ఆచార్యాభిషేక విధానం - నారద ఉవాచ
శిష్యుడు ఆచార్యాభిషేకము ఎట్టు చేయవలెనో చెప్పదను. దీనిచేత సాధకుడు సిద్ధిని పొందును. రోగి రోగవిముక్తు డగును. రాజు రాజ్యమును, స్త్రీ కుమారుని, పాపవినాశమును పొందును. తూర్పున ప్రారంభించి మంచి రత్నములతో కూడిన మట్టి కుండలను మండప మధ్యభాగమున ఉంచవలెను. వాటిని సహస్రావర్తితములు లేదా శాతావర్తితములు చేయవలెను. మండలమునందు తూర్పు - ఈశాన్యదిక్కులందు పీఠముపై విష్ణువును ఉంచి, సాధకునికిని, శిష్యునికిని…
ఇంద్రనీలమణి లక్షణాలు, పరీక్షా విధి
ఎక్కడ సింహళదేశపు రమణులు లవలీ అనే సుగంధిత పుష్పాలతో వాటి వాసనలతో మనసును దోచే వృక్షాలనూ, పొగడలనూ తమ కరాగ్రాల స్పర్శచే కరుణిస్తుంటారో అక్కడ మహాదాత బలాసురుని వికసిత కమల సదృశ శోభలతో వెలిగే కన్నులు వచ్చి పడినవి. రత్న సమాన కాంతులీను ఆ నేత్రప్రభతో సముద్రతీరమంతా వెలుగులమయమై భాసించింది. అక్కడొక విశాలమైన క్షేత్ర మేర్పడింది. …
గంగాది తీర్థాల మహిమ
సూతుడు శౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు. "శౌనకాచార్యాదులారా! ఇపుడు మీకు మన సమస్త తీర్థాలనూ వాటి మహిమనూ వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమము గంగ. గంగానది సర్వత్రా సులభమైనా హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో…
సర్వతోభద్ర మండలవిధిః
సాధకుడు దేవాలయాదులలో మంత్ర సాధన చేయ వలెను. తూర్పు గృహము నందు శుద్ధమైన భూమిపై, మండలము నందు, ప్రభువైన హరిని స్థాపింపవలెను. చతురశ్రముగ చేసిన క్షేత్రముమీద మండలాదులను వ్రాయ వలెను. రెండు వందల ఏబదియారు కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయ వలెను. ముప్పది ఆరు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను.…
సూర్యగ్రహ చరిత్ర మొదటి భాగము
తన సంతానం - శనైశ్చరుడూ , సావర్ణి , తపతీ పెద్దవాళ్లయ్యే కొద్దీ - ఛాయ సంజ్ఞ పిల్లలకు మానసికంగా బాగా దూరంగా జరిగింది. వైవస్వతుడినీ , యముడినీ , యమినీ చూడడానికే ఆమె ఇష్టపడడంలేదు. ఛాయ తన బిడ్డలు ముగ్గుర్నీ రహస్యంగా సమావేశపరిచింది.…
వైదూర్యమణి - పరీక్షా విధి
(వైడూ'ర్యమనే మాటే తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది. కాని సంస్కృత మూలం విదూర-జ, వైదూర్య) సూతుడిలా చెప్పసాగారు, "హే శౌనకాది మహామునులారా! వైదూర్యాది ఇతర మణులను అనగా వైదూర్య, పుష్ప, రాగ, కర్కేతన, భీష్మక మణులను గూర్చి బ్రహ్మదేవుడు మా గురువు గారికి చెప్పగా ఆయన నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించారు.…
సూర్యగ్రహ చరిత్ర రెండవ భాగము
శని , సావర్ణి , తపతి - ముగ్గురూ బంగారు గిన్నెల్లో ఉన్న క్షీరాన్నం తింటున్నారు. వాళ్ళ దగ్గరగా కూర్చున్న ఛాయ కొసరి కొసరి వడ్డిస్తోంది... శని తింటూ , తింటూ వాలుగా ద్వారం వైపు చూసి , ఛాయ వైపు అదోలా చూశాడు. ఛాయ ద్వారం…
ఇతర మణులు (పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుధిరాక్ష, స్పటిక, విద్రుమ)
పుష్యరాగ (పుష్కరాగ) మణి బలాసురుని చర్మం హిమాలయ పర్వతంలో పడిన చోటినుండి ఉద్భవించింది. ఇది మహాగుణ సంపన్నం. సంపూర్ణ పీత, పాండుర వర్ణముల సుందరకాంతులను వెదజల్లు పుష్యరాగాన్నే పద్మరాగమణిగా వ్యవహరిస్తారు. అదే లోహిత, పీతవర్ణాల కాంతులను వెలారుస్తుంటే కౌకంటకమని వ్యవహరిస్తారు. పూర్ణలోహిత వర్ణము, సామాన్య పీత వర్ణము సంయుక్తంగా వుండి మెరిసే పాషాణాలను…
గయా మాహాత్మ్యము - శ్రాద్ధాది కర్మల ఫలము
గయా మాహాత్మ్యాన్ని వింటే చాలు ''ఇక్కడ'' భుక్తికీ ''అక్కడ'' ముక్తికీ లోటుండదు. ఇది పరమ సారస్వరూపం. పూర్వకాలంలో గయ నామకుడగు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయడానికేమో అన్నట్లుగా ఘోరతపము నాచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగ మండిపోసాగాయి. దేవతలు విష్ణువునాశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో…
సూర్యగ్రహ చరిత్ర మూడవ భాగము
"సంజ్ఞా!" సూర్యుడి కంఠం ఆకాశంలో ఉరుములా ధ్వనించింది. పిలుపు మందిరమంతా ప్రతిధ్వనించింది. ఛాయ లేచి ఆందోళనగా చూసింది. తండ్రిని చూడగానే , శనీ , సావర్ణి , తపతీ అసంకల్పితంగా తల్లి చాటుకు తప్పుకున్నారు.. "యముణ్ణి శపిస్తావా ?”…
గయా మాహాత్మ్యము - శ్రాద్ధాది కర్మల ఫలము
క్షేత్రంలోని చోటులేదు. అక్షయ ఫలాలూ బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగునా లభింపజేసే పుణ్యస్థాన సముదాయం గయ,
గయాయాం నహి తత్నం యత్ర తీర్థం న విద్యతే |
పంచక్రోశో గయాక్షేత్రే యత్ర తత్ర తు పిండదః ||
అక్షయం ఫల మాప్నోతి బ్రహ్మ లోకం నయేత్ పితౄన్ |
…
సూర్యగ్రహ చరిత్ర నాల్గవ భాగము
ఆ ప్రశాంత వాతావరణంలో సూర్యుడూ , సంజ్ఞ అశ్వ దంపతులుగా విహరిస్తూ. ఉండిపోయారు. అశ్వరూపంలో ఉన్న సంజ్ఞ తనలో సూర్యుడు ప్రవేశపెట్టిన తేజస్సును నాసికా రంధ్రాల గుండా వెళ్ళగక్కింది. రెండు నాసికారంధ్రాల నుండి వెలువడిన సూర్య తేజం . ఇద్దరు కుమారులుగా మారింది. ఆశ్విక దాంపత్య…