ఉపాసనా ఖండము మొదటి భాగము
గజానన దర్శనం
సూతమహర్షి ఋషులతో ఇలా అన్నాడు ఓ ఋషిశ్వరులారా! బ్రహ్మ చెప్పిన పై వాక్యాలను విన్న వ్యాస మునీంద్రుడు తన అంతరంగం ప్రశాంతం అవ్వగా ప్రసన్న చిత్తంతో చతుర్ముకుడిని తిరిగి ఇలా ప్రశ్నించాడు. …
పంచతీర్థవిధివర్ణనము
ఇక పంచతీర్థములదు స్నానము దానములు చేయుట అచటి దేవతలను దర్శించుటవలన కలుగు ఫలమును తెల్పెదను. మార్కండేయము అను మడుగున ఉత్తరముగ తిరిగి శుచియై ముమ్మారు ఈ మంత్రమును చెప్పుచూ స్నానము చేయవలెను. సంసారసాగరమందు మునిగి పాపగ్రస్తుడనై తెలివిదప్పియున్న నన్ను ఓ త్రిపురహర! రక్షింపుము.…
నృసింహ మాహాత్మ్య వర్ణనము
బ్రహ్మ యిట్లనియె!
ఇట్లు బలరాముని కృష్ణుని సుభద్రను జూచి మ్రొక్కిన అతడు ధర్మాది పురుషార్థములను నాల్గింటిని బడయును. దేవాలయము వెడలి నమస్కరించి ఇసుకలో దాగియున్న ఇంద్రనీలమణి స్వరూపుడగు విష్ణుని దర్శించిన భక్తుడు వైకుంఠమున కేగును. హిరణ్యకశిపుని సంహరించిన నరసింహమూర్తి…
ఉపాసనాఖండము మొదటి భాగము
గజానన దర్శనం
జన్మ మృత్యువులకు అతీతుడు నిరాకారము శుధ్ధాద్వైతము అనంతము శాశ్వతుడవు అగు పూర్ణ బ్రహ్మ రూపమే నీవు పరమ నిర్గుణుడవు గుణ రహితుడవు నిర్వీశేషుడవు సంకల్ప రహితమైన పరబ్రహ్మ తత్వమే నీవు త్రిగుణాతీతుడవు సృష్టికి ఆదిబోతుడవు ఐన ఓ పరమానంద రూప! జ్ఞానానంద రూపమైన గణేశ రూప నీకు నమస్కారము! …
ఉపాసనాఖండము మొదటి భాగము
గజానన దర్శనం రెండవ భాగము
మహత్తరమైన విజ్ఞాలన్నింటిని మీరు దాటగలరు మీకు ఘనమైన కీర్తి కలిగేందుకు మీకు వేరువేరు బాధ్యతలను అప్పగిస్తాను అంటూ వారికి ఇలా వరాలను అనుగ్రహించి రజోగుణ సముద్భవుడైన బ్రహ్మకు సృష్టి బాధ్యతను సత్వగుణాశ్రయుడైన విష్ణువును పాలకుడుగాను తమోగుణంలో ఉత్పన్నుడైన రుద్రుడిని సర్వసంహారకుడిగాను నియమించాడు! …
శ్వేతమాధవ మాహాత్మ్య వర్ణనము
బ్రహ్మయిట్లనియె.
అనంత వాసుదేవ మూర్తిని సేవించనవారు పాపముక్తులై పరమపదమందుదురు. ఈ స్వామిని నేనును నింద్రుడును సేవించినాము. అటుపై విభీషణుడు రాముడు సేవించిరి శ్వేత గంగ యందు స్నానముచేసి శ్వేతమాధవుని మత్య్సమూర్తియైన మాధవుని దర్శించినతడు శ్వేతద్వీపమునకేగును. అటుపై మునులు…
ఉపాసనా ఖండము మొదటి భాగము
బ్రహ్మచింతా వర్ణనం
అప్పుడు సోమకాంత మహారాజు భృగు మహర్షిని అలా గజాననుని ఉదరంలో అనేక బ్రహ్మాండాలను చూసి ఆ తరువాత గణేశుని అనుజ్ఞ మేరకు బ్రహ్మ ఎలా సృష్టిని చేసినది వివరింపమని ప్రార్థించగా ఆ భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు! …
సముద్ర స్నాన విధి వర్ణనము.
శ్వేత మాధవుని దర్శించి ప్రళయమందేకార్ణవమైన తరి మత్స్యావతారమెత్తిన మాధవుని దర్శింపవలెను. వేదములను హరించిన హిరణ్యాక్షుని సంహరించి వేదరక్షణము చేసిన మొదటి అవతారమెత్తిన విష్ణువును నమస్కరించి నరుడు దుఃఖ విముక్తుడగును. విష్ణులోకమును బడయును. మరల నీ పుడమికి వచ్చి వత్సమాధవ స్వామినిచట దర్శించి దాతయు, ఐశ్వర్య భోక్తము. యజ్ఞకర్తయు, విష్ణుభక్తుడును సత్యవ్రతుడునై హరి సన్నిధానమొంది మోక్షము పడయును.…
ఉపాసన ఖండము మొదటి భాగము
పూజా నిరూపణం
ఆ తరువాత జరిగిన కథా వృత్తాంతాన్ని భృగువు సోమకాంత మహారాజు కిలా చెప్పసాగాడు అలా ధ్యాన నిమగ్నుడై ఉన్న చతుర్ముఖుడికి ఒక మహత్తరమైన దివ్యానుభూతి స్వప్నం రూపంలో కలిగింది తాను ఆ జలాల పైనున్న ఆకాశంలో పరిభ్రమిస్తూ ఒక పెద్ద వటవృక్షాన్ని చూశానని ఆ వివరాలను వ్యాసునితో ఇలా వర్ణించి చెప్పసాగాడు...
…
ఉపాసనా ఖండము మొదటి భాగము
దేవీ ప్రార్థనం
పై కథా క్రమాన్ని భృగు మహర్షి చెప్పగా అత్యంత శ్రద్దా భక్తులతో వింటున్న సోమకాంత మహారాజు ఇలా అన్నాడు ఓ ఋషీశ్వర గణేశుని దివ్య ఆవిర్భావము అనుగ్రహము గాధ వింటుంటే నాకెంతో సంతోషం కలిగింది నాకు ఈ మధురమైన దివ్య కథామృతాన్ని ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది కానీ తనివి తీరటం…
పూజావిధి కథనము
బ్రహ్మ ఇట్లనియె.
అచమనము కావించి మౌనము బట్టి జీవర్షి పితృతర్పణములను గావించి శ్రీమన్నారాయణ పూజ ఇట్లు చేయవలెను. మూరెడు చతురము గల మండలము లిఖింపవలెను. అందు నాలుగు కోణములు నాలుగు ద్వారములు గుర్తింపవలెను. సముద్ర తీరమున అష్టదళ పద్మాకారమున లిఖించిన ఆ మండలమందు నడుమ తామర పూవు దుద్దు గుర్తుగా. పసుపు కుంకుమలతో చిత్రింపవలెను. నారాయణాష్టాక్షరీ మంత్ర…
సముద్ర స్నాన మాహాత్మ్యం
బ్రహ్మ ఇట్లనియె.
ఇట్లు నారాయణుని యథావిధి పూజించి సముద్రునకు నమస్కరించవలెను. అపుడు 'ప్రాణస్త్వం' అను మంత్రమును జపింపవలెను. స్నానము చేసివచ్చి ఒడ్డున నారాయణుని పూజించి బలరాముని కృష్ణుని సుభద్రను సముద్రుని గూర్చి నమస్కారము సేసి అశ్వమేధ ఫలమును మానవుడు పొందును. అంతియే కాక సూర్యప్రభమైన విమానమెక్కి గంధర్వాప్సరసలు సేవింప ఇరువదియొక్క తరముల వారి ఉద్ధరించి విష్ణులోకమున కేగును.…