జ్యోతిశ్చక్రంలో వర్ణింపబడే నక్షత్రాలు, వాటి దేవతలు, శుభాశుభ యోగాలు, ముహూర్తాల వర్ణన
ముందుగా నక్షత్రాలకుండే దేవతల పేర్లను తెలుసుకుందాం.
కృత్తిక - అగ్ని
రోహిణి - బ్రహ్మ
మృగశిర - చంద్రుడు
ఆర్ద్ర - రుద్రుడు
పునర్వసు - ఆదిత్య
పుష్య - తిష్యుడు
ఆశ్లేష - సర్పుడు
మాఘ - పితృ గణాలు
పూర్వాఫల్గుని - భగుడు
ఉత్తరఫల్గుని - ఆర్యముడు
హస్త - సవిత
చిత్ర - త్వష్ట
స్వాతి - వాయువు…
పాండవ చరిత వర్ణనమ్ : కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనాదులు మరణించారు. ధర్మరాజు రాజ్యాభిషిక్తుడయ్యాడు
అగ్ని ఉవాచ
ఓద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుండగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమము నుండి మరియొక ఆశ్రమమున సంచరించుచుండిరి. విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసికొని, ధర్మ రక్షణము…
బుద్ధ కల్కి అవతార వర్ణన
అగ్ని ఉవాచ
బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు…
గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం
(ఈ పురాణంలో నీయబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం, వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తరీ మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడంలేదు. ఇందులో కేతుదశ కూడాకనబడుటలేదు) మహేశాదులారా! ఇపుడు గ్రహాల మహాదశలను వర్ణిస్తాను. సూర్యుని దశ ఆరేళ్ళు, చంద్రునిది పదిహేను, మంగళునిది ఎనిమిది,…
సృష్టివర్ణనం
ఇపుడు విష్ణువుయొక్క జగత్ సృష్టిలో మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆదియైనవాడు ఆతడు, గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ. ప్రారంభమున సద్రూపమైన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బాహ్య ) ప్రకృతి, పురుషు…
గ్రహాల శుభాశుభ స్థానాలు తదనుసారంగా శుభా శుభఫలాల సంక్షిప్త వివేచన
మహేశాదులారా! ఒక జాతకుని ఏడవ ఇంట్లో ఉపచయంలో వుండే చంద్రుడు. మంగళకారి అవుతాడు. శుక్ల విదియనాడూ, పంచమ, నవమ గృహాల్లో వుండే చంద్రుడు ఆ జాతక చక్రమున్న వానిని గురువు వలె పూజ్యుని, గౌరవ్యుని చేస్తాడు. …
స్వాయంభువ వంశ వర్ణనము
స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃవాలినియగు శతరూపయను సుందరి యగు కుమార్తెను జనింపచేసెను. ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తముడను పుత్రుడును, సునీతయందు ధ్రువుడను పుత్రుడును జనించిరి. ఓ మునీ ! ధ్రువుడు, కీర్తికొరకై, మూడు…
లగ్నఫలాలు, రాశుల చర-స్థిరాది భేదాలు గ్రహాల స్వభావాల, ఏడు వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్తకార్యాలు
ఈశ్వరాదులారా! సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాశులలో వుంటాడు. ఆయన దినంలో క్రమంగా ఆరురాశులను దాటుకొని పోయి రాత్రిలో కూడా ఆరురాశులను దాటి వస్తాడు. మేషలగ్నంలో పుట్టిన ఆడది గొడ్రాలు అవుతుంది. వృషభలగ్నంలోనైతే కామిని, మిథున…
సాముద్రిక శాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు, మస్తక, హస్త రేఖలాధారంగా వ్యక్తుల ఆయుః పరిజ్ఞానం
మహేశా! ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి, చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను. అరికాళ్ళు, అరిచేతులు కోమలంగా, మాంసపుష్టితో, రక్తవర్ణంలో వుండి, పాదాలు, చేతులు ఎత్తుగా, చెమట పట్టకుండా, రక్తనాళాలూ,…
కశ్యప వంశ వర్ణనము
ఓ మునీశ్వరుడా! అపుడు కశ్యపునకు అదిత్యాదులయందు పుట్టిన సంతానమును గూర్చి చెప్పెదను. చాక్షుష మన్వంతరమునందు తుషితదేవతలుగా ఉన్నవారే మరల వైవస్వతమన్వంతరమునందు - విష్ణువు, శక్రుడు, త్వష్ట, ధాత అర్యముడు, పూష, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, భగుడు, అంశువు అను ద్వాదశాదిత్యులుగా అదితి యందు కశ్యపునకు జనించిరి. అరిష్టనేమి భార్యలకు పదునారుగురు పుత్రులు జనించిరి. …
పునః జగత్సర్గ వర్ణనము
మొదటిది మహత్తు యొక్క సృష్టి అది బ్రహ్మ యొక్క సృష్టిగా తెలియదగినది. తన్మాత్రల సృష్టి రెండవది. అది భూత సర్గము (సృష్టి) అని చెప్ప బడును. మూడవసృష్టి వైకారికము. అదియే ఐంద్రియిక సృష్టి యని చెప్పబడుచున్నది. ఈ విధముగా బుద్ధి(మహతత్త్వము)తో ప్రారంభించిన సృష్టి ప్రాకృత సృష్టి. …
స్త్రీల శుభాశుభ లక్షణాలు
మెడ మీద రేఖ ఉండి, కనుకొలుకులలో ఎరుపు జీర గల స్త్రీ ఏ యింటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే వుంటుంది. లలాటంపై త్రిశూలరేఖ ఉన్న లలన వేలాదిమంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడికనులు, అదే శరీరవర్ణము, తెల్లనై సమముగానున్న దంతాలు…