చంద్రగ్రహ జననం చివరి భాగము
"గురువుగారూ ! చంద్రుడి జననం గురించి చక్కగా చెప్పారు. పతివ్రత అయిన శీలవతి జీవితం బాగుపడింది. అనసూయకు సంతానం కలిగింది. ఆ రెండు మార్పులకు మూలం మాండవ్య మహర్షి శాపం ! శూలానికి గుచ్చబడిన ఆ మాండవ్య మహర్షి ఏమయ్యాడో మీరు చెప్పడం మరిచిపోయారు !" చిదానందుడు గురువు నిర్వికల్పానందతో అన్నాడు. …
ధర్మ నిరూపణము
పార్వతి ఇట్లు పలికెను.
సర్వప్రాణులకు ఈశుడవును దేవతలచేతను రాక్షసులచేతను నమస్కరింపబడు ఓ భగవాన్ ! శివా! మానవుల ధర్మాధర్మములను నాకు తెలిపి సంశయము తీర్చుము. మానవులు మానసికములు వాచికములు శారీరకములు అగు ఏ త్రివిధ కర్మ బంధములచే బంధింపబడుదురు? ఎట్లు విడుదల పొందుదురు? ఓదేవా ! ఏ శీలముచే ఎటువంటి కర్మచే ఏ ఆచరణములచే గుణములచే వారు స్వర్గము పోందుదురు?…
పూజానుక్రమ - నిరూపణం
రుద్రదేవా! ఏ పూజకైనా ఒక క్రమ విధానముంటుంది. దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తరువాత యం రం వం లం అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడునైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి. …
విష్ణు పంజర స్తోత్రం:
శ్రీహరి ఇంకా ఇలా చెప్పసాగాడు "హే రుద్రదేవా! పరమకల్యాణకారియైన విష్ణు పంజర స్తోత్రాన్ని వచిస్తాను, వినండి.
ప్రవక్ష్యామ్యధునా హ్యేత ద్వైష్ణవం పంజరం శుభం ॥
నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం ॥
ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణాత్వామహం శరణం గతః
గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభ నమోస్తుతే ॥
యామ్యాం రక్షస్వమాం విష్ణోత్వా…
ధర్మ నిరూపణము రెండవ భాగము
పార్వతి ఇట్లు పలికెను.
ఏశీలము ఏఆచరణము కలిగి ఏకర్మము లాచరించి ఏ దానములు చేసి మానవుడు స్వర్గమును పొందును?
మహేశ్వరుడు ఇట్లు పలికెను:-
బ్రాహ్మణులను ఆదరించుచు దీనులు ఆర్తులు బీదలు అగువారికి భక్ష్యములు భోజ్యములు అన్నపానములు వస్త్రములు ఉదారబుద్ధితో దానము చేయవలెను. బాటసారులకు ఆశ్రయములను సభామండపములను కోనేరులను నిర్మించుచు నిత్యనైమిత్తిక కామ్య కర్మలను…
కుజగ్రహ జననం మొదటి భాగము
నిశ్శబ్దం తాండవిస్తున్న కైలాసం నారదుడికి ఆశ్చర్యం కలిగించింది. సతి యోగాగ్నిలో దగ్ధమైనప్పటికీ , ఇతర కైలాసవాసులు ఉండాలి కదా ! కైలాస ప్రాంతంలో సంచరిస్తున్న నారదుడికి ఒక ఏకాంత ప్రదేశంలో తపోదీక్షలో ఉన్న పరమశివుడు కనిపించాడు. తామర పువ్వులాగా ఎర్రబారిన శివుడి శరీరం ఆయన తపస్సు తీక్షణతను కళ్ళకు కట్టుతోంది. …
ముని-మహేశ్వక సంవాదే వాసుదేవ మహి యమర్ణనము
శివప్రోక్తమైన జన్మరాహిత్యోపాయము
ఇట్లు పరమేశ్వరుడు చెప్పిన విషయము అంతయువిని జగన్మాత హర్షమును ప్రీతిని ఆశ్చర్యమును పొందెను. ఆసమయములో శిపుని సమీపమున ఉన్న మునివరులును తీర్థయాత్రా ప్రసంగమున అచటికివచ్చి చేరియున్న ద్విజులును శివుని సంపూజించి నమస్కరించి లోకముల హితమునుకోరి తమకుగల సంశయమును ప్రశ్నించిరి. …
కుజగ్రహ జననం రెండవ భాగము
"నారాయణ ! నారాయణ ! అదృష్టమంటే నాదే ! కోరకుండానే ఈ నారదుడి కోరిక తీరింది ! "మా సహోదరులు అందర్నీ , అన్నింటినీ మూడవ కంటితో చూసి గ్రహిస్తారు. నారదా !" అంది భూదేవి. లక్ష్మి భూదేవి చేతుల్లోంచి బాలుణ్ని అందుకుని , నుదురు మీద ముద్దెట్టుకుంది.…
ధ్యాన యోగవర్ణన
పరమేశ్వరా! భోగాన్నీ మోక్షాన్నీ ఇచ్చే శక్తి యోగానికుంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికీ ధ్యానానికీ గమ్యమైనవాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్త్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా:- నేను విష్ణువును. నేనే అందరికీ ఈశ్వరుడను. నేనే…
గురుగ్రహ జననం మొదటి భాగము
అంగిరసుడు ఆశ్రమ ప్రాంగణంలో కూర్చుని కొడుకు ఉతథ్యుడికి వేదం. నేర్పుతున్నాడు. ఉతథ్యుడు శ్రద్ధాసక్తులతో పాఠం నేర్చుకుంటున్నాడు. తండ్రి అడుగుతున్న ప్రశ్నలకు ఉతథ్యుడు ఆలోచించి , సమాధానాలు చెపుతున్నాడు. సమయానికి నారద మహర్షి వచ్చాడు , ''నారాయణ'' నామ స్మరణం చేస్తూ. …
విష్ణుభక్తులు పొందు ఉత్తమగతిని నిరూపించుట
ఆశ్చర్యకరమును సర్వపాపహరమును పుణ్యకరమును ధన్యత కలిగించునదియు సంసార బంధనాశనమునగు శ్రీకృష్ణ మహాత్మ్యమును మేము వింటిమి. చాలా సంతోషమయినది. ఓ మహామునీ! మానవులు వాసుదేవుని అర్చించుటయందు ఆసక్తులై భక్తితో విధివిధానమున అతని నర్చించువారు ఏగతిని పొందుదురు? స్వర్గమునా? మోక్షమునా? రెంటినా? మా ఈ సంశయమును ఛేదించుము. ఓమునిశ్రేష్ఠా! అందులకు…
రాత్రిప్రజాగరముతో విష్ణుమహిమ గానమునకు ఫలము
ఓ వ్యాసముహామునీ! ప్రజాగరము చేసి గీతికాగానము చేయుటవలన కలుగు ఫలమును వినగోరుచున్నాము. అని మునులు అడిగిరి. ఓ మునిశ్రేష్ఠులారా! ప్రజాగరము చేసి విష్ణుమహిమ గానము చేయుట వలన ఫలమును క్రమముతో చెప్పెదను వినుడు. …