గురుగ్రహ జననం రెండవ భాగము
అంగిరసుడూ , శ్రద్ధా ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. శ్రద్ధ ఆనందావేశాలతో పసికందును ముద్దులతో నింపేసింది. "మా జన్మలు ధన్యమైనాయి ! దేవదేవులకు మా ధన్యవాద పూర్వక ప్రణామాలు అందజేయి , నారదా !" అంగిరసుడు అన్నాడు. …
విష్ణుధ్యానం - సూర్యార్చన
"జ్ఞానరూపుడు, అనంతుడు సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడునగు హరియే సర్వ దుఃఖాలనూ హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ. సంపూర్ణ సంసారానికి మూలకారణం, సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే సంపూర్ణ జగత్తుకు ఆధారం అయనే అయినా, స్వయంగా నిరాధారుడు. పరమాత్మ ప్రాపంచిక ఆసక్తులకు అతీతుడు, నిర్ముక్తుడు.…
విష్ణుధ్యానం - సూర్యార్చన
"శంఖ చక్రగదాధారీ! భగవాన్ శ్రీహరీ! మేమంతా దేవదేవేశ్వరుడు, శుద్ధ రూపుడు, పరమాత్మయగు విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొందియున్నాము. విష్ణు సహస్రనామాలను విని పరమానందభరితులమైనాము విష్ణుధ్యాన వర్ణనను విని ధన్యులము కాగోరుచున్నాము". అన్నాడు కాలకంఠుడు. చెప్పసాగాడు ఖగవాహనుడు. …
గురుగ్రహ జననం మూడవ భాగము
"ఆ సుముహూర్తాన్ని - మాకు కూడా పితృసమానులైన అంగిరస మహర్షులు నిర్ణయిస్తారు !" ఇంద్రుడు సవినయంగా అన్నాడు. అంగిరసుడు నిర్ణయించిన శుభముహూర్తాన దేవసభలో బృహస్పతి దేవగురువుగా అభిషిక్తుడయ్యాడు. అత్యంత సుందరంగా నిర్మించబడిన ఆశ్రమ ప్రాంగణంలో విద్యార్థులకు బృహస్పతి విద్యాబోధన ప్రారంభమైంది. ఆశ్రమంలో వాసం చేస్తూ అవసరమైనప్పుడల్లా దేవసభకు వెళ్లి అక్కడ తన విధుల్ని…
విష్ణుభక్తి హేతు కథనము
వ్రజాగరము చేసి విష్ణుమహిమ గానము చేసి చాండాలుడును ముక్తిని పొందిన విషయము వింటిమి. మహామతి శాలివగు ఓ వ్యాసమహర్షీ ! ఏ తపస్సుచే ఏ కర్మ నాచరించుటచే విష్ణువునందు భక్తికలుగునో ఆ ఉపాయమును మాకు తెలుపుము. వినగోరుచున్నాము. అనిమునులు అడిగిరి. ఓ…
మృత్యుంజయ మంత్ర జప మహిమ
సూతమహర్షి శౌనకాదులకు ప్రసాదిస్తున్న ప్రవచనం ఇలా కొనసాగింది. "మునులారా! గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఉపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి. ఇవి సాధకుని గొప్పగా ఉద్దరిస్తాయి. పుణ్యప్రదానం చేస్తాయి. ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ వున్నదని విజ్ఞులు చెప్తారు. …
వ్యాసముని సంవాదే మహాప్రళయ వర్ణనము
ఓ వ్యాసా ! ఎఱుగ శక్యము కాని విష్ణుమాయా తత్త్వము నీవలన వింటిమి. కల్పాంతమున జరుగు మహాప్రళయమున సృష్ట్యువ సంహారమును వినగోరుచున్నాము. అని మునులు వ్యాసునడిగిరి. ప్రాకృత ప్రళయమున సృష్ట్యుప సంహారము జరుగు విధము వినుడు. మానవుల మాసము పితరులకునను నంవత్సరము దేవతలకును ఒక…
ప్రాణేశ్వరీ విద్య (సర్ప విష, దుష్ట ఉపద్రవ హారం)
సూత మహర్షి అనుగ్రహ భాషణం నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది. "ఋషులారా! ఇపుడు మీకు పరమ శివుని ద్వారా గరుత్మంతుని కుపదేశింపడిన ప్రాణేశ్వర మహా మంత్రాన్ని విన్నవిస్తాను. ఐతే, దానికి ముందు ఏయే స్థానాల్లో, సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం. …
గురుగ్రహ జననం నాల్గవ భాగం
తారా బృహస్పతుల దాంపత్య జీవితం ప్రారంభమైంది. నిర్వికల్పానంద నవగ్రహ పురాణం కథనం కొనసాగిస్తూ ఇలా అన్నాడు. "గురు గ్రహం అనబడే బృహస్పతి జన్మ వృత్తాంతం ఆలకించారు. ఆ బృహస్పతికి సమకాలికుడూ , సముడూ అయిన…
శుక్రగ్రహ జననం మొదటి భాగము
భృగుమహర్షి ఆశ్రమ ప్రాంగణంలో చెట్టు నీడలో అరుగు మీద కూర్చుని , ప్రాతఃకాల అనుష్టానం పూర్తి చేశాడు. అది గమనించిన పులోమ ఆయన దగ్గరగా వచ్చింది. "చూశావా , నీ కొడుకులు మనం చెప్పకుండానే దర్భలూ , సమిధలూ సేకరించడానికి వెళ్తున్నారు !” ఆశ్రమం…
సృష్ట్యుపసంహార లక్షణము
సర్వభూతములకును జరుగు ప్రతిసంచరము. అనగా ప్రళయము మూడు విధములు. 1. నైమిత్తికము, 2. ప్రాకృతికము 3. అత్యంతికము. వానిలో 1. బ్రహ్మదేవుని ఆయుఃకాలము సమాప్తికాగా కల్పాంతమున జరుగు ప్రళయము నైమిత్తికము. 2. జీవునకుమోక్షము లభించుటయే అత్యంతిక ప్రళయము. 3. రెండుపరార్ధముల కొకసారి జరుగునది ప్రాకృతప్రళయము. అని వ్యాసుడు పలికెను. …
పంచవక్త్ర పూజనం - శివార్చన విధి
ఋషులారా! ఇపుడు పంచముఖ శివుని పూజా విధానాన్ని విన్నవిస్తాను. ఇది సాధకునికి భుక్తినీ ముక్తినీ ప్రసాదిస్తుంది. ముందుగా ఈ క్రింది మంత్రంతో పరమాత్మను ఆవాహనం చేయాలి.
'ఓం భూర్విష్ణవే ఆది భూతాయ సర్వాధారయ మూర్తయే స్వాహా'
తరువాత సద్యోజాత విశేషణధారియైన…