సరోవర మాహాత్మ్యం
సనత్కుమారుని వచనము : -
స్థాణువటానికి ఉత్తరంగా శుక్రతీర్థం ఉంది. స్థాణువటానికి తూర్పున సోమతీర్థం దక్షిణాన దక్షతీర్థం పడమరగా స్కంద తీర్థం ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాల నడుమనున్నది స్థాణువు. దాని దర్శన మాత్రాన్నే పరమ పదం లభిస్తుంది. అష్టమీ చతుర్దశీ తిథులలో వానికి ప్రదక్షిణం చేస్తే అడుగడుగూకూ యజ్ఞఫలం లభిలస్తుంది. సందేహం లేదు. ఈ తీర్థాలను మునులు సాధ్యులు ఆదిత్యులు వసువులు, మరుత్తులు అగ్నులు మొదలగు వారందరూ శ్రద్ధగా సేవించారు. ఈ స్థాణు క్షేత్రారాజాన్ని…
సరోవర మాహాత్మ్యం
పులస్త్యుడు చెప్పసాగాడు : - ఆ మేనాదేవి గుణసంపన్నురాలయిన కుమార్తెలు మువ్వురను సునాభుడిగా పేరొందిన పుత్రునొకనిని కనినది. వారలలో ఎర్రనికాంతిని కలిగి ఎర్రని నేత్రాలతో ఎర్రనివస్త్రాలు ధరించిన రాగిణియను పుత్రిక జ్యేష్ఠురాలు. ఓ మునీః తామరాకుల్లాంటి నేత్రాలతో తెల్లని అంగకాంతితో నల్లని నొక్కుల జుట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి పుట్టిన కుటిల రెండవది. నల్లని దేహకాంతితో నల్ల కమలాలబోలిన కండ్లతో చక్కని పిరుదులతో సాటిలేని అందంతో పుట్టిన మూడవ కుమార్తె కాళీ. పుట్టిన ఆరేండ్ల…
సరోవరమాహాత్మ్యం
మార్కండేయు డిట్లనెను :-
మహామునీ ! స్థాణుతీర్థమహిమ సమగ్రంగా వినగోరెదను. అచట సర్వపాపాలు పోగొట్టే సిద్ధిని ఎవరు పొందారు? అందులకు సనత్కుమారుడిలా చెప్పదొడగెను. ఓ మార్కండేయ మహర్షీ! అత్యుత్తమ మైననీస్థాణుతీర్థమహిమ సాకల్యంగా వినవలసినది. దీనిని వినిన తరుడు సకలపాపలవిముక్తుడౌతాడు. మహాప్రళయ సమయాన ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతా నశించిపోగా అవ్యక్తజన్ముడైన ఆ విష్ణుమూర్తి బొడ్డునుండి కమలం పుట్టింది. దాని నుండి సర్వలోక పితామహుడగు బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన నుండి మరీచి జనించగా ఆయన కుమారుడుగా కశ్యపుడు…
సరోవరమహత్యం
సనత్కుమారుడిలా అన్నాడు :- అంతట త్రిలోకేశ్వరుడైన శివుడు, వాక్య కోవిదుడు, వేనునకు తృప్తిగొలుపు నట్టి ఉత్తమ వాక్యాలు మాటాడాడు - 'భళీ! సువ్రతుడవగు రాజా! నీ స్తోత్రానికి నేను సంతోషించాను. వేయేల నీవెల్లప్పుడు నా సమీపాన నివసించ గలవు. చాలా కాలం నావద్ద ఉండి, అనంతరం నా శరీరం నుంచియే జన్మించి, అంధకాసురడనే దేవాంతకుడవు కాగలవు. వెనుక నీవు కావించిన, వేదనిందా పూర్వకమైన అధర్మాచరణం వల్ల హిరణ్యాక్షుని యింట్లో పుట్టి పెద్దవాడవు కాగలవు. ఆ జన్మలో…
సరోవర మాహాత్మ్యం
పులస్త్యుడు చెప్పసాగాడు : - ఆ మేనాదేవి గుణసంపన్నురాలయిన కుమార్తెలు మువ్వురను సునాభుడిగా పేరొందిన పుత్రునొకనిని కనినది. వారలలో ఎర్రనికాంతిని కలిగి ఎర్రని నేత్రాలతో ఎర్రనివస్త్రాలు ధరించిన రాగిణియను పుత్రిక జ్యేష్ఠురాలు. ఓ మునీః తామరాకుల్లాంటి నేత్రాలతో తెల్లని అంగకాంతితో నల్లని నొక్కుల జుట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి పుట్టిన కుటిల రెండవది. నల్లని దేహకాంతితో నల్ల కమలాలబోలిన కండ్లతో చక్కని పిరుదులతో సాటిలేని అందంతో పుట్టిన మూడవ కుమార్తె కాళీ. పుట్టిన ఆరేండ్ల…
సరోవర మహత్మ్యం
పులస్త్య మహర్షి చెప్ప మొదలుపెట్టాడు :- అక్కడ చేరిన దేవతలను చూచి నంది ఏదో అనగా మహేశ్వరుడు లేచి భక్తితో శ్రీహరిని కౌగిలించుకున్నాడు. అంతట బ్రహ్మకు నమస్కరించి ఇంద్రుని సంభావించి యితర పదేవతలనందరను యథోచితంగా పలకరించాడు. వీరభద్ర పురోగాములై శివగణాలు పాశుపతగణాలు జయజయ ధ్వానాలు చేస్తూ మందరగిరి చేరారు. అక్కడ నుండి దేవగణాలతో కూడి మహేశ్వరుడు వైవాహిక విధినిర్వహణకై కైలాస శిఖరాలకు వెళ్లాడు. ఆ కొండ మీద దేవమాత అదితి, సురభి, సురస మొదలగు…
పులస్తుడిలా అన్నాడు : -
ఓ మునీ ! అలా హరుడా గిరిమీద పార్వతితో యథేచ్ఛగా విహరిస్తూ విశ్వకర్మకు పిలిచి తనకొక గృహం నిర్మించమన్నాడు. అంతటనాతడు స్వస్తిక లక్షణంతో అరవై నాలుగు యోజన ప్రమాణం గల మేలిమి బంగారం భవనాన్ని నిర్మించాడు. దంతాలతోచేసిన తోరణాలు, ముత్యాలుపొదిగిన గవాక్షాలు, వాకిండ్లు, స్ఫటిక సోపాన పంక్తులు, వైదూర్యమణుల చిత్తరువులు, ఏడు విశాలమైన గదులు, సకలవిధాల వసతులు, భోగసామగ్రులు కలిగి ఆ భవనం సర్వాతిశాయిగా రూపొందింది. అందులోచేరి ఆ దేవదేవుడు గృహస్థులు…
పులస్త్య వచనము :-
నారదా ! కశ్యప మర్షి భార్యదనువు. ఆమెకు యింద్రునికన్న బలవంతులగు మువ్వురుకు కుమారులు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు శంభుడు, రెండవవాడు శంభుడు మూడవవాడు మహాబలినముచి. ఇంద్రుడు వజ్రాయుధంతో నమునిచి చంపుటకుద్యమింపగా నతడు సూర్యుని రథంతో ప్రవేశించాడు. అంచేత అతడిని చంపనలవిగాక వాడితో ఇంద్రుడు సంధిచేసుకొని వాడికి ఆస్త్రస్త్రాలతో చావులేకుండునట్లు వరమిచ్చాడు. ఆ విధంగా అవధ్యుడైవాడు సూర్యరథం వదలి పాతాళానికి చేరుకున్నాడు. నీళ్ళలో మునిగిన వానికి సముద్రపు నురుగు (ఫేనం) కనిపించగా ఇంద్రుడు చెప్పినట్లు…
పులస్తుడు అన్నాడు :-
నారద ! చండముండులు వధింపబడి తమ సైన్యమంతా చెల్లాచెదరు కావడంచూచి శుంభనిశుంభులు రక్తబీజుడనే ఘోరరాక్షసుణ్ణి ముప్పదికోట్ల అక్షౌహిణీ సైన్యంతో యుద్ధానికి పంపించారు. వారు రావడం చూస్తూనే చండిక భయంకరమైన సింహనాదం చేసింది. ఆదైత్యులు కూడా సింహనాదాలు చేశారు. ఆమె గర్జిస్తుండగా నామెనోటినుండి, అక్షమాలకమండలాలు ధరించి హంసల విమానం మీద కూర్చున్న బ్రహ్మాణి వెలువడింది. మరుక్షణాన మూడుకన్నులు త్రిశూల, సర్పకుండలాలు వలయాలు ధరించి వృషభారూఢయై…
నారదుడు ప్రశ్నించాడు :-
ఓ మహాద్యుతీ ! మహిషంతోగూడ క్రౌంచగిరిని స్కందుడు ఎలా చీల్చాడో విపులంగా నా కెరిగించండి. అందుకు పులస్తుడు చెప్పసాగాడు. నారదా! యిది చాలా పురాతనకాలపు కథ. పవిత్రమైనది. కార్తికేయుని యశోభివృద్ధిని వివరించే విషయం చెపుతున్నాను వినుము. ఆ విధంగా శివుని వీర్యాన్ని మ్రింగిన అగ్నిదేవుడా తేజస్సును భరించలేక తన తేజస్సును కోల్పోయాడు. అంత నాతడు దేవతలతో చెప్పుకోగా వారంతాకలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. మార్గమంధ్యంలో అగ్ని కుటిలాదేవినిచూచి ఆమెతో అమ్మా ! ఈ శివతేజాన్ని…
పులస్తుడిట్లనెను :-
దేవతలు తనను దేవసేనల కధిపతిగా అభిషేకించిన తర్వాత ఆ కుమారుడు భక్తితో శివునకు పార్వతికి, అగ్నికి, ఆరుగురు కృత్తికలకు బ్రహ్మకు తలవంచి ప్రణామాలు చేసి యిలా అన్నాడు. ''ఓ దేవతలారా! మీకు నమస్సులు ఓ తపోధనులారా! మీకు ప్రణామాలు. మీ అందరి అనుగ్రహ ప్రసాదాలతో నేనా శత్రువులను మహిష తారకులను జయించెదను. శిశువు నగుటచే మీతో మాటాడుట నాకు తెలియదు. విరించితో కలిసి మీరందరూ నాకనుజ్ఞ నొసగుడు. అలా మాటడిన కుమారునివచనాలు…
నారదుడిట్లనియె :-
ఓ మహర్షీ ! ఆ రాక్షసులు తమలో తాము చర్చించుకొనుచుండగా ఆ దైత్యేశురుని బాణాలతో కొట్టి చీల్చిన వారెవరు? అందులకు పులస్త్యుడిట్లనెను. నారదా! రఘువంశములో రిపుజిత్త (శతృఘ్ను)ను రాజు ఉండేవాడు. అతనికి ఋతధ్వజుడనే తనయుడు కలడు. ఆ ఋతధ్వజుడు సర్వసద్గుణాల నిధి మహాత్ముడు, శూరుడు బలవంతుడు శత్రుసైన్యమర్దనుడు. బ్రాహ్మణుల నేత్రహీనులు దీన దరిద్రుల పట్లనూ స్నేహితుల యెడనూ సమదృష్టి గలవాడు. ఆ రాజ కుమారుడు గాలవ ఋషికోసంగాను జవాశ్వం మీదనెక్కి అర్దచంద్రబాణంతో దుష్టుడైన పాతాళ…