గుణసర్జన కథనము
అన్ని భూతతత్త్వముల కంటె ఉత్తమమగు తత్త్వమును అన్ని ధర్మములకంటె మేలగు ధర్మమును మాకు తెలుపుమని మునులు వ్యాసునడిగిరి. అతిప్రాచీనమును ఋషులును మెచ్చినదియు అన్ని ధర్మములకంటె శ్రేష్ఠమును అగు ధర్మము తెలిపెదము వినుడు. ఇంద్రియములు జీవుని కలవరపరచునవి. కనుక బుద్ధితో వాటిని బాలురను…
పంచతత్వార్చన - విధి
'హే పరమాత్మా! తెలుసుకున్నంత మాత్రాననే సాధకునికి పరమపదాన్ని ప్రాప్తింప చేసే సారతత్త్వంలో భాగమైన పంచతత్వార్చన ఒకటున్నదని విన్నాను. మాపై దయ వుంచి దానిని ఉపదేశించండి' అని కోరాడు శివుడు. లోక కల్యాణం కోసం శంకరభగవానుని ఆరాటాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు ఆనందభరితుడై ఇలా చెప్పసాగాడు. …
సాంఖ్యవిధి నిరూపణము
మునులు వ్యాసునితో ఇట్లనిరి:- ఓ విప్రేంద్రా! శిష్టమ్మతమగు యోగమార్గ ప్రక్రియను తాము యుక్తియుక్తమగు శిష్యులగు మాకు హితముగా ప్రతిపాదించితిరి. లోకత్రయము నందును ప్రసిద్ధిపొందియున్న సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన శాస్త్రతత్త్వమును దానియందు సిద్ధిని పొందగోరిన వారు పాటించవలసిన ధర్మమును ఉన్నది ఉన్నట్లుగా మాకు ప్రవచింపగోరుచున్నాము. ఓమునులురా! వినుడు. అత్మతత్త్వమునెఱిగిన వారును…
వసిష్టకరాల జనక సంవాదే క్షరాక్షరవిచార నిరూపణమ్
క్షరాక్షర తత్త్వ విమర్శము
మునులు వ్యాసునితో ఇట్లనిరి: అక్షరతత్త్వమును చేరినవారు సంసారమున మరల అవృత్తిని పొందరు. క్షరతత్త్వమును చేరినవారు మరల సంసారమున అవృత్తులగుదురు. అని తెలిపితిరి. ఈ రెండు తత్త్వములను వివేచించి తెలుప ప్రార్థింతుము. వేద తత్త్వజ్ఞులును మహాభాగులు నగు ఋషులును మహాత్ములగు యతులును నీవు జ్ఞానవేత్తలలో శ్రేష్టుడవని ప్రశంసించుచున్నారు. ఇట్టి మీనుండి…
బుధగ్రహ జననం రెండవ భాగము
చంద్రుడు మంత్ర ముగ్ధుడిలా తార మొహంలోకి చూశాడు. అక్కణ్నుంచి చూపుల్ని కిందికి మళ్ళించకుండా ఉండడానికి విశ్వప్రయత్నం చేసి , ఓడిపోయాడు... "చంద్రా !" తార హెచ్చరించింది. చంద్రుడు అసంకల్పితంగా లేచి ,…
సుదర్శన చక్ర పూజ విధి
సూతుడు శౌనకాది మహామునులకు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడని చెప్పసాగాడు. "ఓ శంఖ గదాధరా! గ్రహదోషాలూ, రోగాదులూ, సర్వకష్టాలూ వినష్టము అవ్వాలంటే ఏ పూజను చేయాలి?" "పరమశివా! నీవడిగిన దానికి సమాధానం సుదర్శన పూజ. ఈ పూజకి…
వసిష్ఠజనక సంవాదము
వసిష్ఠుడు జనకునితో నిట్లు పలికెను : ఈ చెప్పిన విధముగా ఆ అక్షరతత్త్వము జ్ఞాన్వరూపుడయియు అప్రతి బుద్ద - అజ్ఞాన సహిత - రూపుడై అప్రతిబుద్దులగు మనవంటివారి ననువర్తించుచున్నది. దేహము నుండి మఱియొక దేహములో ప్రవేశించుచు వేలకొలది జన్మలను పొందుచున్నది. వేలకొలది తిర్యగ్యోనులందును దేవతలయందును తపోవంతుడై మహాసద్గుణయుక్తుడుగా గుణక్షయముచే మనుష్యుడుగా జన్మించి పుణ్యవశమున స్వర్గమునకు పోవును. మనుష్య లోకమునకు వచ్చును. పాపముచే నరకమునకును…
విద్యా విద్య-క్షరాక్షర-బుద్ధత్వా ప్రతిబుద్ధత్వ ప్రతిపాదనము
వసిష్ఠ మహర్షి జనకునితో ఇట్లు పలికెను: - ఓనృపసత్తమా! ఇంతవరకును నీకు సాంఖ్య దర్శనమును తెలిపితిని. ఇకమీద విద్యా೭విద్యల తత్త్వమును క్రమానుసారము తెలిపెదను. ఎఱుగుము. సృష్టిప్రళయములు జననమరణములు ధర్మములుగానుండి సంసారచక్రమునందు సంసరించువాడు అవ్యక్తతత్త్వమును వివేచించి తెలిసికొనజాలడు. ఒకదాని కంటె మఱియొకటి ఉత్తరోత్తరము విద్యారూపము అయినది. పైదానికంటెముంద ఱిది అవిద్యారూపమయినది. విద్య-అవిద్య అనుభేదము రెండు- స్థూల-స్థూలతరతత్త్వ ములనడుమనుండెడి యోగ్యతాభేదముచే చేయు నిర్ణయము. ఇదిసాంఖ్యతత్త్వ వేత్తలు వివేచించి…
బుధగ్రహ జననం మూడవ భాగము
విద్యార్థులు కళ్ళు మూసుకుని వేదసూక్తాన్ని వల్లెవేస్తున్నారు. బృహస్పతి అరమోడ్పు కళ్ళతో ఏకాగ్రతగా ఆలకిస్తున్నాడు. చంద్రుడు కళ్ళు మూసుకోలేదు. వల్లె వేయడం లేదు. ఆలకించడమూ లేదు. అతని చూపులు ఆశ్రమ వాతాయనం మీదే ఉన్నాయి. వాతాయనం ముందు వయ్యారంగా నిలుచుని , తన వైపే చూస్తున్న తార మీదే…
హయగ్రీవ పూజనావిధి
సూతుడు శౌనకాది మహామునులకు విష్ణువు శివునికీ ఇతర దేవతలకూ ఉపదేశించిన హయగ్రీవ పూజను ఇలా వినిపించసాగాడు. "హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమ పుణ్యాశాలి, సకల విద్యలనూ ప్రసాదించేది. ఓంకార యుక్తం. అది ఇది …
వసిష్ఠ జనక సంవాదోప సంహారము
ఆ ప్రబుద్ధావస్థలో నుండు జీవుడు అవగక్తమును నిర్గణమునునగు ఇరువదియైదవ తత్త్వమును కూడ సగుణతత్త్వముగా భావించును. ఆతత్త్వమునందు ఆరోపింపబడు గుణము లను సృజించుచు ఉపసంహరించుచు ఉన్నట్లు కల్పనచేసికోనును. ఓజనకరాజా! ఆమూల తత్త్వము అజము జన్మరహితము ఐనను క్రీడార్థమై వికారములను పొందుచున్నాడు. తన్నుతాను అనేక తత్త్వముల రూపమున కల్పించుకొని నానా రూపముల నొందినవాడువలె చెప్పబడుచున్నాడు. ఇట్లు వికృతి నొందుచుండియు ఇట్లని వాస్తవ స్థితిని ఎరుగలేకున్నాడు.…
బ్రహ్మపురాణ ప్రశంస - ఫలశ్రుతి
రోమహర్షణుడు మునులతో ఇట్లు పలికెను.ఓ బ్రాహ్మణులారా! పూర్వము మహామతియగు వ్యాసమహాముని శాస్త్రమునందు చెప్పబడినవియు ఉచ్చారణమునకు సంబంధించినవియు అగు పదునెనిమిది దోషముమలు (ఇవి వ్యాకరణ భాష్యమునందు చెప్పబడియున్నవి.) లేనివియు మిగుల సారభూతములును దోషములు లేనివియు శుద్ధములును అనేక శాస్త్రసముదాయరూపములును అయిన వాక్యములతో నిండినదియు స్వభావముచేతనే శుద్ధమగు విషయసమాయోజనముతో కూడినదియు సాధువులగు వ్యాకరణ విరుద్ధములను శిష్టులకు అసమ్మతములునుకాని శబ్దములతో…