ఉపాసనా ఖండము రెండవ భాగము
రెండవ భాగము సంకష్ట చతుర్థీవ్రతము
పిండివంటలు, కుడుములు, లడ్లు, అప్పములు, పాయసము, చక్కెర, చక్కగా వండిన సిద్ధాన్నం నేతితో అభికారం చేసి నైవేద్యం సమర్పిస్తున్నాను దేవా! దయతో స్వీకరించు! అని దయతో స్వీకరించు! అని ప్రార్ధిస్తూ "చంద్రమా మనసోజాతః" అన్న మంత్రంతో…
ఉపాసనా ఖండము రెండవ భాగము
సంకష్టచతుర్థీ వ్రతోపాఖ్యానం మొదటి భాగము
పూర్వము శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడు తన కుమారుని జాడ కానరాక చింతాజలధిలో మునిగిఉండగా అతని తల్లియైన రుక్మిణీదేవి అతనికి ఇలా సలహాయిచ్చింది. 'నాయనా! పూర్వం నీవు ఆరురోజుల వయసుగల బాలకుడవై ఉండగా శంబరాసురుడు నిన్ను నా పొత్తిళ్ళలోంచి…
ఉపాసనా ఖండము రెండవ భాగము
సంకష్టచతుర్థీ వ్రతోపాఖ్యానం రెండవ భాగము
"ఓ చతురాననా! అనంత శుభఫలప్రదమైనట్టి ఈ సంకష్ట చతుర్థీ వ్రతానికి ఉద్యాపనను ఎలాచేయాలి? ఆ వివరం విస్తరించి చెప్పు. లోకోపకారార్ధమే నీవంటివారు ఈ దివ్యకార్యములు నిర్వహిస్తారుకదా! అందుచేత లోకకళ్యాణంకూడా జరుగుతుంది!" అన్న సూతముని వాక్కులను విన్న బ్రహ్మ యిలా బదులుచెప్పాడు. "ఓ మునీంద్రా!…
ఉపాసనా ఖండము రెండవ భాగము
కార్తవీర్య చరిత్ర
ఆతరువాత శూరసేనమహారాజు శచీపతియైన ఇంద్రుణ్ణిలా ప్రశ్నించాడు ''ఓ దేవేంద్రా! చతుర్థీవ్రత మాచరించిన ఫలితంగా రాజైన కృత వీర్యునికి ఎలాంటి కుమారుడు జన్మించాడు? ఆ వివరమంతా దయతో " నాకు విస్తారంగా తెలుపు!' అంటూ ప్రార్ధించగా సహస్రాక్షుడైన ఇంద్రుడు ఆతనితో యిలా బదులుచెప్పాడు. …
ఉపాసనా ఖండము రెండవ భాగము
చతుర్థీవ్రత మహాత్మ్యం
దేవేంద్రుడు ఆ తరువాతి కథాక్రమాన్ని శూరసేనుడితో యిలా చెప్ప సాగాడు : ''ఓ శూరసేనమహారాజా! అప్పుడు కార్యవీర్యుడు లోకగురువైన దత్తాత్రేయుడు ఉపదేశించిన రీతిలో నిరహారుడై, కేవలము వాయువును మాత్రం భక్షిస్తూ నిశ్చలమైన మనస్సుతో, తదేకదీక్షతో గజాననుని ధ్యానం చేస్తూ స్థాణువులా నిలచి తపస్సు ఒనరించాడు. …
ఉపాసనా ఖండము రెండవ భాగము
చతుర్థీవ్రత మహాత్మ్యం రెండవ భాగము
ఆ విధంగా ఇంద్రుడు శూరసేన మహారాజుకు చతుర్థీవ్రత కధనాన్ని ఇతిహాసంతోపాటు వివరించాక ఎంతో శ్రద్ధతో ఆలకించిన ఆ శూర సేనుడు తన దూతలను పిలిచి యిలా ఆజ్ఞాపించాడు. "ఓ దూతలారా! మీరు వెంటనే నగరంలోకి వెళ్ళి సంకష్ట చతుర్థీ వ్రతాన్ని…
ఉపాసనా ఖండము రెండవ భాగము
చతుర్థీవ్రత మహాత్మ్యం మూడవ భాగము
"ఓ వ్యాసమునీంద్రా! ఈ విధంగా సంకష్టచతుర్థీ వ్రతమహాత్మ్యాన్ని కన్నులారా గాంచిన శూరసేనమహారాజు ఆ తరువాత ఏంచేశాడో ఆ వృత్తాంతాన్ని యావత్తూ తెలియజేస్తాను విను!" అంటూ చెప్పసాగాడు చతుర్ముఖుడు. కన్నులరమోడ్పులవగా భక్తివినమ్రభావాలు మదిని ముప్పిరిగొనగా శ్రద్ధగా ఆలకిస్తున్న కృష్ణద్వైపాయనుడితో చతుర్ముఖుడిలా కధనాన్ని…
ఉపాసనా ఖండము రెండవ భాగము
వ్యాధిగస్త వైశ్య పూర్వజన్మ వృత్తాంతం
ఓ రాజా! పూర్వజన్మలో ఈ వైశ్యుడు గౌడదేశములోని గౌడనగర నివాసియైన ఒక సద్రాహ్మణుడి యింట జన్మించాడు. ఈతడి తల్లిపేరు శాకిని. ఈతడికి యుక్తవయస్సు రాగానే సావిత్రి అనే సర్వాంగ సుందరురాలైన కన్యనిచ్చి వివాహం కావించారు. ఒక్కగానొక్క పుత్రుడవటంచేత మిక్కిలి గారాబంతో పెంచి ఎంతో అపురూపంగా చూచుకునేవారు. క్షణ కాలమైనా ఈతడి వియోగం ఆ…
ఉపాసనా ఖండము రెండవ భాగము
కార్తవీర్యోపాఖ్యానం మొదటి భాగము
"ఓ వ్యాసమునీంద్రా! నీవు కోరినట్లుగా దుర్వామహాత్మ్యము, నామప్రభావము వివరించాను. నీవింకా ఏమి వినగోరుతున్నావో చెప్పవలసింది" అన్న చతురాననుడి ప్రశ్నకు పరాశరనందనుడిలా అన్నాడు. "ఓ పరమేష్టి! సకల శుభకరమైన ఈ సంకష్ట చతుర్థీవ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఏయే ఫలాలను పొందారు? దయతో…
ఉపాసనా ఖండము రెండవ భాగము
కార్తవీర్యోపాఖ్యానం రెండవ భాగము
జమదగ్ని - కార్తవీర్య సంవాదం నదీతీరంలో విడిదిచేసిన పరివారాన్నంతటినీ ఆహ్వానించి, ఆ శిష్యులు జమదగ్ని చెప్పిన మాటలను ఆ రాజుతో యిలా విన్నవించారు. "ఓ రాజా! ససైన్యంతో మీరు భోజనానికి విచ్చేసి, తమకు అన్ని విధాల తగినట్టి విందును ఆరగించగలరు!"…
ఉపాసనా ఖండము రెండవ భాగము
కార్తవీర్యుడు జమదగ్నిమహర్షిని సంహరించుట
జమదగ్నిముని యింకా యిలా అన్నాడు :- "ఓ రాజా! నీవో మేకవన్నె పులిలాగా, గోముఖ వ్యాఘ్రంలాగా మొదట్లో సాధువువలే, సాధుజనులకు ఉపకారివిలా కనబడి ఇప్పుడు నీ నైజాన్ని వెలిబుచ్చావు! దురాశతో అనవసరమైన భ్రాంతిలో చిక్కు కున్నట్లున్నావు! ఈ పవిత్రమైన కామధేనువు ఎవరికీ పొందశక్యం…
ఉపాసనా ఖండము రెండవ భాగము
రామోపాఖ్యానం మొదటి భాగము
ఆ తరువాత జరిగిన కథనాన్ని బ్రహ్మ యిలా వివరించాడు. "ఓ వ్యాసమునీంద్రా! అలా ఆ కార్తవీర్యుడు భీభత్సము భయానకమైన వాతావరణాన్ని సృష్టించి వెళ్ళిపోయాక, జమదగ్ని పత్నియైన రేణుక దుఃఖంతో వివశురాలై ''ఆహా! నేడు ఎంతటి దుస్థితి దాపరించింది? ఇటువంటి ఆపత్సమయాలలో నా…