ఉపాసనాఖండము మొదటి భాగము
భృగురాశ్రమ ప్రవేశం
సోమకాంత మహారాజు భృగుమహర్షి ఆశ్రమమును ప్రవేశించుట. తరువాతి వృత్తాంతాన్ని సూతమహర్షి యిలా కొనసాగించాడు : “ఓ మహర్షులారా! ఇలా భృగుమహర్షి తనయుడైన చ్యవనుడు మహారాణి సుధర్మ యొక్క దుఃఖపూరితములైన, వేదనాభరితములైన దీనవాక్కులను విని, వారి దుఃఖానికి…
ఉపాసనాఖండము మొదటి భాగము
సోమకాంత పూర్వజన్మ కథనం
అప్పుడు శౌనకాది మహర్షులు సూతమహర్షిని ఇలా ప్రశ్నించారు:"ఓ సూతమహర్షీ! భృగుమహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న సోమకాంత మహారాజు ఏంచేసాడు? సర్వం తెలిసి త్రికాలజ్ఞుడైన భృగువు ఆరాజు యొక్క బాధానివృత్తికై ఏ ఉపాయాన్ని చెప్పాడు? ఈ వివరాలన్నీ తెలుసుకొన కుతూహలంగా ఉన్న మాకు ఆ తరువాత జరిగిన కథాభాగమును వినిపించి తృప్తిని కలిగించు!" ఆ మాటలకు మందస్మిత…
పురుషోత్తవర్ణనమ్
ఇంద్రద్యుమ్నునితో పరమేశ్వరుడిట్లనియె. రాజా! యక్ష గంధర్వాదులు మహేంద్ర బ్రహ్మా రుద్రాదులలో నే నెవ్వడను గాను, పురుషోత్తమునిగా నన్నెఱుంగుము. సకల పాపములు హరించు అనంత బల పౌరుషములు గలవాడను. అనంతుడును అశేష భూతకోటికి ఆరాధనీయుడను. ఎవరిని జ్ఞానమ్యుడని వాసుదేవుడని యోగులు పేర్కొందురో. వేదాంతములు వెల్పునో అట్టి యోగగమ్యమగు వస్తువును నేను త్రిముర్తులు నేనై ఉన్నాను. దిక్పాలులందురు నేనే. అఖిల చరాచర జగత్తును నేను. నాకంటె అన్యము లేదు.…
ఉపాసనాఖండము మొదటి భాగము
నానాపక్షి నివారణం
ఇట్లా గుణవర్ధనుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాల వేడుకున్నా వజ్రమంతటి కఠినమైన నీ హృదయమే మాత్రం కరుగలేదు! చాలాకాలంగా ఘోరకృత్యాలను జంకూగొంకులులేకుండా చేస్తూండటంవల్ల కరడు గట్టిన కాఠిన్యంతో, జాలి అన్నమాట మందుకిగూడ లేకుండా నిర్దయగా ఆ బ్రాహ్మణుడితో నీవిలాగన్నావు. …
మార్కండేయ వట దర్శనము
బ్రహ్మయనియె :- ఓ మునివరలారా ! కల్పాంతమందు ప్రళయమైన తఱి సూర్యచంద్రులు వాయువు చరాచర ప్రపంచము నశించి ప్రచండ ప్రళయ ఆదిత్యుడు ఉదయింప మేఘములు ఉరుమును.విద్యుదుత్పామున పిడుగులు పడి చెట్లు గుట్టలు భగ్నమై ఎల్లలోకము ఉల్కలుపడి నశింప ఎల్లనదులు సరస్సు లింకిపోవ సంవర్తకాగ్ని వాయువుతో గూడ ఆదిత్య శోభితమైన లోకమున ప్రవేశించును. అవ్వల భూమిం బ్రద్దలుగొట్టి పాతాళమున ప్రవేశించి…
మార్కండేయ ప్రళయ దర్శనము
అంతట ఏన్గులట్లు మెఱుపుదీవల మెఱయు మేఘములు వింతగా నింగి నలముకొనియె. అవి కొన్ని నల్ల కలువలవలె నల్లనివి కొన్ని తెల్ల కలువలవలె తెల్లనివి కొన్ని పద్మ కింజల్కములట్లు ఎర్రనివి. కొన్ని పసుపుపచ్చనివి కొన్ని ఆకుపచ్చనివి కొన్ని కాకిగ్రుడవంటివి. కొన్ని తామరరేకులట్టివి కొన్ని ఇంగువఛాయగలవి అయియుండెను. కొన్ని పెద్ద నగరములుగను కొన్ని పర్వతములట్లు కొన్ని కాటుక…
ఉపాసనాఖండము మొదటి భాగము
రాజోపదేశ కథనం
ఆ తరువాత కధను సూతమహర్షి యిలా చెబుతున్నారు : 'ఓ ఋషివర్యులారా! అప్పుడు భృగుమహర్షి క్షణకాలం ధ్యానస్థితుడై ఆ సోమకాంత మహరాజుయొక్క పూర్వజన్మ కర్మయొక్క తీవ్రతను గ్రహించి విహ్వలుడై ఆరాజుతో…
మార్కండేయాఖ్యానము
మార్కండేయాఖ్యానము
బ్రహ్మయిట్లనియె :- ఆ మార్కండేయుడు వటపత్రశాయి ఐన నా బాలుని గర్భమందు ప్రవేశించి సమస్త భూమండలము అందు జూచెను. సప్త సముద్రములను, సప్తద్వీపములను, సప్త కులాచలములను,సర్వరత్న నిధియయిన మేరువును దర్శించెను. ఆమేరుపర్వతము సర్వ రత్న నిధి నానాముని సమాకీర్ణము. సర్వవృక్షములకు స్థానము వింతలకెల్ల స్థానము. సింహ వ్యాఘ్రాదులకు నిలయము. ఇంద్రాది దేవతలు సిద్ధ చారణ గంధర్వ అప్సరో వర్గములకు విహారస్థానము.
శ్రీమంతమగు ఆ మేరువును…
ఉపాసనాఖండము మొదటి భాగము
వ్యాసప్రశ్న వర్ణనం
భృగుమహర్షి ఇలా చెప్పనారంభించాడు "ఓరాజా! పరాశర మహర్షి తనయుడూ, సాక్షాత్ నారాయణుని అంశతో జన్మించినవాడూ అయిన కృష్ణద్వైపాయనుడని పిలువబడే వ్యాసమహర్షికి ఒకసారి తాను విభాగించిన వేదములయొక్క అర్థం స్ఫురించటం మానేసింది. స్థబ్దత తనను ఆవరించింది. త్రికాలవేదీ, పంచమవేదమైన మహాభారతాన్ని రచించినవాడూ, అష్టాదశ పురాణకర్తా ఐన వ్యాసభగవానుడు ఇందుకు చకితుడైనాడు. తాను…
మార్కండేయాఖ్యానము
బ్రహ్మ ఇట్లనియె.
మార్కండేయుడు ఆ పాపని కడుపునందుండి వెడలి వెలుపల ఒక్కటే సముద్రమయిన భూమిని నిర్జనమయిన దానిని దర్శించెను. మున్ను చూచిన ఆ బాలుని కూడా మర్రికొమ్మపై వటపత్ర పర్యంకమున నున్న శిశువును గాంచెను. శ్రీవత్స చిహ్నము ఉరమున దీపింప పీతాంబరము ధరించి ఆ పద్మపత్రలోచనుడు జగత్తును చేకొనియున్నట్లు దర్శించెను. ఆ బాలుడు కూడా తన ముఖము నుండి…
ఉపాసనాఖండము మొదటి భాగము
మంత్రకథనం
బ్రహ్మ వ్యాసునకు గణేశమంత్రమును చెప్పుట అనంతరం భృగుమహర్షి సోమకాంతుడికి యిలా చెప్పసాగాడు. "ఓరాజా! ఇట్లా వ్యాసమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పటం ప్రారంభించాడు.…
విస్తరేణ విష్ణు మార్కండేయ సంవాద కథనము
భగవంతుడట్లు మార్కండేయునిచే వినుతింపబడి మధుర గంభీరముగ నిట్లనియె. నీ మనసునందు గల కోర్కెయేమి? తెలుపుము. అవి ఎల్ల ఇచ్చెదను అన ముని ఆ దేవుని ఎడ మనసు నిలిపి ఇట్లనియె. స్వామి ! తామెవ్వరో నీ…