వర్ణాశ్రమ ధర్మాలు
వర్ణమంటే కులం కాదు. నాడు పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికీ నేడు కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్న కులానికీ పోలిక లేదు. ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడినా అది హస్తిమశకాంతరమే. వర్ణమనగా వృత్తి. అంతే. అనువాదకుడు వృత్తులను బట్టి ఆర్యావర్తంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర…
శనిగ్రహ జననం రెండవ భాగము
భర్తకు చెప్పిన విధంగా సంజ్ఞ పుట్టినింటికి వెళ్ళలేదు. వెళ్ళే ఆలోచన లేదామెకు. ఆరణ్యం వైపు నడుస్తోంది. సంజ్ఞ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ. భర్తకు చెప్పిందిగానీ , చెప్పిన విధంగా మారిపోయి , ఆయన అతి ప్రకాశాన్నీ , అత్యుష్టాన్నీ భరించడానికి సిద్ధమైపోయి , ఆయనను తిరిగి చేరడం సంభవం…
శనిగ్రహ జననం మూడవ భాగము
"ఛాయా ! నువ్వు నా ప్రతిబింబమన్న సంగతి భవిష్యత్తులో బైటపడకుండా ఉండాలంటే , మనకు సంబంధించిన - అంటే నాకు సంబంధించిన విషయాలు అన్నీ నీకు తెలియాలి. తెలియడమే కాకుండా ఆ విషయాలు నీకు హృదయగతం కావాలి ! రక్తగతం కావాలి !” అంది సంజ్ఞ. …
శ్రీరామావతార వర్ణనము
అగ్ని ఉవాచ :-
దేనిని పఠించినచో భుక్తియు ముక్తియు లభించునో అట్టి రామాయణమును, నారదుడు వాల్మీకికి చెప్పన విధమున చెప్పెదను. విష్ణువు నాభియందలి పద్మమునుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి…
నిత్యకర్మలు - అశౌచాలు
శాస్త్రవిహితమైన ప్రతి దినకర్మలను శ్రద్ధగా చేయువారికి దివ్యజ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడూ బ్రాహ్మీ ముహూర్తంలోనే మేలుకొని ధర్మార్థ చింతన చేయాలి. విద్వాంసుడైన పురుషుడు ఉషఃకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయ కమలం లోనే నెలకొనియున్న ఆనంద స్వరూపి, అజరామరుడు, సనాతన…
అయోధ్యా కాండ వర్ణనము
భరతుడు మాతుల గృహమునకు వెళ్ళిన పిమ్మట రాముడు తండ్రి మొదలగు వారిని భక్తితో సేవించెను.దశరథ మహారాజు రామునితో ఇట్లనెను “రామా! వినుము”. “నీ గుణములందు ప్రేమచే ప్రజలు నిన్ను ఇంతకు పూర్వమే, మనసా రాజ్యాభిషిక్తుని చేసినారు. నేను రేపు ప్రాతఃకాలమున…
దానధర్మం - దేవతోపాసన
సత్పాత్రులకు శ్రద్ధా పూర్వకంగా సంతోషంగా వినియోగానికై ఇచ్చే ద్రవ్యం కర్త చేయు దానమనబడుతుంది. ఈ దానం ''ఇక్కడ'' సుఖభోగాలనూ ''అక్కడ'' మోక్షాన్నీ కర్తకు సంపాదించి పెడుతుంది. అయితే, ఎవరైనా, న్యాయపూర్వకంగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం వుంటుంది. అధ్యాపనం(చదువు…
శనిగ్రహ జననం నాల్గవ భాగము
సూర్యుడు లేని సమయం చూసుకుని , నారదుడు మందిరంలోకి వెళ్ళి ఛాయను కలుసుకున్నాడు. "నేను నారదుణ్ణి ! నిన్ను చూస్తుంటే సాక్షాత్తుగా ఆ సంజ్ఞాదేవిని చూస్తున్నట్టే ఉంది. ఛాయాదేవీ !" …
శనిగ్రహ జననం ఐదవ భాగము
ఛాయ అడుగులో అడుగు వేసుకుంటూ , సూర్యుడి వద్దకు నడిచింది. సూర్యుడు ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. గర్భ భారం ఆమెలో అలసత్వాన్ని పెంచింది. వేగాన్ని తగ్గించింది. "గర్భం నీ దేహకాంతిని ద్విగుణీకృతం చేసింది సంజ్ఞా !" ఆమెను చూస్తూ అన్నాడు సూర్యుడు. శరీరాన్ని మెప్పుగా చూస్తూ అన్నాడు సూర్యుడు. …
ప్రాయశ్చిత్తాలు
బ్రాహ్మణుని చంపుట (బ్రహ్మహత్య) , తాగుబోతూ, దొంతనం, గురుపత్నితో రమించు, ఈ నాలుగు రకాలవారూ మహాపాతకులు. వీరితో స్నేహం చేసి రాసుకు పూసుకు తిరిగేవాడు అయిదో రకం మహాపాపి. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. వీరికి ఈ పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసిన కర్మకాండయే ప్రాయశ్చిత్తం. బ్రహ్మహత్య చేసినవాడు…
అరణ్య కాండ వర్ణనము
శ్రీ రాముడు వసిష్ఠునికి , తల్లులకు నమస్కరించి వారిని తిరిగి పంపి వేసి చిత్రకూటము నుండి బయలుదేరి దండకారణ్యము వైపు వెళ్ళుచు మార్గ మధ్యమున అత్రి మహామునిని, ఆతని భార్యయైన అనసూయను, శరభంగుని, సుతీక్ష్ణుని, అగస్త్యభ్రాతను, అగస్త్యుని చూచి నమస్కరించెను. ఆగస్త్యునిఅనుగ్రహము వలన ధనస్సును, ఖడ్గమునుపొంది, దండకారణ్యము చేరెను. జన స్థానమునందు గోదావరీ తీరమున,…
రాహుగ్రహ జననం
కశ్యప పత్నులు - అదితీ , దితి , దనూ , వినత , కద్రువ , సింహిక , కాల మొదలైన వాళ్ళు ఆశ్రమంలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు. "మనందరం తల్లులమయ్యాం కానీ , సింహిక మాత్రం ఇంకా మాతృత్వానికి నోచుకోలేదు !" అంది దను.…