ప్రదక్షిణం
పూజాంతంలో మంత్రపుష్పం అయాక ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. ప్రదక్షిణం రెండు విధాల ఉంటుంది. 1) దేవాలయానికి చేసేది. 2) పూజాంతంలో చేసే ఆత్మ ప్రదక్షిణం. ప్రదక్షిణం అంటే "ప్రచ్ఛినత్తి భయం సర్వం దకారో మోక్ష సిద్ధిదః; …
భోజనం
కోటి విద్యలు కూటికొరకే
అని తెలుగులో మంచి సామెత ఉంది. మనం పడే కష్టాలు, చేసే ఉద్యోగాలు అన్నింటి లక్ష్యం కడుపు నిండుగా భోజనం చేయాలనియే. అలా జీవితమంతా లోటులేకుండా జరగాలని కూడా. కాబట్టి, అంత కష్టపడి సంపాదించికూడా తినకుండా ఉంటే ప్రయోజన మేముంది? అందుకే శతం విహాయ భోక్తవ్యం …
భోజన దోషాలు
భోజన విషయంలో గుణాలు పాటించటం ఎలాగున్నా కనీసం దోషాలనైనా తెలిసికొని వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భోజనానికి కూర్చోవడంలో కూడా పెద్దలు కొన్ని నియమాలు, దోషాలు చెప్పారు. ఎడమకాలు చాపి దానిపై ఎడమ చేయి పెట్టడం తగదు. కాళ్లు బారచాచి తినకూడదు. కుక్కుటాసనం అంటే గొంతుక కూర్చుని తినకూడదు. అలాగే తడిబట్ట కట్టుకుని తినరాదు. తలమీద స్నానం చేశాక తల పూర్తి పొడిగా ఉండేటట్లు…
ఉద్యోగం - వృత్తి
ఉద్యోగం పురుషలక్షణం
అన్నారు. ఇక్కడ ఉద్యోగమంటే ప్రయత్నము అని నిఘంటుపరమైన అర్థం. భారతంలో ఉద్యోగపర్వం అని ఒక పర్వం ఉంది. పురుషలక్షణ మంటే జనసామాన్యుల కర్తవ్యమని అర్థం. అంతేకానీ స్త్రీలు కానివారని కాదు. ప్రతివ్యక్తీ కర్మశీలి కావాలి. అకర్మణ్యత పనికిరాదు. ఐతరేయ బ్రాహ్మణం …
సత్కాలక్షేపం
సద్గ్రంథ పఠనం గూడా సదాచారంలో భాగమే. ఈ సంసారమనే విషవృక్షానికి రెండు అమృత సమానమయిన ఫలా లున్నాయట. అందు మొదటిది కావ్యామృత రసాస్వాదము, రెండవది సజ్జనులతో మాట్లాడుకొనటం అంటే సత్సంగం. మనం ఎటూ సంసార విషవృక్షాన్ని తప్పక ఎక్కాం. కాబట్టి ఎలాగయినా ఆ అమృతఫలాలనందుకోగల్గితే జన్మ చరితార్థ మవుతుంది. కావ్యామృత రసాస్వాదమంటే…
రాత్రి భోజనము
రాత్రి భోజనమునకు కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. పగటి భోజనంలో 1/4వవంతు తగ్గించి రాత్రి భోజనం చేయాలి. గురుత్వ ద్రవ్యాలు తగ్గించి తినాలి. దుంపకూరలు, పప్పు, పచ్చళ్ళు, పిండివంటలు తినకూడదు. ఆకుకూరలు, పాలు వంటివి మేలు. సంధ్యాసమయంలో తినకూడదు. దీపంతో చూడక ఉప్పు వేయకూడదు. ఉసిరికాయ రాత్రి తినరాదు. దీపం లేకుండా భుజింపరాదు. రాత్రి 9 గంటలలోపు భుజించాలి. పెరుగు వేసుకొని భోజనం చేయటం…
దాంపత్యం
ఇది రాత్రి భోజనానంతర కర్తవ్యం. వివాహముయొక్క లక్ష్యం ఉత్తమ సంతానాన్ని కనటం. అందుకే భార్యాభర్తలు చేయు ప్రయత్నము కూడా సదాచారంలో భాగమే. పురుషునికంటె స్త్రీ చిన్నది అయి ఉండుట ఇర్వురకు ఆరోగ్యకరము, సుఖకరము. కాకున్న దినదినము ఆయుఃక్షీణముగా చెప్పబడినది. స్త్రీ పురుషుల కలయిక విధానం బట్టి సంతానం యొక్క మంచి చెడులుంటాయి. సంధ్యా సమయమున కైకశి, విశ్రవులు కలిసినందున రావణుడు రాక్షసుడైనాడు. సమయజ్ఞానంతో…
పురుష సదాచారము
సాధారణ సదాచారము స్త్రీ పురుషులకు ఉభయులకూ చెందినదే అయినా స్త్రీలకు ప్రత్యేక సదాచారం ఉన్నట్లు పురుషులకు కూడా ప్రత్యేక సదాచారం ఉంది. తాను కుటుంబమునకు యజమాని. ఏదోవిధంగా తాను సంపాదించుకొని వచ్చి ఇంట్లో పడేయటమే కర్తవ్యంగా తలచి మరేమీ పట్టించుకోకుండా ఉండే వైఖరి తగదు. తాను అజాగ్రత్తగా ఉంటే కుటుంబ సభ్యులంతా స్వేచ్ఛా ప్రవృత్తి లో పడిపోవచ్చు. కాబట్టి నిరంతర జాగరూకత అవసరం.…
స్త్రీ సదాచారము
నిత్యకృత్యాలన్నీ పురుషులతోబాటు స్త్రీలకు పాటింపదగినవే కాని వారి శారీరకస్థితి గతులు, జీవన విధానములను బట్టి స్త్రీలకు ప్రత్యేకముగా గ్రహింప దగిన సదాచార మున్నది. పుణ్యస్త్రీలు నిద్దురలేవగానే తన పతికి జీవన హేతువయిన మంగళసూత్రాలను కనుల కద్దుకొంటారు. పురుషులు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించునట్లు స్త్రీలు భర్త పాదాలకు నమస్కరించాలి. శౌచవిధిలో స్త్రీలకు వేశ్మశుద్ధి అంటే ఇంటిని శుభ్రపరచుకొనుట ప్రత్యేకంగా…
స్త్రీ సదాచారము
పురుషులకంటె స్త్రీల భిన్నత ప్రథమ రజస్వల, బహిష్ఠు, ప్రసవము అనే వానియెడ ఉంటుంది. వాటి విషయంలో సదాచారం పాటించటం స్త్రీ విషయంలో ముఖ్యమైనది. ఆడపిల్లగా శారీరకమయిన మార్పులు పొందే ముఖ్యమయిన సమయం రజస్వల అవటం. మానసికంగా కూడ అప్పటినుండి పరిణతి ఉంటుంది. తల్లి తన కుమార్తెకు ముందుగానే దానినిగూర్చి అవగాహన ఇవ్వాలి. పరాయిచోట ప్రథమరజస్వల అవటంవల్ల జీవితంలో కొన్ని చెడులకు అవకాశం ఉంటుందని…
మానవత్వంనుండి దివ్యత్వంవైపుకు
ఆహార, నిద్ర, భయ, మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే. అయితే జ్ఞాన విజ్ఞాన గ్రాహ్య యోచనాశక్తి మనిషిని జంతువులనుండి వేరుచేసి అత్యున్నత స్థానానికి చేరవేస్తున్నాయి. ఈ సృష్టిలోనే అత్యంత గొప్పదైన మానవజన్మను పొందిన తరువాత దానిని సార్థకం చేసుకోవాలేకాని వృధాచేసుకోకూడదు. మానవజన్మ సార్థక్యానికి రెండు సాధనాలున్నాయి. అవి 1) భగవత్సేవ…
శ్రీమద్ భాగవత సప్తాహం – వృందావన ధామ్ – మధుర నగరం (Srimad Bhagavatha Sapthaham 2025 @ Vrindavan Dham)
శ్రీమద్ భాగవత సప్తాహం | వృందావన ధామ్ - మధుర నగరం
వృందావనం అంటేనే మధురమైన ప్రేమ, శ్రీకృష్ణుడు మరియు రాధికమ్మ అనన్యమైన ప్రేమకు సాక్షిగా నిలిచిన పవిత్ర భూమి. ఈ ధామం భక్తుల హృదయాలను దోచుకునే అద్భుతమైన సౌందర్యంతో నిండి ఉంటుంది. యమునా నది తీరంలో వ్యాపించి ఉన్న వృందావనం, తులసి చెట్లతో, రాధాకృష్ణుని ఆలయాలతో, అద్భుతమైన ప్రకృతితో నిండి ఉంటుంది.
"యమునాతీరే వృందావనే వసతి: శ్రీకృష్ణో రాధా సహితః। చందనాయుక్త శరీర: పీతాంబరాంబరధారి।"
అని…