Skip to content Skip to sidebar Skip to footer

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ఇరవై ఐదవ భాగము

భవిష్య కథనము ఓ వ్యాసమహామునీ! ప్రళయకాలము దగ్గరలో నున్నదో దూరములోనున్నదో మాకు తెలియదు. కనుక ఎప్పుడు ద్వాపరయుగము అంతమై కలియుగము ఆరంభమగునో ప్రళయము ఎప్పుడు వచ్చునో గుర్తించు విధము తెలిసికొన గోరి ఇటకు వచ్చితిమి. అల్పమగు ధర్మానుష్ఠానముతోనే అధికమగు ధర్మఫలము లభించు విధమును ధర్మము నాశము నొందుటచే మహాభయంకరమగు ప్రళయసమయమును గుర్తించు విధమును ఓ మునీ! మాకు తెలుపుము. …

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఐదవ అధ్యాయం

శుక్రగ్రహ జననం త్రిమూర్తుల సన్నిధిలో పులోమ పుత్రుడి నామకరణోత్సవం జరిగింది. బాలునికి ''ఉశనుడు'' అని నామకరణం చేశాడు భృగుమహర్షి. "కుమారా ! నీ కుమారుడు కారణజన్ముడు ! దైవికమైన ఆ కారణమే - తనకు ఎలాంటి పుత్రుడు కావాలో నీ అర్ధాంగి పులోమ నోట పలికించింది !" బ్రహ్మ అన్నాడు. భృగుడితో. …

Read More

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – పదిహేడవ అధ్యాయం

త్రిపురదేవి గణేశాదుల పూజ ఋషులారా! ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికీ, మూర్తికీ పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి. ఓం గాం హృదయాయ నమః, …

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఆరవ అధ్యాయం

శుక్రగ్రహ జననం మూడవ భాగము ''బుద్ధికి బృహస్పతి''అనే మాటను త్వరలో మనం వింటాం ! అసాధారణ జ్ఞానం అతగాడి సొంతం సుమా !" నారదుడు అన్నాడు." “ఊ... చూస్తుంటే - ఆ బృహస్పతిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్లు తోస్తోంది. నారదా !" వృషపర్వుడు వాలుగా చూస్తూ అన్నాడు. “నారాయణ ! పసిగట్టడంలో ఎవరైనా మీ అసురుల…

Read More

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 నూట ఇరవై ఏడవ భాగము

నైమిత్తిక ప్రాకృత ప్రళయకథనము వ్యాసుడిట్లు మునులతో పలికెను: - ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ ప్రళయ మేఘములు వర్షించుటచే కలిగిన జలము సప్తమహర్షులుండు స్థానము వరకు వ్యాపింపగా ఈ త్రైలోక్యమంతయు ఏక సముద్రమగును. విష్ణువంతట తన నిట్టూర్పు వాయువుతోనే నూరేండ్లకు పైబడిన కాలవ్యవధిలో నశింపజేయును. సర్వ భూతమయుడును ఊహింపనలవి కానివాడు భూతములనన్నిటిని సృష్టించువాడు అదిలేకయు లోకమునకు అదియగు విష్ణుభగవానుడు వాయువునంతటిని పూర్తిగా పీల్చివేసి బ్రహ్మరూపమును ధరించి ఆఏకార్ణవమున శేషశయ్యపై…

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఏడవ అధ్యాయం

శుక్రగ్రహ జననం నాల్గవ భాగం వృషపర్వుడు అన్నట్టే మహా వైభవంగా ఉశనుడి స్వీకారం జరిగింది. అసుర బాలకుల విద్యా బోధనకూ , రాజసభలో మంత్రాలోచనకూ ఉశనుడు ఆరోజే నాందీ ప్రస్తావన పలికాడు. దేవతల పట్ల అసూయ అంతస్సూత్రంగా సాగుతున్న ఉశనుడి విద్యాబోధన అసురలందరికీ మహదానందాన్ని కలిగిస్తోంది. …

Read More

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ఇరవై ఎనిమిదవ భాగము

ఆత్యన్తికలయ నిరూపణము ఓ విప్రులారా! వివేకియగు జీవుడు ఆధ్యాత్మికములు - ఆధిభౌతికము - ఆధి దైవికములు అను మూడు విధములగు తాపమువలని దుఃఖమును దోషమును గుర్తెరిగి వైరాగ్యముతో జ్ఞానము సంపాదించుటచే ఆత్యంతికలయమును - మోక్షమును పొందును. వీనిలో ఆధ్యాత్మిక తాపము దైహికము మానసికము అని రెండు విధములు. శిరోరోగము- ప్రతిశ్యాయము - జ్వరము -శూలవ్యాధి -భగందరము - గుల్మము-ఆర్శస్సు -శ్వయథువు - శ్వాసవ్యాధి - ఛర్ది -అక్షిరోగములు-…

Read More

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ఇరవై తొమ్మిదవ భాగము

యోగాధ్యాయము సంసార దుఃఖనివారణౌషధమగు యోగమును తాము తెలిపినచో దానియందు పురుషోత్తముడగు అవ్యయుడగు విష్ణుని అనునంధానము చేయుదుము. అని మహర్షులు కోరగా యోగవేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసుడు మిగుల సంతోషముతో యోగ ప్రకారమును ఇట్లు చెప్పనారంభించెను. ఓ విప్రులారా! సంసారనాశకమగు యోగమును తెలిపెదను. దానినభ్యసించి యోగియైనవాడు పరమదుర్లభమగు మోక్షమును పొందగలుగును. మొదట…

Read More

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – పద్దెనిమిదవ అధ్యాయం

విషదూకర మంత్రం ఋషులారా! ఇపుడు మీకు సర్పాది విషజంతువుల వల్ల కలిగే కష్టాలను తొలగించే మంత్రాన్నుపదేశిస్తాను వినండి. 'ఓం కణిచికీణి కక్వాణీ చర్వాణీ భూతహరిణి ఫణి విషిణి విరథ నారాయణి ఉమే దహదహ హస్తే చండేరౌద్రే మాహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి శుకముండే శత్రుం హనహన సర్వనాశిని స్వేదయ సర్వాంగశోణితం తన్నిరీక్షసి మనసాదేవి సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య హృదయే జాతా రుద్రస్య హృదయే…

Read More

🌹🌹🌹 శ్రీ బ్రహ్మ పురాణం 🌹🌹🌹 – నూట ముప్పై ఒకటవ భాగము

విద్యా - కర్మ - గతివివేచనము వేదవిధి ననుసరించి కర్మల నాచరించవలెననియు కర్మలను విడువవలెననియు మీరు చెప్పుచున్నారు. ఇది పరస్పరము విరుద్ధముగా నున్నది. కావున కర్మల నాచరించినచో ఏగతి కలుగునో వానిని విడిచి విద్యను, జ్ఞానమును ఆశ్రయించినచో ఏగతి కలుగునో విన కుతూహలముగుచున్నది. తెలుపుడు. అని మునులు వ్యాసునడిగిరి. మునిశ్రేష్టులారా! మీరడిగినది చెప్పెదను. కర్మ…

Read More

🌹🌹🌹 గరుడ పురాణం 🌹🌹🌹 – పందొమ్మిదవ అధ్యాయం

శ్రీ గోపాలదేవుని పూజ - శ్రీధర పూజ త్రైలోక్యమోహన మంత్రం ఋషులారా! నేనిపుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొఱకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలనూ, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలనూ పూజించాలి. …

Read More

🌹🌹🌹 నవగ్రహ పురాణం 🌹🌹🌹 – ముప్పై ఎనిమిదవ అధ్యాయం

బుధగ్రహ జననం మొదటి భాగము ఆశ్రమంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వరుసలుగా కూర్చున్న విద్యార్థులు. వేదమంత్రాలను వల్లె వేస్తున్నారు. వాళ్ళపైన చెట్ల రెమ్మల్లో దాక్కున్న చిలుకలు వాళ్ళను అనుకరిస్తూ మంత్రాలు పలుకుతున్నాయి. ఆగకుండా వినవస్తున్న పక్షుల కిలకిలరావాలూ , అప్పుడప్పుడు వినవచ్చే నెమళ్ల అరుపులూ ఆశ్రమ వాతావరణానికి…

Read More