కర్మ నిరూపణ
మునులారా! పాపకర్మం వల్ల నరకంలోపడి అనుభవించే నాటకీయయాతన పూర్తికాగానే ఆ పాపకర్మ క్షయమై పోతుంది. అనగా తగ్గిపోతుంది కాని పూర్తిగా నశింపదు. ఆ మిగిలిన పాపం శమించే దాకా ప్రాణి మరల మరల జన్మలెత్తుతునే వుండాలి.. బ్రహ్మ హత్యా పాతకుడు నరకంలో ఘోర శిక్షలననుభవించి మరల భూమిపై ముందు కుక్కగా, పిదప గాడిదగా, ఆపై ఒంటెగా…
ప్రాయశ్చిత్తాలు - కృష్ణ, పరాక, చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు
విహితస్యాననుష్ఠానాన్నింది తస్యచసేవనాత్ |
అనిగ్రహాచ్చేంద్రియాణాం నరః పతన మృచ్ఛతి ||
చేయవలసిన పనులను చేయకపోవడం, చేయకూడని పనులను చేసేయడం, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం ఈ మూడిటిలో ప్రతీది మానవుని అధోగతి పాల్చేసే శక్తిని కలిగి వుంటుంది. కాబట్టి ఆత్మశుద్ధికై ప్రతి ఒక్కరూ తాను తెలిసోతెలియకో చేసిన దుష్కర్మకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసిందే. …
బుధగ్రహ చరిత్ర ఏడవ భాగము
బుధుడి వెంట వచ్చిన ఇలకు ఆశ్రమంలోని లేళ్ళు , కుందేళ్ళు తమ విధానంలో స్వాగతం చెప్పాయి. బుధుడు సాత్వికాహారంతో ఇలా కన్యకకు ఆతిథ్యం ఇచ్చాడు. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడటానికి , సరోవరం తెరుస్తున్న అందమైన కళ్ళలాగా తామరలు విచ్చుకుంటున్నాయి. కొలనులో బుధుడు స్నానం చేస్తున్నాడు. అతను ఆశ్రమం నుంచి…
ప్రాయశ్చిత్తాలు - కృష్ణ, పరక,చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు
వ్రాత్యుని కుపనయనం చేసి యజ్ఞం చేయించిన వాని కంటుకొనే పాపం మూడు కృచ్ఛ వ్రతాలను ఆచరించడం వల్ల నశిస్తుంది. అభిచారకహోమం (మంత్రం ద్వారా అపకారం) వల్ల వచ్చే పాపానికీ ఇదే ప్రాయశ్చిత్తం వేదప్లావి ఒక సంవత్సరం పాటు యవలనే తిని బతకాలి. శరణని వచ్చి…
బుధగ్రహ చరిత్ర ఎనిమిదవ భాగము
నారదుడు బ్రహ్మను దర్శించుకొనడానికి వెళ్ళాడు. ''ఇల'' అనే పేరుతో స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడిని బుధుడు వివాహం చేసుకున్న విషయం చెప్పాడు. బ్రహ్మ చిద్విలాసంగా నవ్వాడు. "ఇలా , బుధుడూ కలుసుకోవడంలోనూ.. భార్యాభర్తలుగా రూపొందడంలోనూ నీ ప్రయత్నం ఎంత ఉందో నాకు తెలియదా. కుమారా !"…
బుధగ్రహ చరిత్ర తొమ్మిదవ భాగము
ఇల తలను అడ్డంగా ఊపింది. "గురుదేవా... ఇక్కడ... ఈ రూపంలో నేను ప్రశాంతంగా ఉన్నాను ! ఈ జీవితం నాకెంతో తృప్తిగా ఉంది... నేను రాను.” "నీ నిర్ణయంలో కేవలం స్వార్థం ఉంది. నీ సుఖసంతోషాలు మాత్రమే ఉన్నాయి. తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిన గురుతరమైన బాధ్యత నీ…
బుధగ్రహ చరిత్ర పదవ భాగము
బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ఠ మహర్షి తపస్సు అచిరకాలంలోనే ఫలించింది. పరమశివుడు ఆయన ముందు సాక్షాత్కరించాడు. "వశిష్ఠా! వరం కోరుకో !" శివుడు చిరునవ్వుతో అన్నాడు. "పరమేశ్వరా ! నీకు తెలియదా ? మీ…
అశౌచం, ఆపద్వృత్తి
మునులారా! ఇపుడు మృత్యువు ఆవరించాక మనిషికి కలిగే మరణశౌచాన్ని వర్ణిస్తాను వినండి. రెండేళ్ళలోపు వయసున్న బాలకుడు మృతి చెందితే వానిని పాతిపెట్టాలి. జలాంజలి నీయకూడదు. ఈ పాతిపెట్టవలసిన చోటు నగరానికైనా గ్రామానికైనా వెలుపలవుండాలి. శ్మశానం కారాదు. శవాన్ని గంధ, మాల్య, అనులేపనాదులతో బాగా అలంకరించాలి. (మనుస్మృతి 5/68,69),…
బుధగ్రహ చరిత్ర పదకొండవ భాగము
"ఆచార్యా..." బుధుడు గద్గద కంఠంతో అన్నాడు. వ్యక్తం చేయలేని వ్యధ అతని కళ్ళల్లో స్పష్టంగా , తడిగా కనిపిస్తోంది , వశిష్ఠుడికి. "నాయనా , బుధా ! దుఃఖాన్ని దూరం చేసుకో ! ఇలతో నీ ఎడబాటు నిరంతరమైనదీ కాదు , శాశ్వతమైనదీ కాదు !" …
పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు; ప్రాయశ్చిత్త కర్మలు
సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ తన గురువైన వ్యాసమహర్షికి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా ప్రవచింపసాగాడు. "శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ అన్నీ నశించిపోతాయి. కల్పప్రారంభంలో మన్వాదిఋషులు వేదాలను స్మరించి బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. …
గురుగ్రహ చరిత్ర మొదటి భాగము
బృహస్పతి ప్రాతఃకాల పూజ చేయడానికి సిద్ధమై కూర్చున్నాడు. తార ఆయన వద్దకు వచ్చింది. "పువ్వుల కోసం వెళ్ళిన పుంజికస్థల ఇంకా రాలేదు. మరెక్కడికైనా వెళ్ళిందా , తారా ?" తారను అడిగాడు బృహస్పతి. …
బృహస్పతి ప్రోక్త నీతిసారం
నైమిషారణ్యంలో శౌనకాచార్యుని జిజ్ఞాస మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని, ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని, ఇలా బోధించసాగాడు. సూతమహర్షి "శౌనకాది మహామునులారా! ఇది రాజులు - అనగా పరిపాలకులు, వ్యాపార సామ్రాజ్యాధినేతలు, వారి గురువులైన మునులు, బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసు కోవలసిన విషయము.…