమన్నాయి. ఎదురుగా , దూరంగా ఎండలో తపస్సమాధిలో కూర్చున్న శుక్రుడి మీద ఆమె చూపులు…

Read More

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై ఐదవ అధ్యాయం

తిథులూ - వ్రతాలూ బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇంకా ఇలా చెప్పాడు. "హే వ్యాసమునీ! ఇపుడు నేను కొన్ని వ్రతాలను నీకు ఉపదేశిస్తాను. వీటిని శ్రద్ధాభక్తులతో చేసే వారికి విష్ణువు అన్నీ ఇస్తాడు. అన్నిమాసాల్లో, అన్ని నక్షత్రాల్లో, అన్నితిథుల్లో హరికి ప్రియమైన వ్రతాలున్నాయి. పాడ్యమి తిథి నాడు వైశ్వానరునీ,…

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై మూడవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర ఐదవ భాగము వృషపర్వుడు సభలో ఉన్న రాక్షస వీరులతో తమ గురువు శుక్రులవారు తపస్సు నుండి ఇంకా తిరిగి రాని విషయం చర్చిస్తున్నాడు. చారుడు వచ్చి నమస్కరించాడు. "దేవతలు మన మీదికి యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. వాళ్ళ గురువు బృహస్పతి. ముహూర్తం నిర్ణయించే ఆలోచనలో ఉన్నాడు !" చారుడు వినయంగా అన్నాడు.…

Read More

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై ఆరవ అధ్యాయం

అనంగ త్రయోదశీవ్రతం బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇలా ఉపదేశించసాగాడు. హే మహర్షీ! మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ఈ అనంగత్రయోదశి అనే వ్రతాన్నిచేయాలి. మల్లికా వృక్షపు దంతపు పుల్ల, ఉమ్మెత్త పూలతో పండ్లతో శివుని పూజించాలి. తరువాత అనంగాయేతి... అనే మంత్రాన్ని పూర్తిగా చదువుతూ భగవంతుడైన శివునికి తేనెను నైవేద్యంగా అర్పించాలి.…

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై నాల్గవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర ఆరవ భాగం శుక్రుడిలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఎవరో వస్తున్నారన్నట్టు అందెల సవ్వడి వినవస్తోంది. శుక్రుడు అటు వైపు తిరిగి చూశాడు. సన్నటి కాలిబాట ! తను తపస్సు కోసం వచ్చినప్పుడు కాలిబాట లేదు ! ఎవరో రోజుల తరబడి తిరగడం వల్ల ఏర్పడిన నూతన పాద పథం ! …

Read More

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై ఏడవ అధ్యాయం

అఖండ ద్వాదశీ వ్రతం మునులారా! ఇపుడు మోక్ష, శాంతిప్రదమైన అఖండ ద్వాదశీ వ్రతాన్ని వినిపిస్తాను. మార్గశిర శుద్ధ ద్వాదశినాడు ఆవుపాలు, పెరుగులను మాత్రమే భోజనంగా స్వీకరించి జగన్నాథుడైన విష్ణువును పూజించాలి. నాలుగు నెలలపాటు అనగా ఫాల్గుణ మాసం దాకా ప్రతి ఇలా ప్రతి ద్వాదశినాడు చేసి చివరి అయిదు రకాల ధాన్యాలను అయిదు పాత్రలలో నింపి బ్రాహ్మణునికి దానం చేసి విష్ణుభగవానుని ఈ…

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై ఐదవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర ఏడవ భాగము "ఈ సంధి కాలంలో రాక్షసులకు సరికొత్త విద్యాబోధన చేయాలి ! దేవతలు గొప్పవారు , దేవతలు మంచివారు దేవతలకు రాక్షసులు సేవలు చేయాలి. రాక్షసులు దేవతలను గౌరవించి , ఆరాధించాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా దేవతల పట్ల అవిధేయత చూపరాదు. దేవతలతో యుద్ధానికి దిగరాదు. ఇలాంటి దేవహితం పొంగిపొర్లే విద్యను వాళ్ళకు బోధించాలి. వాళ్ళను మన విధేయులుగా , శాశ్వత…

Read More

🌹🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం🌹🌹🌹 -ఎనభై ఎనిమిదవ అధ్యాయం

అగస్త్యార్ఘ్య వ్రతం భుక్తి ముక్తి ప్రదాయకమైన ఈ వ్రతాన్ని కన్యారాశిలో సూర్య సంక్రాంతికి మూడు రోజుల ముందు ప్రారంభించాలి. కాశపుష్పాలతో (రెల్లు పూలతో) అగస్త్యుని మూర్తిని తెలతెల వారుతుండగా పూజించి కుంభంలోని నీటితో ఆ మహనీయునికి అర్ఘ్యమివ్వాలి. ఆ రోజంతా ఉపవసించి రాత్రి జాగరం చేసి తెల్లవారినాక బంగరు లేదా వెండి పాత్రలో, అయిదు…

Read More

నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై ఆరవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర ఎనిమిదవ భాగము బృహస్పతి ఇంద్రుడితో సమావేశమయ్యాడు. "పదేళ్ళు గడిచిపోయాయి , శుక్రుడు తిరిగి వచ్చేశాడు..." బృహస్పతి ప్రారంభించాడు. "జయంతి కూడా వచ్చేసింది , గురుదేవా !" ఇంద్రుడు అడ్డు తగిలాడు. …

Read More

🌹🌹 సంపూర్ణ గరుడ పురాణం 🌹🌹 – ఎనభై తొమ్మిదవ అధ్యాయం

రంభాతృతీయ వ్రతం బ్రహ్మదేవుడింకా ఇలా చెప్పసాగాడు, "సౌభాగ్యం, లక్ష్మి, పుత్రాది ఫలప్రదమైన రంభాతృతీయ వ్రతాన్నపదేశిస్తాను. దీనిని మార్గశిర శుద్ధ తదియనాడు చేయాలి. ప్రతి ఈ రోజు ఉపవసించి (కుశాలను ఉదకాన్ని కలపి ఆ) కుశోదకాన్ని చేత బట్టుకుని బిల్వ పత్రాల చివరలను దానిలో ముంచి వాటితో మహాగౌరిని పూజించాలి. ఈ పూజలో కదంబవృక్షాన్నుండి తీసిన…

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – తొంబై ఏడవ అధ్యాయం

శుక్రగ్రహ చరిత్ర తొమ్మిదవ భాగము "మృతసంజీవనికి విరుగుడా ?" బృహస్పతి ఆశ్చర్యంగా అన్నాడు. "అది పరమశివుని వరప్రసాదం , మహేంద్రా ! దానికి తిరుగూ లేదు. విరుగుడూ ఉండదు !" "అయితే స్వర్గ రాజ్యాన్ని ఆ రాక్షసులకు అప్పగించి , అడవుల దారి పట్టటమే !" ఇంద్రుడి కంఠంలో విచారం ధ్వనించింది. …

Read More