సామాన్య దేవపూజా నిరూపణము
విష్ణువు మొదలగు దేవతల సామాన్య పూజను, సర్వఫలములను ఇచ్చు మంత్రములను గూర్చి చెప్పెను. సకల పరివార సమేతుడైన అచ్యుతునికి నమస్కరించి పూజించ వలెను. విష్ణు పూజాంగముగా ద్వార దక్షిణ భాగమున ధాతను, విధాతను, వామ భాగమును గంగను, యమునను రెండు నిధులను, ద్వార లక్ష్మిని, వాస్తు పురుషుని, శక్తిని, కుర్మమును, అనంతుని, పృథివిని, ధర్మమును జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును, అధర్మాదులను,…
స్త్రీల, పురుషుల సామాన్య లక్షణాలు
పరమేశ్వరాదులారా! మీకిపుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలను వివరిస్తాను. ఈ పరిజ్ఞానం భూత, భవిష్యత్కాలాలను తెలుపుతుంది. నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణమున్నవారు,కాషాయరంగులో పాదాలున్నవారు, అసాధారణమైన రంగులో పాదాలున్నవారు వంశనాశకులౌతారు.పాదాలు శంఖువు ఆకారంలోనున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు అందరాని పొందును వాంఛిస్తుంటాడు. తలవెంట్రుకలు కుంచితమై వుండేవారికి విదేశంలో…
స్నానవిధి కథనము
నారద ఉవాచ
యాగ వూజాదిక్రియలు చేయుటకు ముందు చేయదగిన స్నానమును గూర్చి చెప్పెదను. నృసింహ మంత్రమును ఉచ్చరించుచు మృత్తికను గ్రహించి, దానినిరెండు భాగములు చేసి ఒక దానిచే మల స్నానము చేయ వలెను. మునిగి, ఆచమనము చేసి, నృసింహ మంత్రముచే న్యాసము చేసి, రక్ష చేసికొని పిమ్మట ప్రాణాయామ పూర్వకముగా విధి స్నానము చేయవలెను. …
స్వరోదయ విజ్ఞానం
మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని కొన్ని శబ్దాలు పలికే స్వరాలు కూడా కొన్ని కొన్ని కార్యాల శుభాశుభ ఫలితాలను సూచింపగలవు. మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ఇవి నాభి ప్రదేశానికి దిగువగా వుండే కందస్థాన లేదా మూలాధారము నుండి బయలుదేరి శరీరమందంతటా విస్తరించి వుంటాయి. డెబ్బది రెండు…
అథాది మూర్త్యాది పూజావిధి కథనము
నారద ఉవాచ
విప్రులారా! ఏ పూజావిధిచే సర్వకార్య కామములును లభించునో దానిని చెప్పెదను. పాదప్రక్షాళనము చేసికొని, ఆచమనము చేసి, మౌనము అవలంబించి, రక్ష చేసికొని, తూర్పుగా తిరిగి, స్వస్తిక్ ఆసనమునందు కాని, పద్మాననము నందు గాని, మరొక ఆసనమునందు…
రత్నాల పుట్టుక కథ వజ్ర పరీక్ష
“ప్రాచీన కాలంలో బలాసురుడను ఒక రాక్షసుడుండేవాడు. అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతనీ తన త్రైలోక్యాధిపత్యాన్నీ లోకానికి చాటుకున్నాడు. బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం వుండేది. దేవతలు బ్రాహ్మణ వేషాలలో అతని వద్దకు పోయి తామొక యజ్ఞాన్ని తలపెట్టామనీ బలిపశువు కోసం అతనిని యాచించడానికి వచ్చామనీ బలాసురుని బతిమాలుకున్నారు. …
అథ వాసుదేవాది మంత్ర ప్రదర్శనము
నారద ఉవాచ
పూజ్యములైన వాసుదేవాది మంత్రముల లక్షణము చెప్పెదను. ఆది యందు “నమో భగవతే” అను పదములో కలవి, అ, ఆ, అం, అః అను బీజాక్షరములతో కూడినవి ఓంకారము ఆది యందు కలవి, '‘నమః’' అనునది అంతమందు కలవి అయిన '‘వాసుదేవ’', ‘'సంకర్షణ'’, '‘ప్రద్యుమ్న'’, ‘'అనిరుద్ధ'’ అను పదములచే “ఓం నమోభగవతే వాసుదేవాయ”,…
ముత్యాలు - వాటిలో రకాలు లక్షణాలు- పరీక్షణ విధి
శ్రేష్ఠమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు - వీటన్నిటి నుండీ ముత్యాలు వస్తాయి. అయినా శుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ ప్రసిద్ధాలు. రత్నమనిపించుకొనే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికి ఉంటుందని ముక్తాశాస్త్రం వివరిస్తోంది. అది ముత్యపు చిప్పలోనే పుడుతుంది. ఇదే…
అథ ముద్రా లక్షణము | నారద ఉవాచ
దేవతా సాన్నిధ్యాదులను కలిగించు ముద్రల లక్షణమును చెప్పెదను. హృదయమునకు సమీపమున కట్ట బడిన అంజలి మొదటిముద్ర. రెండవది వందని. మూడవది హృదయానుగ. ఎడమ చేతిపిడికిలిని బొటన వ్రేలు పైకి నిలచి ఉండు నట్లును, (అంజలి) కుడిచేతి బొటన వ్రేలు వంచి బంధించి నట్లును (వందని) ఉంచ వలెను.అట్లే రెండు పిడికెళ్ళ అంగుష్ఠములును పైకి…
పద్మరాగమణి - లక్షణాలు
పరీక్షావ మహాకాలదేవతల పాలిటి మహాదాతయు, జగత్తికి సర్వరత్న ప్రదాతయునగు బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకొని వెళుతుండగా వినీలాకాశ మార్గంలో లంకపై నుండి పోతున్నపుడు లంకాధిపతియైన రావణుడు అడ్డగించాడు. వారి పెనగులాటలో ఆ రక్తం అలా క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది. రావణగంగగా ప్రసిద్ధమైన ఆ…
దీక్షా విధి | నారద ఉవాచ
అన్నిఫలములను ఇచ్చు దీక్షను చెప్పదను. మండలము నందలి పద్మము నందు హరిని పూజించ వలెను. దశమి యందు సమస్త మైన యాగ ద్రవ్యములను సమకూర్చుకొని, అచట ఉంచి, ’'ఫట్'’ అనునది అంతము నందు గల నారసింహామంత్రము చేత నూరు పర్యాయములు అభిమంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను. అచట సర్వాత్మికయు,…
మరకతమణి - లక్షణాలు, పరీక్షా విధి
నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకొని ఆకాశాన్ని చీల్చేటంత వేగంతో దేవలోకం వైపు సాగి పోతుండగా అతని తలపై నున్న మణి ప్రకాశం క్రింద నున్న సముద్రంపై పడి సాగరానికి వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పఱచుకొన్నాయి.సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమ్యాకాశాలను కలగుండు పఱచే వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడిచేశాడు. …