గోకులే బల ప్రత్యాగము వర్ణనము
వ్యాసులిట్లనిరి.
ఇట్లు ముచుకుందునిచే పోగడబడి సర్వభూతేశ్వరుండగు హరిని కోరిన దివ్యలోకములనందుమని ఆ రాజునకు దెల్పెను. నా సాకతము అవ్యాహతైశ్వర్యముతో దివ్యభోగములచట అనుభవించి పూర్వజన్మ స్మృతి బడసి ఉత్తమ కులమందు పుట్టి అవ్వల ముక్తి నందుదువు. అన ఆ రాజు పరమేశ్వరునకు మ్రొక్కి గుహనుండి వెలువడి వచ్చి వెలినున్న అల్పాల్ప శరీరులను నరులం జూచును. దానిచే కలియుగము వచ్చెనని గ్రహించి నరనారాయణస్థానమైన…
ఉపాసనా ఖండము మొదటి భాగము
గణేశ పార్థివ పూజా విధానం
గిరినందనయైన పార్వతీదేవి తన తండ్రిని ఇలా ప్రశ్నించింది.
"ఓ జనకా! ఆ గజాననుడు ఎట్టివాడు? అతని ఉపాసనా విధానమెట్టిది? ఆ గణేశుని అనుగ్రహవిశేషం వలన తిరిగి నా నాధుని పొందగలనా? ఈ పవిత్ర ఉపాసనను తెలపటం వల్ల మానవులకు కూడా…
బలరామ క్రీడా వర్ణనము
వ్యాసుడిట్లనియె.
మాయామానుష రూపమున ఒకానొక పనికై అవని నవతరించి గోపకులతో బృందాపనమున సంచరించుచున్న తన ఫణామండలమున ధరణి నెల్ల ధరించిన శేషుని అవతారమై మహత్తర కార్యములను నిర్వహించుచున్న బలరాముని అపభోగముకొఱకు వరుణుడు వారుణియను తన శక్తిని గూర్చి ఓ మదిరా! నీవు అనంతునికి ఎంతయో ఇష్టమైనదానవు. అతడు నిన్నాలకించుటకు ఆనువుగ అచటికరుగుము అన ఆ వారుణి సంకర్షణుని సన్నిధానమునకు అరిగెను.…
రుక్మిణీకల్యాణము శంబరాసురవధ
వ్యాసులిట్లనియె.
భీష్మకుడు విదర్భ దేశాధిపతి కుండిననగరము రాజధానిగా రాజ్యపరిపాలన చేసెను. అతని కుమార్తె రుక్మిణి. కుమారుడు రుక్మియనువాడు. రుక్మిణిని కృష్ణుడును కృష్ణుని రుక్మిణియు నొండరులు వరించుకొనిరి. కాని రుక్మిద్వేషముగొని చక్రాయుధునకు అతడీయడయ్యెను. జరాసంధుని ప్రేరణచే శిశుపాలునకు వాగ్ధానము చేసెను. భీష్మకుడును రుక్మితో నట్లేయనెను. అవ్వల జరాసంధాదులు కళ్యాణార్ధము భీష్మనగరమునకు వచ్చిరి. శిశుపాలుడును వచ్చెను. కృష్ణుడు బలభద్రుడు మొదలగు యాదవులుతోగూడి ఆ వివాహము…
ఉపాసనా ఖండము మెదటి భాగము
వరదగణేశ వ్రతవిధానం
ఓ వ్యాసమునీంద్రా! హిమవంతుని ఉపదేశాన్ని విన్న గిరినందన తిరిగి తన తండ్రినిలా ప్రశ్నించింది "ఓ తండ్రీ! నీ ఉపదేశము నా చెవులకు అమృతపు జల్లై కురి సింది! ఐతే…
ఉపాసనా ఖండము మొదటి భాగము
కర్దమోపాఖ్యానము
ఓ స్కందా! పూర్వం మహాపరాక్రమవంతుడైన కర్దముడనే రాజు యావద్భూమండలాన్నీ పరిపాలించేవాడు. ధర్మబద్ధమైన అతని పరిపాలన లో ప్రజలు చిరకాలం సంతుష్టులై గడిపారు! ఆతని గుణగణాలకు మెచ్చిన దేవతలు అదృశ్యరూపంలో అతని కొలువుకూటంలో ఉండేవారు. …
ఉపాసనా ఖండము మొదటి భాగము
నలవ్రత నిరూపణం
తండ్రియైన హిమవంతుడు తనకు ప్రేమతో ఉపదేశించిన ''వరద గణేశ వ్రతవిధానం'' అంతా విన్నాక పార్వతి ఇలా ప్రశ్నించింది. "ఓ తండ్రీ! ఈ వ్రతాన్ని ఇంతకు పూర్వం నలుడు చేశాడని చెప్పావు! ఇంతకీ ఆ నలుడెవ్వరు? ఎందుకని ఈ వ్రతాన్ని ఆచరించాడు? ఈ వృత్తాంతాన్ని చెప్పి నాకు ప్రశాంతిని చేకూర్చవలసింది!"…
ఉపాసనా ఖండము మొదటి భాగము
చంద్రాంగదోపాఖ్యానం
పర్వతరాజైన హిమవంతుడు తన కుమార్తెయైన గిరిజతో ఇలా అన్నాడు.. "అమ్మాయీ! పార్వతీ! నలుడేకాక యింకా చంద్రాంగదుడనే రాజు చేతా, యింకా అతని భార్య ఇందుమతిచేతా కూడా ఈ గణేశవ్రతం అనుష్టించబడింది. ఆ విశేషాన్ని చెబుతాను విను!" …
ఉపాసనా ఖండము మొదటి భాగము
ఇందుమతీ - నారద సంవాదం
గిరిరాజనందినియైన పార్వతి తండ్రియైన హిమవంతుని తిరిగి యిలా ప్రశ్నించింది. "ఓ తండ్రీ! మహారాణియైన ఇందుమతి ఆ విషాద వార్తకు నిర్ఘాంతపోయి మూర్ఛిల్లిన తరువాత ఏం జరిగిందో, ఆ రాజ్య ప్రజలేమి చేశారో ఆ వివరాన్నంతటినీ దయతో నాకు తెలియచేయి!" …
ఉపాసనా ఖండము మొదటి భాగము
శివపార్వతీ సంయోగం
ఆ తరువాత జరిగిన కధను పర్వతరాజైన హిమవంతుడు తన ప్రియపుత్రిక పార్వతితో ఇలాచెప్పాడు.. "ఓ పార్వతీ! ఈ విధంగా వ్రతపరిసమాప్తి అయిన తరువాత గణేశుడి అనుగ్రహంచేత పాతాళలోకంలోని నాగకన్యకల బుద్ధిమారింది. వెంటనే వారు చంద్రాంగద మహారాజుని బంధననుంచి…
ఉపాసనా ఖండము మొదటి భాగము
శూరసేనోపాఖ్యానం
ఆతరువాత భృగుమహర్షి ఇలా అన్నాడు. "ఓ సోమకాంత మహా రాజా! గణేశ మహాత్మ్యన్నంతా వివరించి చెప్పాను. అంతేకాదు! బ్రహ్మ ముఖంనుంచి వ్యాసుడువిన్న చరిత్రనంతా చెప్పాను.” అనగానే ఆ సోమకాంతుడిలా అన్నాడు. 'ఓ ఋషివర్యా! ఆ తరువాత బ్రహ్మనుంచి వ్యాసమహర్షి ఇంకా ఏమేమి విన్నాడు? ఆ వివరంగూడా దయచేసి చెప్పండి. అమృతోపమమైన…
ఉపాసనా ఖండము రెండవ భాగము
భ్రుశుండోపాఖ్యానం
అప్పుడు దేవేంద్రుడిలా అన్నాడు. 'ఓయీ! నీ కుతూహలానికి సమాధానం తప్పక ఇస్తాను. ఏ పరమపుణ్యప్రదమైన భక్తిభావంచేత భ్రుశుండి మహాముని సాక్షాత్తూ వరప్రదుడైన గణపతిగా సారూప్యాన్ని పొందాడో, అటువంటి పురాతనేతిహాస గాధను తప్పక చెబుతాను. అందు వల్ల శ్రోత, వక్తా యిరువురూకూడా ధన్యులౌతారు. శ్రద్ధగా విను! దండకారణ్యానికి సమీపంలో ''నందుర'' అనే ఊరు…