బుధగ్రహ చరిత్ర మొదటి భాగము
"అనసూయా ! బుధుడు పెద్దవాడయ్యాడు. విద్య నేర్చుకుని , బుద్ధిమంతుడయ్యాడు. ఇక మన రక్షణా , పోషణా వాడికి అవసరం లేదు. స్వయం సాధనతో అభివృద్ధి చెందాల్సిన వయసులో అడుగుపెట్టాడు." అత్రి మహర్షి చెప్పుకుపోతున్నాడు. "అంటే , బుధుణ్ణి పంపించి…
బుధగ్రహ చరిత్ర రెండవ భాగము
బుధుడు తన తండ్రి ముఖంలోకి క్షణకాలం మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. చంద్రుడి చూపులు పుత్రవాత్సల్యంతో , బుధుడి చూపుల్ని కౌగిలించుకున్నాయి. "నాన్నగారూ..." బుధుడు సందేహిస్తూ ఆగాడు. "ఏమిటి నాయనా ?" చంద్రుడు ప్రేమగా అడిగాడు. "నాకు... నాకు...…
దానధర్మ మహిమ
ఋషులారా! దానధర్మం చాలాగొప్పది. అన్ని వర్ణాలలోకీ అధ్యాయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్ణం గొప్పది. వారిలో సత్రియానిష్ఠుడు అనగా కర్మనిష్ఠగలవాడు శ్రేష్ఠుడు. వారిలో విద్య, తపస్సు గల బ్రహ్మతత్త్వ వేత్త వరిష్ఠుడు. దానమిచ్చువాడు సత్పాత్రుని కీయదలచుకున్నపుడు ఇది చూడాలి. భోజనం పెట్టడానికీ అన్నదానం చేసేటప్పుడూ ఆకలీ, పేదరికమూ మాత్రమే కొలబద్దలు, అలా కాకుండా గృహస్థైనవాడు గో, భూ, ధాన్య, ధన, సువర్ణాది…
బుధగ్రహ చరిత్ర మూడవ భాగం
మాటాడలేకపోతున్నాడు. హృదయాలు ద్రవిస్తూ , స్పందించే విశిష్ట క్షణాలలో మాటలు అవసరం లేదని ఆ ''వాక్పతి''కి తెలుసు , బృహస్పతి చిరునవ్వుతో బుధుణ్ణి చూశాడు. ఆ చిరునవ్వు ఆయన ముఖానికి ప్రశాంత ప్రకాశాన్ని పులుముతోంది. అనునయంగా తలపంకిస్తూ ఆశ్రమం వైపు చెయ్యి చూపించాడాయన. …
శ్రాద్ధాదికారులు దాని సంక్షిప్తవిధి మహిమ, ఫలాలు
ఋషిగణులారా! ఇపుడు సర్వపాపవినాశినియైన శ్రాద్ధ విధిని వినిపిస్తాను. ఒక మనిషిపోయిన ఏడాదికి ఆ రోజే శ్రాద్ధం పెట్టాలను కుంటారు చాలా మంది. తద్దినం లేదా ఆబ్దికం - ఏడాదికొకసారి పెట్టేదే శ్రాద్ధమనుకుంటారు కూడ. కాని, శ్రాద్ధమనగా శ్రద్ధగా పితృదేవులను తలచుకొని చేయు కర్మయని భావము.…
వినాయక శాంతి స్నానం
''మునులారా! మనిషి తెలిసిగాని తెలియకగాని చేసే కొన్ని పనులు దేవతలకు కోపం తెప్పిస్తాయి. వారు అప్రసన్నులౌతారు. అలా వినాయకుని అప్రసన్నతకు గురైన వారు ఆ విషయాన్ని తెలుసుకొనే అవకాశాన్ని ఆయనే కల్పించాడు'' అంటూ వారి లక్షణాలను ఇలా చెప్పనారంభించాడు యాజ్ఞవల్క్య మహర్షి పుంగవుడు. ''వారికి…
బుధగ్రహ చరిత్ర నాల్గవ భాగము
“నాయనా ! కన్నతల్లి దర్శనం కోసం కలలు కని , ఆ కలల్ని సాకారం చేసుకున్న ధన్యుడివి నువ్వు. లోకపూజ్యుడయ్యే లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి. క్షేమంగా వెళ్ళు. నీ మాతృమూర్తిని చూడడానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నా అనుమతి అవసరం లేదు సుమా !!" తనకు వీడ్కోలు పలుకుతూ , శిరస్సు స్పృశించి , దీవిస్తూ ఆయన అన్న…
గ్రహ శాంతి
మునులారా! సిరిసంపదలూ, సుఖశాంతులూ కోరుకొనేవారు ముందు తమపై విభిన్న గ్రహాల ''చూపు'' ఎలావుందో చూసుకొని ''అది'' బాగులేని చోట జాగ్రత్తపడాలి. అంటే తమతమ జాతకాల్లో నున్న గ్రహదోషాలను ఆయాగ్రహ సంబంధిత యజ్ఞాలను చేయడం ద్వారా పోగొట్టుకోవాలి. మనకి తొమ్మిది గ్రహాలున్నాయని విద్వాంసులు చెప్తారు. అవి క్రమంగా సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు…
బుధగ్రహ చరిత్ర ఐదవ భాగము
అదే సమయంలో ... వేట శబ్దాలు వినవస్తున్న అటు వైపు అరణ్యంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. మృగయా వినోదం వేటగాళ్ళకు విషాదంగా మారింది. వైవస్వత చక్రవర్తి కుమారుడు , యువరాజు సుద్యుమ్నుడు సైన్యంతో అరణ్యంలో తన నిత్యవినోదమైన వేటను సాగిస్తున్నాడు. తన…
వానప్రస్థ ధర్మ నిరూపణం
మునులారా! వానప్రస్థాశ్రమాన్ని వర్ణిస్తాను. అవధరించండి. వానప్రస్థాశ్రమంలో ప్రవేశించదలచుకొన్నవాడు తన భార్యను తీసుకొని వెళ్ళవచ్చు, లేదా, సమర్థుడైన కొడుకుపై ఆమె సంరక్షణ భారాన్ని మోపి వెళ్ళవచ్చు. అంతేగాని ఆమె సంగతి చూడకుండా వెళ్ళరాదు. వానప్రస్థికి బ్రహ్మచర్యం విధాయకం. శృంగారానికి సంబంధించిన ఆలోచన కూడా మదిలో మెదలరాదు.…
బుధగ్రహ చరిత్ర ఆరవ భాగము
"నా పేరు అదే - ఈ రూపం రాకముందు పురుష రూపంలో సుద్యుమ్నుడు..." "సుద్యుమ్నుడా !! నారాయణ !" నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు. "ఔను ! స్త్రీ రూపం రాగానే నా పేరు ''ఇల'' అని అనిపించింది ఎందుకో ?" ఇల దీనంగా…
సన్యాసధర్మ నిరూపణ
(సంస్కృతంలో ''సంన్యాస'' అనే వుంటుంది. కొన్ని చోట్ల ''సన్యాస'' అనే పదం కూడా కనిపిస్తున్నా తెలుగులో ఎక్కువగా కనిపిస్తున్నది 'సన్యాసమే'. అను) హే సజ్జనులారా! ఇపుడిక భిక్షు -ధర్మమను నామాంతరం గల సన్యాసధర్మాన్ని వినిపిస్తాను. గృహస్థ వానప్రస్థాశ్రమాలలో తాను చేసిన అన్ని…