ఉపాసనా ఖండము రెండవ భాగము
రామోపాఖ్యానం రెండవ భాగము
రాముడు “జమదగ్ని రేణుకాదేవి"ల కర్మసంస్కారము చేయుట :- అప్పుడా చతురాస్యుడు వ్యాసమునీంద్రునితో యిలా అన్నాడు. "ఓ వ్యాసమునీంద్రా! ఆ తరువాత రాముడు తలనీలాలను తీసివైచి, శుద్ధిస్నానంచేసి స్మార్తవిధానం ప్రకారం సంచయన కర్మనంత టినీ యధావిధిగా నెరవేర్చి, మంత్రాగ్నిని ప్రజ్వరిల్లజేసి తలిదండ్రులిద్దరికీ విశ్రాంతి శ్రాద్ధమునూ ఆ తరువాతి…
ఉపాసనా ఖండము రెండవ భాగము
రామవరదానం
ఆ తరువాత వ్యాసమునీంద్రుడు ఇలా ప్రశ్నించాడు. “ఓ చతురాననా! రాముడా బాల్యం వీడనివాడు. అతడు ఒక్కడైవుండి అనంత పరాక్రమోపేతుడు, సహస్రబాహుయుతుడు, చతురంగ బలోపేతుడైన కార్తవీర్యుడిని ఎలా జయించాడు? ఆ గాధను విస్తారంగా తెలుపవల సింది!" బ్రహ్మయిలా బదులిచ్చాడు.! “ఓ మునీంద్రా!…
ఉపాసనా ఖండము రెండవ భాగము
తారకోపాఖ్యానం
అనంతరం వ్యాసమునీంద్రుడు చతురాననుని ఇలా ప్రశ్నించాడు. "ఓ చతురాననా! జమదగ్నినందనుడైన పరశురాముడు అద్భుతమైన తన తపస్సును ఎక్కడ ఎలా ఆచరించాడో, చివరకు గణేశుని ఎలా ప్రసన్నుని చేసుకోగలిగాడో ఆ వృత్తాంతమును నాకు విస్తారంగా చెప్ప వలసింది!" అప్పుడు చతురాస్యుడిలా చెప్పాడు "ఓ వ్యాసమునీంద్రా! పరశువును…
ఉపాసనా ఖండము రెండవ భాగము
కామ దహనం
"ఓ వ్యాసమునీంద్రా!ఆ విధంగా మన్మధుడు సింహశార్దూలాది క్రూర జంతువులతో కూడి, నానావృక్షములతోనూ, లతలతోనూ దట్టంగా అల్లుకున్నట్టి శంకరుని తపఃస్థానాన్ని చూసి తానుకూడా ఒక మాయావాటికను నిర్మించాడు. అందులో మధురమైన జలాలతో నిండిన సరోవరాలతోనూ, దివ్యమైన సుమసౌరభాన్ని ఒక క్రోసెడు దూరం వరకు వెదజల్లే నానా పుష్పవృక్షాలతోనూ, మామిడి, పనస, అరటి, ఖర్జూరము వంటి…
ఉపాసనా ఖండము రెండవ భాగము
స్కందోత్పత్యుపాఖ్యానం మొదటి భాగము
అలా ఆ శివపార్వతులు కైలాసానికి వృషభారూఢులై చేరుకున్న తరువాత “ఓ వ్యాసమునీంద్రా! ఆ భిల్లయువతి వేషంలోవున్న పార్వతి మదనతాపం చెందసాగింది! నీటిలోంచి ఒడ్డునపడిన చేపలా తీవ్ర విరహ బాధకు లోనయింది. శీతోపచారములుగాని, చందనం, పచ్చకర్పూరం మొదలైన లేపనాలేమీ ఆమెకు ఉపశమనాన్ని కల్గించలేకపోయాయి. పైగా అవి ఆమె తాపాన్ని మరింతగా పెంచాయి. ఇలా…
ఉపాసనా ఖండము రెండవ భాగము
స్కందోపాఖ్యానం
" ఓ మునీంద్రా! అలా ఆ పర్వతరాజనందనయైన పార్వతి గంగా తీరానికి వెంటనే చేరుకున్నది. అక్కడ ముద్దులు మూటగట్టే ఆ చిన్నారి బాలుడిని చూడగానే ఆమెకు స్తన్యం ధారగా స్రవించసాగింది. అతడిని ప్రేమతో ఆలింగనం చేసుకొని ముద్దాడింది! అప్పుడు గంగా దేవి వీడు నా కుమారుడని పల్కింది! అగ్నిహోత్రుడు నా కుమారుడనీ, కృత్తికలు వచ్చి 'ఓ…
ఉపాసనా ఖండము రెండవ భాగము
తారకవధోపాఖ్యానం వరదగణపతి పూజావిధానం:
అప్పుడు శివుడిలా అన్నాడు "ఓ కుమారా! నీవు కోరినట్టుగా సకల పాపక్షయకరము, సర్వసిద్ధికరమైన''వరదగణపతివ్రతం'' గురించి నీకు తెలియజేస్తాను! ఈ వ్రతాన్ని శ్రావణమాసములోని శుక్ల చతుర్ధి నాడు ఆరంభించాలి! ఆ ప్రతవిధాన మెలాంటిదంటే ఆనాడు ఉదయాన్నే నువ్వులపిండితో నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలి. …
ఉపాసనా ఖండము రెండవ భాగము
అనంగోపాఖ్యానం మొదటి భాగము
అనంతరం వ్యాసమునీంద్రుడిలా అన్నాడు. "ఓ చతురాననా! సకలార్ధప్రదములైన గజాననుని వ్రతమునూ దాని సంబంధిత యితర గాధలను వినిపించి నాకు పరమ సంతోషాన్ని కల్గించావు. ఐనా నాకో సందేహం మిగిలివున్నది. అదేమిటంటే మన్మధుడు శంకరునియొక్క క్రోధాగ్నిచే దగ్ధుడైనాడుకదా మరలా లోకములో ఎలాగున గోచరుడౌతున్నాడు? అతనివల్లనే ఈ సృష్టివిలాసం…
ఉపాసనా ఖండము రెండవ భాగము
అనంగోపాఖ్యానం రెండవ భాగము
అనంగునికి గజానన వరప్రదానం అప్పుడా వరదుడైన గణేశుడు మన్మధునితో యిలా అన్నాడు:- "ఓ మన్మధా! నీవు కోరిన కోరికలన్నీ ఈడేరగలవు! నీవు రమాదేవి గర్భవాసాన జన్మించి సశరీరుడవవుతావు! సౌందర్యంతో అందరిచేత కొనియాడబడ తగినవాడవు, త్రైలోక్యవిజేతవూ కాగలవు! ఇక నీకు నీ కార్యసాధనలో సహకరించేందుకుగాను పుష్పములు, ఫలములు, లేచిగుళ్ళూ, కామినుల…
ఉపాసనా ఖండము రెండవ భాగము
శేషోపాఖ్యానము మొదటి భాగము
శేషుని గర్వభంగము సర్వజ్ఞుడైవుండీ, దేవర్షియైన నారదమహర్షి శేషుని ఇలా ప్రశ్నించాడు. “ఓ నాగరాజా! నీవిలా నీ తేజస్సును కోల్పోయి ఎందుకని దుఃఖిస్తున్నావు? నీ శిరస్సులిలా భగ్నములైనవి ఎందువల్ల? నీవే మునికైనా అపచారంచేసి వారి ఆగ్రహానికి గురైనావా? లేక ఒళ్ళు మరచిన…
ఉపాసనా ఖండము రెండవ భాగము
శేషోపాఖ్యానము రెండవ భాగము
వ్యాసమహర్షి యిలా ప్రశ్నించాడు:- "దేవా! గణేశభగవానుని కధామృతం ఎంతవిన్నా అమృతంవలే తృప్తి కలుగుటలేదు! ఇంకనూ వినవలెనన్న ఆసక్తి కలుగుతున్నది. ప్రభూ! ఇంకనూ గణేశకధామృతమును ప్రసాదించు!" అనగా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు:- …
ఉపాసనా ఖండము రెండవ భాగము
శేషోపాఖ్యానము మూడవ భాగము
ఈ విధంగా కశ్యపుడు నానావిధ రూపములతో వర్ధిల్లిన సమస్త సృష్టినీ చూచి ఆనందించి విధివత్తుగా వారికి మంత్రోపదేశాన్ని సిద్ధ సాధ్య ఋణ ధన అర్వణములు పరీక్షించి వారివారి అర్హతల ప్రకారం కొందరికి షోడశాక్షరీ మంత్రమును, మరికొందరకు అష్టాక్షరీ మంత్రమును, ఒకర్తెకు ఏకాక్షరీ మంత్రమును, మరొకర్తెకు షడక్షరీ మంత్రము, ఇంకొందరకు ద్వాదశాక్షరీ…