చంద్రగ్రహ జననం ఐదవ భాగము
శీలవతి ( సతీ సుమతి ) కథ
మహా పతివ్రత అయిన శీలవతి వాక్కు ఫలించింది. ఘడియలూ , గంటలూ , రోజులూ గడిచిపోతున్నాయి. సూర్యోదయం కానేలేదు. లోకాలు నిరంతర అంధకారంలో మునిగిపోయాయి. నిత్య నైమిత్తిక కర్మలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాణుల దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి. విశ్వచలన వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. నిశాచరులైన రాక్షసులు…
శ్రాద్ద విధివర్ణనము రెండవ భాగము
మునులు శ్రాద్ధకల్పము ఎవరెవరికి ఎప్పుడానతిచ్చిరో సవిస్తరముగ తెల్పుడన వ్యాసభగవానుడిట్లనియె. బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యకులముల వారు తమతమకు చెప్పబడిన విధానమున మంత్రపూర్వకముగా శ్రాద్దము సమష్టింప వలెను. స్త్రీలు మరి శూద్రాదులు బ్రాహ్మణులు చెప్పినట్లు అగ్నిహోత్రము లేకుండా అమంత్రకము శ్రాద్దము పెట్టవలెను. పితృదేవతల నుద్దేశించి శ్రాద్దము పెట్టవలసిను ప్రదేశములు పుష్కరాది తీర్థములు పుణ్యక్షేత్రములు పర్యత శిఖరములు పవిత్రనదులు నదములు సరస్సులు నదీసంగమములు సముద్ర తీరములు…
మానస సృష్టి వర్ణన దక్షప్రజాపతి - సృష్టి విస్తారం
శంకరా! ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస - ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రులవైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే…
సదాచార వర్ణనము
వ్యాసుండిట్లనియె.
ఇట్లు గృహస్థు దేవతలను పితృదేవతలను హవ్యకవ్యములచేతను అతిథులను బంధువులను భూతములను నౌకరులను పశుపక్ష్యాదులను చీమలను బిచ్చగాండ్రను సన్యాసులను యాచకులను బాటసారులను సదాచారవంతులను అన్నాద్యాహారములచే పానీయములచే పూజించి నిత్యములయిన సంధ్యావందనాదులను నైమిత్తికములయిన ఆ యా పర్వాదులందు విహితములైన క్రియలను నిర్వర్తించి తీరవలెను. వీని నతిక్రమించినయెడల పాపమనుభవించును. అన మునులిట్లనిరి. …
వర్ణాశ్రమధర్మవర్ణనము.
మునులడుగ వర్ణ ఆశ్రమ ధర్మములను నాల్గాశ్రమ ధర్మములు వ్యాసభగవానుడు ఇట్లానతిచ్చెను. బ్రాహ్మణునికి దానము దయ తపస్సు దేవ పిత్రదేవతా స్వాధ్యాయము ప్రధాన ధర్మములు. నిత్యోదకి(స్నానాదులతో చలికి వెఱువక) త్రిషవణస్నాననిరతుడు కావలెను. అగ్నులను ఉపాసింపవలెను. జీవనము కొఱకై ఇతరులచేత యజ్ఞములు చేయింప వచ్చును. శిష్యులకు వేదములు చెప్పవలెను. యజ్ఞనిమిత్తముగా తెలిసి…
చంద్రగ్రహ జననం ఆరవ భాగము
శీలవతి ( సతీ సుమతి ) కథ
ఆశ్రమంలో ఒక్కసారిగా గాలి స్పందించింది. ఏదో అమోఘమైన కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు , చిరునవ్వులు చిందిస్తూ.. అత్రి , అనసూయలు మాటలు మరిచిపోయి , త్రిమూర్తులకు…
ధ్రువ వంశం - దక్ష సంతతి
శివాది దేవతలారా! ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు, సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధి దేవుడైన జనార్దనునారాధించి ఆయన దర్శనభాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే…
దేవపూజా విధానం - వజ్రనాభ మండలం విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ
రుద్రదేవా! ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజా! గ్రహదేవతల మంత్రాలివి ఓం నమః సూర్యమూర్తయే ఓం హ్రాం హ్రీం సః సూర్యాయనమః …
చంద్రగ్రహ జననం ఏడవ భాగము
శీలవతి ( సతీ సుమతి ) కథ ఆశ్రమంలోకి వచ్చిన అనసూయను త్రిమూర్తులు ఆనందంగా చూశారు. అత్రి మొహంలో సంతోషం నాట్యం చేస్తోంది. "అనసూయా ! ఆడిన మాట నెరవేర్చి , మాకు ఆనందం కలిగించావు. మా మాటను మేమూ…
సంకరజాతి లక్షణ వర్ణనము
మునులు మహానుభావా ! నీవు సర్వజ్ఞుడవు. మఱియు సర్వభూత హితాభిలాషినవి. భూతభవిష్యవర్తమానములు నీకు గరతలామలకములు. ఏకర్మచే నటచే వర్ణముల కధమ స్థితివచ్చును? ఉత్తమస్థితియుంగల్గు నానతిమ్ము. శూద్రుడే కర్మమాచరించి బ్రాహ్మణత్వ మందును. వినగోరెదమన వ్యాసభగవానులిట్లనిరి. హిమగిరి శిఖరి మందాసీనుడైయున్న మహాదేవుంద్రిలోచనుని శైలరాజతనయ మ్రొక్కియిట్లదే ప్రశ్నమడిగినది. ఓ భగనేత్రనాశన! పూషదంత వినాశన! దక్షక్రతుహర !…
చంద్రగ్రహ జననం ఎనిమిదవ భాగము
బ్రహ్మదేవుడి మాట ఉన్నట్లుండి అత్రి మహర్షికి గుర్తుకు వచ్చింది. "యజ్ఞకుండంలో హవిస్సులాగా... అనసూయ గర్భంలో..." అత్రి శయ్యాగారం వైపు అడుగులు వేశాడు. గోడవారగా మంచం మీద శయ్య - తెల్లగా హిమవేదికలా కనిపిస్తోందతనికి... …
నవవ్యూహార్చన విధి పూజానుక్రమ నిరూపణం
పరంధామా! నవ వ్యూహార్చన విధిని గూర్చి తెలుసుకొనగోరుతున్నాము" అని ప్రార్థించాడు ఇంద్రుడు. చెప్పసాగాడు ఇందిరానాథుడు. మహా పురుషులారా! ఒకప్పుడు మా గరుత్మంతుడిదే విషయాన్ని గూర్చి కశ్యపునికి చెప్పాడు. అదే మీకు నేను వర్ణిస్తాను. సాధకుడు ముందుగా యోగక్రియ…